- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగ పర్వం: ధనిక రాష్ట్రంలో జీతాలు లేటెందుకు!?
ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక సంవత్సరం ముగింపు దశలో ఉండనున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఫిబ్రవరి, మార్చి మాసాలలో వేతనాలు మినహా మిగతా కొన్ని రకాల బిల్లులు మంజూరు చేయకుండా ఫ్రీజింగ్ పెట్టేవారు. ఈ మేరకు ముందే స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసేవారు. కానీ, ఎనిమిదేండ్ల కేసీఆర్ పాలనలో అధికారికంగా ఎప్పుడూ ఫ్రీజింగ్ ప్రకటించలేదు. కానీ, బిల్స్ మాత్రం మంజూరు కావు. సంపాదిత సెలవుల నగదు, మెడికల్ రీయింబర్స్‌మెంట్, పిల్లల ఫీజు రాయితీ, జీపీఎఫ్ అడ్వాన్సులు, పాక్షిక విత్ డ్రాయల్ తదితర బిల్లులు ఆరు నెలలు దాటినా శాంక్షన్ కావడం లేదు. ఇ-కుబేర్‌లో వీటిని పెండింగులో పెడుతున్నారు.
సకల జనుల సమ్మె చేసి కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక పరిస్థితి దారుణంగా తయారైంది. అప్పటికే ఉన్న సమస్యలు పరిష్కరించకపోగా, కొత్తవి సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎక్కడ జరిగినా 'ఎన్నికలు అయిపోయిన తర్వాత కూర్చుండి మాట్లాడుకుందాం! సమస్యలు పరిష్కరించుకుందాం' అని సీఎం ప్రతిసారి చెప్పడమే కానీ, ఆచరణలో ఇప్పటివరకు కూర్చున్నదీ లేదు, సమస్యలు పరిష్కరించిందీ లేదు.బిల్లులు చాలా వరకు పెండింగులోనే ఉంటున్నాయి.
నాలుగు దశాబ్దాలుగా రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ప్రతినెలా ఒకటో తేదీన ఠంచన్‌గా జీతాలు, పెన్షన్ అందుకుంటున్నారు. ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్న 90వ దశకంలో కూడా ఒకటో తేదినాడే వేతనాలు చెల్లించారు. కానీ, రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్ ఉన్న బంగారు తెలంగాణలో ఒకటో తేదీన ఎప్పుడు జీతాలు రాలేదు. రోజుకో జిల్లా చొప్పున వంతులవారీగా జీతాలు, పెన్షన్లు చెల్లిస్తున్నారు. చివరికి మొదటి వారంలో జీతాలు వస్తే సంతోషపడే స్థితికి ఉద్యోగులను తీసుకువచ్చారు. 317 జీఓ ద్వారా బదిలీ అయిన ఉద్యోగులకు జనవరి నెల వేతనం కూడా నేటికీ రాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించవచ్చు.
గవర్నెన్స్‌కి మచ్చే
ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక సంవత్సరం ముగింపు దశలో ఉండనున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఫిబ్రవరి, మార్చి మాసాలలో వేతనాలు మినహా మిగతా కొన్ని రకాల బిల్లులు మంజూరు చేయకుండా ఫ్రీజింగ్ పెట్టేవారు. ఈ మేరకు ముందే స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసేవారు. కానీ, ఎనిమిదేండ్ల కేసీఆర్ పాలనలో అధికారికంగా ఎప్పుడూ ఫ్రీజింగ్ ప్రకటించలేదు. కానీ, బిల్స్ మాత్రం మంజూరు కావు. సంపాదిత సెలవుల నగదు, మెడికల్ రీయింబర్స్‌మెంట్, పిల్లల ఫీజు రాయితీ, జీపీఎఫ్ అడ్వాన్సులు, పాక్షిక విత్ డ్రాయల్ తదితర బిల్లులు ఆరు నెలలు దాటినా శాంక్షన్ కావడం లేదు.
ఇ-కుబేర్‌లో వీటిని పెండింగులో పెడుతున్నారు. ఈ బిల్లులు ఈ నెల 31లోగా క్లియర్ కావాలి. లేని పక్షంలో మురిగిపోతాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది. గత ఏడాది కూడా ఇలాగే వేలాది బిల్స్ మురిగిపోయాయి. కూతురు పెండ్లికి జీపీఎఫ్ అడ్వాన్సు/పాక్షిక విత్ డ్రా కోసం దరఖాస్తు పెట్టుకుంటే మనుమరాలు బారసాలకి కూడా డబ్బు చేతికి వస్తుందో రాదో తెలియని దుస్థితి దాపురించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడబెట్టుకున్న జీపీఎఫ్ డబ్బులపై అనుచిత కంట్రోల్ ఎందుకో అర్థం కాదు. అయితే, కొంత మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల బిల్లులు మాత్రం వెంటవెంటనే మంజూరు అవుతున్నాయి. బిల్లుల మంజూరులో అధికారులు పారదర్శకత పాటించడం లేదు. ఫస్ట్ కం ఫస్ట్ సర్వుడ్ విధానం అమలు చేయకపోవడం గవర్నెన్స్ కి ఓ మచ్చే.
హెల్త్ కార్డ్‌పై ఎందుకు నిర్లక్ష్యం?
ఉద్యోగి రిటైరయ్యే రోజే రిటైర్మెంట్ ప్రయోజనాలు అందిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి పలుసార్లు ప్రకటించారు. ఆచరణలో మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. నగదు రహిత వైద్యం అందించేందుకు జారీ చేసిన హెల్త్ కార్డ్స్ ఎందుకూ పనికి రాకుండా పోయాయి. హెల్త్ కార్డ్స్ పై వైద్యం చేయడానికి ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ నిరాకరిస్తున్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ప్రతినెలా తమ వంతు వాటాగా కొంత మొత్తం చందా చెల్లించడానికి సుముఖంగా ఉన్నారని సంఘాలు లిఖితపూర్వకంగా తెలిపినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
హెల్త్ కార్డ్స్ విధానాన్ని పటిష్టపరచడం లో నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోంది. పోనీ, మెడికల్ రీయింబర్స్మెంట్ పరిమితి పెంచారా అంటే, అదీ లేదు. ఎప్పుడో 2005 లో నిర్ధారించిన రెండు లక్షల రూపాయల గరిష్ట పరిమితే నేటికీ అమల్లో ఉంది. పైగా, కరోనా ట్రీట్మెంట్‌కి రీయింబర్స్మెంట్ లిమిట్ ఒక లక్ష రూపాయలకు తగ్గించి, ఆర్థిక సమస్యలు పెంచారు. 2004 సెప్టెంబర్ తర్వాత ప్రభుత్వ కొలువులో చేరిన వారు సీపీఎస్ కారణంగా పూర్తి అభద్రతా భావంతో ఉన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని మొరపెట్టుకున్నా సీఎం కనికరం చూపడం లేదు. రాజస్థాన్ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, ఓల్డ్ పెన్షన్ స్కీంని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి.
బదిలీ, ప్రమోషన్లు నో!
ఉమ్మడి రాష్ట్రంలో ఏటా బదిలీలు జరిగేవి. స్వరాష్ట్రంలో మాత్రం ఈ ఎనిమిదేండ్లలో ఉద్యోగులకు ఏడేండ్లు, ఉపాధ్యాయులకు ఆరేండ్లు బదిలీలే లేవు. దీర్ఘకాలంగా బదిలీలు చేయకపోవడంతో దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు, స్పౌజ్ కేటగిరీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అనుభవిస్తున్న బాధలు ఇన్నీ అన్నీ కావు. 317 జీఓతో ఈ సమస్య ఇంకా ఎక్కువైంది. అయినా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏడేండ్లుగా ఉపాధ్యాయులకు ప్రమోషన్లే ఇవ్వలేదు. వందలాది మంది టీచర్లు ప్రతి నెలా రిటైర్ అవుతూనే ఉన్నారు.
పండిట్, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేస్తూ జీఓ జారీ చేశారు అమలు మరిచారు. ఆ పోస్టులను ఇంతవరకు కనీసం స్కూళ్లకు కూడా కేటాయించలేదు. 23 కొత్త జిల్లాలకు డీఈవో పోస్టులు,47 కొత్త మండలాలకు ఎంఈవో పోస్టులే మంజూరు చేయలేదు. సర్వీస్‌లో ఉండి మరణించినవారి కుటుంబ సభ్యులలో ఒకరికి పది రోజులలో కారుణ్య నియామకం ఇవ్వాలని సీఎం చెప్పి ఏళ్లు గడుస్తున్నా అమలుకు నోచుకోలేదు. మాటల్లో ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ సర్కారు అని చెప్తూనే ఆచరణలో దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. సమస్యలను సీఎం దృష్టికి తీసుకొనిపోవడానికి సంఘాలకు కనీసం అవకాశం కూడా ఇవ్వడం లేదు. ఆరేండ్లుగా సీఎం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. సీఎం తమ పట్ల అనుసరిస్తున్న వైఖరితో వారు తీవ్ర ఆవేదన లో ఉన్నారు.
మానేటి ప్రతాపరెడ్డి
టీఆర్‌టీఎఫ్ గౌరవాధ్యక్షుడు
98484 81028