- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యాపార వృద్ధిలో డిజిటల్ మార్కెటింగే ఎందుకు కీలకం?
ప్రపంచీకరణ విస్తరిస్తున్న తరుణంలో కాలానుగుణంగా మనం మారాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే వాణిజ్య సంస్థలన్నీ కొత్త దారులు వెతుక్కుంటూ వ్యాపార విస్తరణ చేసుకుంటున్నాయి. శాస్త్రీయ, సంప్రదాయ మార్కెంటింగ్ ను పక్కకు నెట్టి 'డిజిటల్ మార్కెటింగ్ కు తలుపులు తెరుస్తున్నారు.
డిజిటల్ మార్కెటింగ్‌లోకి ప్రవేశించపోతే భవిష్యత్తులో వ్యాపారం వృద్ధి చెందకుండా మన పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతుంది. దానికి ఉదాహరణే నోకియా సెల్ ఫోన్ల తయారీ కంపెనీ. ఒకప్పుడు మార్కెట్‌లో రాజ్యమేలిన నోకియా కంపెనీ నేడు దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. దానికి కారణం మారుతున్న కాలానుగుణంగా నోకియా మారకపోవడమే.
కస్టమర్లను ఆకర్షించే వ్యూహం
డిజిటల్ మార్కెటింగ్ వ్యాపారానికి ఎన్నో అవకాశాలను, వృద్ధిని తీసుకొస్తుంది. కంపెనీ వస్తువులను ప్రపంచానికి తెలియజేసి అమ్మకాలు పెంచుతోంది. వ్యాపారంలో వృద్ధి చెందాలంటే డిజిటల్ మార్కెటింగ్ మాత్రమే ఈ యుగంలో ఉత్తమ మార్గం. ఇందులో అతి ముఖ్యమైనది 'సోషల్ మీడియా' దీని ద్వారా వ్యాపారులు తమ బ్రాండ్ కు సంబంధించిన కంటెంట్ సృష్టించి తమ బ్రాండ్ ప్రమోట్ చేస్తారు. వ్యాపారులను, కస్టమర్లతో కమ్యూనికేట్ చేయగల వేదిక కూడా ఇదే.
సోషల్ మీడియాలో మీ ర్యాంకు ను నిర్ణయించేది 'సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్' దీనిని సరిగా నిర్వర్తిస్తే బ్రాండ్ ఇంకా ఎంతో మంది కస్టమర్లకు పరిచయమవుతుంది. ఇది చాలా తక్కువ ఖర్చుతో లభించే టూల్. ఇంకోక వ్యూహం 'పీపీసీ' దీనినే పేపర్ క్లిక్ అంటారు. దీని ద్వారా మన వెబ్ సైట్‌లో వచ్చే యాడ్స్‌ను క్లిక్ చేస్తే పబ్లిషర్‌కు డబ్బులు వస్తాయి. మిగితా వాటి కంటే దీని నుండి వచ్చే రెవెన్యూ చాలా ఎక్కువ. డిజిటల్ మార్కెటింగ్ లో మన వస్తువును ఎన్నో రకాలుగా ప్రమోట్ చేసుకోవచ్చు.
నమ్మకం కలిగించేలా
ఇప్పుడు పాపులర్ అవుతున్నది కంటెంట్ మార్కెటింగ్. ఇందులో కంపెనీపై నమ్మకం కలిగేలా వస్తువు ఎలా తయారవుతుందో, అది తయారు చేయడానికి ఏ వస్తువులు వాడుతున్నారో వీడియో రూపంలో కాని ఫొటోల రూపంలో కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కంపెనీని కస్టమర్లను దీర్ఘకాలం అట్టి పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ వ్యూహన్నే ఎక్కువ శాతం కంపెనీలు అనుసరిస్తున్నాయి. అందుకే 'వీడియో మార్కెటింగ్' అత్యంత ప్రజాదరణ పొందిన వ్యూహంగా మరింత కస్టమర్లను తీసుకువచ్చే సమర్థవంతమైన మార్కెటింగ్ వ్యూహంగా మారిపోయింది.
కంపెనీలకు తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో అత్యధిక రిటర్న్ కలిగి ఉన్న మార్కెటింగ్ 'ఈ మెయిల్ మార్కెటింగ్'ఇది కొంచెం పాత వ్యూహమైనా, ఒకేసారి వేలాది మందికి బ్రాండ్ ను తీసుకెళ్ళడం దీని ప్రత్యేకత. కంపెనీ కస్టమర్లను ఆకర్షించాలంటే దాని ప్రత్యేకతను అందరికి తెలియజేయాలి అప్పుడే దాని గురించి ఎక్కువ మందికి తెలిసి కొనుగోలు చేసేది.దాని గురించి వారు ఆన్ లైన్ లో ఏమి కనుగొన లేకపోతే కస్టమర్ గా కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది.అందుకే మారుతున్న కాలానుగుణంగా ఈ తరహా మార్కెటింగ్ ను సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది.
బ్రాండ్‌గా తీర్చిదిద్దడంలో కీలకం
సంప్రదాయ ప్రచారం ఎంతో ఖర్చుతో కూడుకున్నది. సమయం ఎక్కువ తీసుకునేది. అదే డిజిటల్ మార్కెటింగ్ అయితే చిన్న వ్యాపారం అయినా త్వరగా ప్రారంభించుకోవచ్చు. ఖర్చు తగ్గడంతో పాటు అత్యల్ప సమయంలో అత్యంత కస్టమర్లను మన వైపు చేర్చే అత్యుత్తమ సాధానం డిజిటల్ మార్కెటింగ్. దీని ద్వారా మన టార్గెట్ కస్టమర్లను సంపాదించుకోవచ్చు. ఇందులో మరో ముఖ్యమైన అంశం కస్టమర్ల సమస్యలు పరిష్కరించడం.
సంప్రదాయ మార్కెటింగ్‌లో ఇప్పటివరకు వ్యాపార కంపెనీలు చెప్పింది కస్టమర్లు విన్నారు. వారి స్పందన తెలుసుకునే అవకాశం కంపెనీలకు లేదు. డిజిటల్ మార్కెటింగ్‌లో కస్టమర్లు, వ్యాపారస్తులు సంబంధం ఏర్పరచుకోవచ్చు. మొబైల్ ఫోన్ల వినియోగం రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. దీనిని అవకాశంగా తీసుకొని వారి వారి బ్రాండ్లను ప్రమోట్ చేసుకొని కస్టమర్లకు మరింత చేరువవుతున్నాయి. వ్యాపారాన్ని ఎక్కువ మంది ప్రజల వద్దకు చేర్చి అధిక లాభాలు చేకూర్చేది డిజిటల్ మార్కెటింగ్ మాత్రమే.
శ్రీధర్ జక్కుల
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
9642632683