- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్థానచలనంపై... ఇంత రాద్ధాంతమెందుకు?
ఎన్నికల్లో ప్రణాళికాబద్ధంగా గెలుపు గుర్రాలను సిద్ధం చేసుకోవడం ప్రతీ పార్టీకి ప్రాణవాయువులాంటిది. ఈ సమయంలో.. పార్టీల ఇన్చార్జీలు, అభ్యర్థుల స్థానాల్లో మార్పులు, చేర్పులు సహజంగా జరిగేవే! భవిష్యత్‌లోనూ ఇవి కొనసాగుతాయి..మరి రాష్ట్రంలో అభ్యర్థుల మార్పు చేర్పులపై ఈ రాద్ధాంతం దేనికి?
రాజకీయ పార్టీలు ప్రతి ఎన్నికనూ ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటాయి. అలా సన్నద్ధమయినప్పుడే సక్సెస్ కొట్టగలుగుతాయి. అందుకు అనుగుణంగా వ్యూహం రూపొందించుకోవడం, ప్రచారం సాగించడమే కాకుండా తగిన అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం అత్యంత కీలకం అవుతుంది. ప్రణాళికాబద్ధంగా గెలుపు గుర్రాలను సిద్ధం చేసుకోవడం ప్రతీ పార్టీకి అవసరం. చివరి నిమిషం వరకూ కాలయాపన చేసి, ఆఖరులో అభ్యర్థులను ఖరారు చేయడంతో వచ్చే చిక్కులు అందరికీ తెలుసు. అందుకు విరుద్ధంగా ఒక్కో సీటులోనూ స్పష్టత ఇచ్చేస్తూ సమరానికి తగిన నేతను బరిలో దింపడం కొందరికే సాధ్యమవుతుంది. వైఎస్సార్సీపీ అధినేత జగన్ తీరు అందుకు తార్కాణంగా ఉంటుంది.
ఇప్పటికే రెండు సాధారణ ఎన్నికలను ఎదుర్కొన్న ఆ పార్టీ వ్యూహాలను పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది. 2019 ఎన్నికల్లో అయితే పూర్తిగా 175 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులతో పాటుగా 25 ఎంపీ సీట్లకు బరిలో దిగే వారి జాబితా ఒకేసారి వెల్లడించి వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారు. ఫలితాలు కూడా అదే రీతిలో సాధించారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే ఆయా అభ్యర్థులను ఖరారు చేసేసి, అధికారికంగా ఒకేసారి జాబితా విడుదల చేయడం ఆ పార్టీ జెండా విజయకేతనంలో తోడ్పడింది.
మంత్రులనే మార్చేశారుగా!
రాబోయే ఎన్నికలకు కూడా అదే పంథాలో ప్రణాళిక అనుసరిస్తున్నారు. అయితే ఇన్ఛార్జుల పేరుతో ఒక్కో సీటులోనూ తగిన నాయకులను తెరమీదకు తెస్తున్నారు. దానికి తగ్గట్టుగా వరుసగా ప్రకటనలు వస్తున్నాయి. అయితే ఈసారి కూడా వైఎస్సార్సీపీ తన అభ్యర్థుల స్థానాల మార్పునకు ప్రాధాన్యతనిస్తోంది. గతంలో ఇది అనుసరించినా, ఈసారి అధికారంలో ఉండగా, ఎన్నికలు ఎదుర్కోవాల్సి రావడంతో ఆ సంఖ్య కొంత పెరుగుతోంది. దానినే విపక్షాలు గోరంతను కొండంతలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.
గత ఎన్నికల్లో టీడీపీ కూడా ఏకంగా మంత్రులుగా ఉన్న వారిని జిల్లాలు మార్చేసిన చరిత్ర ఉంది. కొవ్వూరు నుంచి ప్రాతినిధ్యం వహించిన మంత్రి కేఎస్ జవహర్‌ని కృష్ణా జిల్లా తిరువూరికి మార్చి, కొవ్వూరులో విశాఖ జిల్లా నుంచి తెచ్చిన వంగలపూడి అనితను బరిలో దింపిన చరిత్ర చంద్రబాబుది. ఆ పార్టీకే చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ చరిత్ర యావత్తు వరుసగా స్థాన చలనాలే కదా. అలాంటివారు ఇంకా అనేక మంది ఉన్నారు. కానీ టీడీపీ చేసేదంతా సంసారమే, కానీ ఆ పార్టీ ప్రత్యర్థులు చేస్తే మాత్రం అది మరోలా చిత్రీకరించి దుష్ప్రచారానికి దిగడం దేనికి?
అభ్యర్థుల మార్పిడి కొత్త కాదే?
వాస్తవానికి స్థానచలనం ఈనాటిది కాదు. ఆరంభం నుంచీ ఉంది. దీనిని సమయస్ఫూర్తితో సాగించి సానుకూల ఫలితాలు సాధించిన అనుభవం కూడా ఉంది. 2014తో పోలిస్తే 2019లో జగన్ తన అభ్యర్థుల జాబితాలో ఒకేసారి 60 మంది కొత్తవారిని తెరమీదకు తెచ్చారు. విజయం సాధించారు.. ఈసారి అదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. తొలి రెండు జాబితాల్లో 38 మంది ఇన్ఛార్జీలు ఖరారయితే అందులో పాత వారి స్థానభ్రంశం తీసేస్తే మూడోవంతు కొత్త మొఖాలే. దీంతో తన సక్సెస్ మంత్రం మరోసారి పాటిస్తున్నట్టు తెలుస్తోంది.
సిట్టింగ్ ఎమ్మెల్యేలు గెలవలేరనే..!
ఇది గిట్టని వారు మాత్రం అదేదో తొలిసారి అన్నట్టుగా, గతంలో ఎన్నడూ జరగలేదన్నట్టుగా మాట్లాడడమే విడ్డూరం. చివరకు తన ఇంటి చెత్త, పక్కింటికి పోతే బంగారమవుతుందా అంటూ చంద్రబాబు మాట్లాడడమే విస్మయకరం. నిజంగా ఆ చెత్తను బంగారం చేయలేమని ఆయన భావిస్తే ఇతర సీట్లు వద్దు..కనీసం ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేందరినీ ఆయా స్థానాలలో నిలపగలరా? ఇటీవల ప్రోత్సహించి పార్టీలో చేర్చుకున్న ఫిరాయింపుదారులైన ఎమ్మెల్యేలను ఆయా సీట్లలో నిలబెట్టగలరా? తాను పాటించకుండా జగన్ అనుసరించే విధానాన్ని తప్పుబట్టడం సమంజసమేనా? బాబు భజన బృందాలకు అవేమీ పట్టవా? కాబట్టి స్థానచలనం నాడు-నేడు కూడా ఉంది. భవిష్యత్‌లో సైతం కొనసాగుతుంది.
అడబాల రాము
సీనియర్ జర్నలిస్ట్