- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మనిషితనాన్ని నేర్పుతున్న ట్రెక్కింగ్
ట్రెక్కింగ్ అంటే పరుగులెత్తడం కాదు. అడవి తల్లిని హత్తుకోవడం. జంతుజాలాన్ని ప్రేమించడం. ట్రెక్కింగ్ అంటే ఉరకలెత్తడం కాదు. అడవి తల్లిని కాపాడడం. జంతుజాలాన్ని వాటి బతుకును అవి బతకనివ్వడం. ట్రెక్కింగ్ అంటే సమిష్ఠి తత్వాన్ని అలవర్చుకోవడం. సామాజిక బాధ్యతను అలవరుచుకోవడం. క్రీడా స్ఫూర్తిలాగానే ట్రెక్కింగ్ స్ఫూర్తిని పొందడం. అడవికి వెళితే మన హెూదాల్ని పక్కన పెట్టాలి. మనం పుట్టిన కులాన్ని పక్కన పెట్టాలి. మనం పుట్టిన మతాన్ని పక్కన పెట్టాలి. సమస్త సామాజిక వికారాలనూ వదిలేసుకోవాలి. వదలకపోతే కుదరదు. అక్కడ కూడా నేను డైరెక్టరును, మేనేజింగ్ డైరెక్టరును అంటే కుదరదు. నేను ఉన్నత కులస్థుడిననుకుంటే కుదరనే కుదరదు. నాది పాలకమతం అనుకుంటే అస్సలు కుదరదు. ఆ సామాజిక హెూదాలు తలకెక్కి అడవిలో ఒంటరిగా ఉన్నామా ఏ జంతువైనా దాడి చేయచ్చు. ఆ అడవి జంతువులకు 'మన గురించి' , ‘మన గొప్పతనం' గురించి అస్సలు తెలియదు కాక తెలియదు ! మనది ఉన్నత కులమని, మనది పాలకమతమని, మనమొక ఉన్నత స్థానంలో పనిచేశామని వాటికి తెలీనే తెలీదు.
ట్రెక్కింగ్ అంటే పరుగులెత్తడం కాదు. అడవి తల్లిని హత్తుకోవడం. జంతుజాలాన్ని ప్రేమించడం. ట్రెక్కింగ్ అంటే ఉరకలెత్తడం కాదు. అడవి తల్లిని కాపాడడం. జంతుజాలాన్ని వాటి బతుకును అవి బతకనివ్వడం. ట్రెక్కింగ్ అంటే సమిష్ఠి తత్వాన్ని అలవర్చుకోవడం. సామాజిక బాధ్యతను అలవరుచుకోవడం. క్రీడా స్ఫూర్తిలాగానే ట్రెక్కింగ్ స్ఫూర్తిని పొందడం.
ట్రెక్కింగ్ స్ఫూర్తి అంటే..!
అడవికి వెళితే మన హెూదాల్ని పక్కన పెట్టాలి. మనం పుట్టిన కులాన్ని పక్కన పెట్టాలి. మనం పుట్టిన మతాన్ని పక్కన పెట్టాలి. సమస్త సామాజిక వికారాలనూ వదిలేసుకోవాలి. వదలకపోతే కుదరదు. అక్కడ కూడా నేను డైరెక్టరును, మేనేజింగ్ డైరెక్టరును అంటే కుదరదు. నేను ఉన్నత కులస్థుడిననుకుంటే కుదరనే కుదరదు. నాది పాలకమతం అనుకుంటే అస్సలు కుదరదు. ఆ సామాజిక హెూదాలు తలకెక్కి అడవిలో ఒంటరిగా ఉన్నామా ఏ జంతువైనా దాడి చేయచ్చు. ఆ అడవి జంతువులకు 'మన గురించి' , ‘మన గొప్పతనం' గురించి అస్సలు తెలియదు కాక తెలియదు ! మనది ఉన్నత కులమని, మనది పాలకమతమని, మనమొక ఉన్నత స్థానంలో పనిచేశామని వాటికి తెలీదు మరి.
ఒంటరిగా ఉంటే ఏ ఎలుగు బంటో వచ్చి కావిలించుకుంటుంది. ఏ ముళ్ళ పందో వచ్చి గుచ్చేస్తుంది. పొదల్లో దాగున్న ఏ చిరుతపులో లటుక్కున మన పీక పట్టుకుంటుంది. పొదల్లోకి లాక్కుపోతుంది. అప్పుడు కులమో, మతమో, హెూదానో పనిచేయవు. మన చుట్టూ ఆత్మీయమైన మనుషులుంటే మనకా పరిస్థితి దాపురించదు. అందుకే పదిమందితో కలిసి వెళ్ళాలి. సమిష్టిగా ఉండాలి. అందరితో స్నేహంగా మెలగాలి. ఒకరి తిండి మరొకరు లాక్కుని మరీ తినేలా ఉండాలి. మన తిండి మరొకరికి పెట్టాలి. చిన్న నా బొజ్జకు శ్రీరామ రక్షగా ఉంటే కుదరదు. కనీసం ట్రెక్కింగ్లో నైనా.. ట్రెక్కింగ్లో ఇవి అలవాటు చేసుకుంటే బయట సమాజంలో కూడా మనుషులుగా మనగలుగుతాం. అదే ట్రెక్కింగ్ స్ఫూర్తి.
పది మంది ఉంటే చాలు, ఏనుగంత ధైర్యం వచ్చేస్తుంది. నిట్టనిలువునా ఉన్న కొండను ఎక్కేయగలమన్న గుండె ధైర్యం వచ్చేస్తుంది. లోతైన లోయలోకి గబగబా దిగేయగలుగుతాం. ఒకరికొకరు సాయం చేసుకుంటాం. నిజానికి అడవి జంతువులు క్రూరమైనవి అనుకుంటాం. మనపైన దాడి చేస్తాయని భయపడతాం. కానీ, అది పచ్చి అబద్ధం. వాస్తవానికి అడవి జంతువులన్నీ ఒట్టి పిరికి సన్నాసులు. మనుషుల్ని చూస్తే వాటికి చచ్చే భయం. ఆకలి వేస్తేనే వేటాడతాయి. ప్రాణ భయంతోనే దాడి చేస్తాయి. మనల్ని చూస్తే పరుగులు తీస్తాయి. మానవ అలికిడి వినిపిస్తే పారిపోతాయి. అడవిలో మన అలికిడి వినగానే తీతువు పిట్ట అరుస్తుంది. 'మన శత్రువొస్తున్నాడు జాగ్రత్త' అడవి జంతువులకు అదొక హెచ్చరిక, అదొక సైరన్.
శేషాచలం కొండల్లో పాతికేళ్ళకు పైగా తిరుగుతున్నాం. చూద్దామన్నా ఒక్క చిరుతపులి కనిపించలేదు. ఒక్క ఎలుగుబంటి కనిపించలేదు. తెల్లవారు జామునో, చీకటి పడుతున్న వేళనో కొన్ని జంతువులు కనిపించాయి. ముఖ్యంగా కొన్ని నెమళ్ళు కనిపించాయి, అడవి కోళ్ళు కనిపించాయి. మా అలికిడి విని పారిపోయాయి. ఎక్కడ కోసుకు తినేస్తామోనని. సీతాకోక చిలుకలు కనిపిస్తాయి. ఎంత స్వేచ్ఛగా ఎగురుతుంటాయో! దూరంగా చెట్లపై పిట్టలు, రకరకాల పక్షులు కనిపిస్తాయి. మనల్ని చూస్తే వాటికీ భయమే; చంపుకు తినేస్తామని. జింకలు, దుప్పులు గుంపులు గుంపులుగా పరుగులు తీయడం చూశాం. అడవిలో మన అడుగుల ప్రకంపనలకు తాచు పాములు కూడా పారిపోతాయి. శేషాచలం కొండల్లో మిగతా క్రూర జంతువులు లేవా అంటే, అన్నీ ఉన్నాయి. మనల్ని చూస్తే వాటికి చచ్చే భయం. మన అలికిడి విని చిరుతలు కూడా ఏ రెల్లు పొదల్లోనో దాక్కునేస్తాయి. అన్ని జంతువులనూ మనిషి వేటాడతాడు. అవసరం లేకపోయినా చంపేస్తాడు. చర్మం కోసమో, కొమ్ముల కోసమో, దంతాల కోసమో, మాంసం కోసమో ; కారణమేదైతేనేం, కనిపించిన అన్ని జంతువులను వేటాడతాడు. చివరికి ఏనుగులను కూడా చంపేస్తాడు వాటి దంతాల కోసం!
అన్ని రకాల చెట్లను, జంతువులను బతికనిస్తేనే జీవ వైవిధ్యం. మనల్ని చూసి జంతువులన్నీ భయపడతాయి. ఏనుగు భయపడదు. దాన్ని చూసి మనం భయపడాలి. మనం ఎంత మందిమి ఉన్నా ఏనుగులు వెంటపడతాయి. వాటిని తప్పించుకోవడం కష్టం. ఏనుగులు తిరిగిన ఆనవాళ్ళున్న ప్రాంతానికి మనం వెళ్లకపోవడమే మంచిది. ఏనుగులకు లేత వెదుర్లంటే ఇష్టం. వాటి చిగుళ్ళంటే ఇష్టం. వెదురు పొదలున్న చోట, నీళ్ళున్న చోట తిరుగాడుతాయి. రోజుకు నలభై కిలోమీటర్ల వరకు నడుస్తాయి. ఎక్కడైతే వెదుర్లు విరిగి పడ్డాయో, అక్కడ ఏనుగులు తిరుగాడాయని అర్థం. ఏనుగులు ఎన్నిరోజుల క్రితం తిరిగాడాయనేది కూడా తెలిసిపోతుంది. వాటి విసర్జితాలు పచ్చిదనాన్ని బట్టి అంచనా వేయవచ్చు. వాటికి తెల్ల దుస్తులంటే మహా చికాకు. అడవికి వెళ్ళేటప్పుడు తెల్ల దుస్తులు వేసుకోకపోవడమే మంచిది. వెంటబడతాయి. మనం పరుగెడితే మన కంటే వేగంగా పరుగెడతాయి. ఎత్తుగా ఉన్న కొండపైకి ఎక్కితే, మన కంటే వేగంగా కొండెక్కుతాయి. అలాంటి సమయంలో లోయలోకి దిగడమే మంచిది. మనం దిగినంత వేగంగా అవి లోయలోకి దిగలేవు. తామున్న బరువుకు పడిపోతామని భయం. దిగువకు పరుగెత్తదలిస్తే ఇంగ్లీషు Z (జడ్) ఆకారంలో పరుగెత్తాలి. వాటి చూపును తిప్పించుకోవచ్చు. మనం చూసినట్టు 180 డిగ్రీల కోణంలో చూడలేవు. చూడాలంటే శరీరం మొత్తాన్ని కదిలించుకోవాలి.
గుండె జబ్బులున్న వాళ్ళు ట్రెక్కింగ్‌కు వెళ్ళకపోవడమే మంచిది. అడవిలో ఆరోగ్య సమస్య వస్తే వైద్యం అందదు. తిరిగి మోసుకు రావడం సాధ్యం కాదు. కొందరికి మినహాయింపులూ ఉన్నాయి. నెల్లూరుకు చెందిన విజయభాస్కరరెడ్డి మంచి ట్రెక్కర్. ఆయనకు బైపాస్ సర్జరీ జరిగింది. ఇప్పుడాయన వయసు 72 ఏళ్ళు. యువకులతో సమంగా ట్రెక్కింగ్ కు వస్తూనే ఉన్నారు. రోజూ జిమ్‌కి వెళ్ళి వ్యాయామం చేస్తారు. ఆహార నియమాలూ పాటిస్తారు. మోకాళ్ళు అరిగాయని ఆర్తో సర్జన్ చెప్పినా పట్టించుకోరు. ట్రెక్కింగుకు వెళ్ళవద్దని వైద్యులు చెప్పినా వినరు. ఆయనకు ట్రెక్కింగ్ అంటే ప్రాణం.
మోకాళ్ళకు నీ క్యాపులో, నీ గార్డులో అవసరం. అవ్వేసుకుని నడుస్తుంటే అనుకూలంగా ఉంటుంది. టోపీ అవసరం. ఇతరులకు పెట్టడానికి కాదు, ఎండ కోసం. స్కూలు పిల్లలు వేసుకున్నట్టు బుజానికి బ్యాగు అవసరం. నీళ్ళు ప్రాణాధారం. ప్రతి చోటా జలపాతాలు, సెలఏర్లుండవు. రోజుకు కనీసం రెండు లీటర్ల నీళ్లు అవసరం. ఊతానికి చేతిలో కర్ర ఉంటే మంచిది. రోజుకు సరిపడ ఆహారం తప్పనిసరి. బ్యాగు ఎంత తక్కువ బరువుంటే నడక అంత సులువు. ఈ స్ఫూర్తితో అడవికి వెళదాం రండి. మానసిక ఆరోగ్యంతో తిరిగొద్దాం రండి.
-రాఘవశర్మ
సీనియర్ జర్నలిస్టు, రచయిత
94932 26180
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672