- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రవేశ పరీక్షల్లో సీటు రావాలంటే...
దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఇంటర్ పరీక్షలు రాసిన యం.పి.సి, బై.పి.సి విద్యార్థులు ఐఐటీ జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు చాలా మానసిక ఒత్తిడితో ఛాలెంజింగ్‌గా ప్రిపేర్ అవుతుంటారు. నీట్ పరీక్షకు దాదాపు ఇరవై ఐదు లక్షల మంది విద్యార్థులు పైగా పోటీపడుతున్నారు. మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కూడా దాదాపు హైస్కూల్ స్థాయి నుంచే ఈ ప్రవేశ పరీక్షల కోసం లక్షల రూపాయలు ఫీజులు కడుతూ ప్రత్యేక ప్రణాళికతో ప్రిపేర్ అవుతుంటారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ ఫలితాలపై పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటుంటారు. భావి భారత ఇంజనీర్లు, డాక్టర్లుగా ఎదిగి దేశసేవ చేయాలనుకుంటారు. ఈ రెండు పరీక్షలకు కామన్ సబ్జెక్ట్‌లు ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఈ రెండింటిలో ఫిజిక్స్ కొంచెం టఫ్ సబ్జెక్ట్. ఫిజిక్స్ లోని సమస్యల సాధన గురించి విద్యార్థులు ఆందోళన చెందుతుంటారు.
ఫిజిక్స్‌తో ఒత్తిడి లేని స్నేహం
ఈ ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించాలంటే ఖచ్చితంగా ఫిజిక్స్‌లో పట్టుండాలి. కాబట్టి విద్యార్థులు ఫిజిక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రతి రోజు ఓ ప్రణాళిక ప్రకారం కాన్సెప్ట్‌లను, సూత్రాలను, ప్రమాణాలను మార్చడం వంటివి రివిజన్ చేయాలి. గ్రూప్ డిస్కషన్ చేయాలి. అధ్యాపకుల సలహాలు పాటించాలి. మిగతా సబ్జెక్ట్‌లను కూడా బాగా ప్రిపేర్ అవుతూ భౌతిక శాస్త్రంతో మానసికంగా ఒత్తిడి లేని స్నేహం చేయాలి. ఈ రెండు నెలలు మొబైల్ ఫోన్‌కు, సోషల్ మీడియాకు విద్యార్థులు దూరంగా వుంటూ ప్రశాంత వాతావరణంలో ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ పరీక్షలకు ప్రిపేర్ కావాలి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ ప్రవేశ పరీక్షల్లో సీటు రాకపోతే ఇక జీవితంలో అంతా వృథా అనుకునే ధోరణి ఈ సమాజంలో మారాలి.
సీటు రాకుంటే జీవితం వృధాయేనా?
కేవలం ఐఐటీలు, నీట్‌లో ర్యాంకులే మన తెలివితేటలకు నిదర్శనం కాదు. ప్రయత్నం మాత్రమే మన చేతిలో, చేతల్లో వుంటుంది. ఫలితం విశ్లేషించుకోవాలి కానీ జీవితం ముగించాలను కోకూడదు. చదవడం, బతకడం రెండు జీవితంలో చాలా ముఖ్యం. ఉద్యోగం చేస్తే వచ్చే డబ్బు మన అవసరాల కోసమే. ప్రతి రోజు సూర్యోదయంలా ఆశతో, వెలుగుతో మరో ప్రయత్నం చేద్దాం మన కలల కోసం. గెలుపోటములు తాత్కాలికం. చంద్రయాన్ 2 కూడా సాఫ్ట్ ల్యాండింగ్‌లో విఫలమైంది. మళ్ళీ మన శాస్త్రజ్ఞులు పడిన కొన్ని సంవత్సరాల అలుపెరగని కష్టం తర్వాతే చంద్రయాన్-3 విజయంతో విక్రమ్ ల్యాండర్ చరిత్ర సృష్టించింది. వారిలాగే మనమూ స్ఫూర్తి నింపుకుందాం. ఆల్ ది బెస్ట్
ఫిజిక్స్ అరుణ్ కుమార్
ఫిజిక్స్ ఫ్యాకల్టీ, నాగర్ కర్నూల్
93947 49536