సమస్యల వలయంలో రాష్ట్ర పెన్షనర్లు..

by Ravi |   ( Updated:2025-01-04 00:30:38.0  )
సమస్యల వలయంలో రాష్ట్ర పెన్షనర్లు..
X

రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు అనేక సమస్యలతో చాలా కాలంగా సతమతమవుతున్నారు. వీరు సర్వీస్‌లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పథకాలను ఫలప్రదం చేయడం కోసం అహర్నిశలు కృషి చేసినవారే. అందుకే వారి బాగోగులు చూడాల్సిన ప్రభుత్వం, వారిని పట్టించుకోకపోవడం వలన, చాలా ఇబ్బందులు పడుతూ జీవనం గడుపుతున్నారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేర్చుతామని ఇచ్చిన హామీలలో ఒక్క హామీ కూడా అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినా నెరవేర్చలేదు.

పెన్షనర్ల సమస్యలు..

2024 మార్చి నుండి రిటైరైన పెన్షనర్లకు పెన్షన్ తప్ప, ఏ పెన్షనరీ బెనిఫిట్స్ నేటి వరకు చెల్లించలేదు. వాటిని వెంటనే చెల్లించాలి. పెండింగ్‌లో ఉన్న మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు వెంటనే చెల్లించాలి. బకాయిపడిన కరువు భత్యం విడుదల చేసి నగదుగా ఒకేసారి చెల్లించాలి. స్పెషల్ టీచర్ల సర్వీస్‌కు నోషనల్ ఇన్క్రి మెంట్లు మంజూరు చేసి, పెన్షనరీ బెనిఫిట్స్‌కు అనుమతించాలి. తెలంగాణ మొదటి పీ‌ఆర్‌సీ రికమెండ్ చేసినట్లు జూలై 2018 నుండి 20 సం.ల సర్వీస్‌కు పూర్తి (ఫుల్) పెన్షన్ ఇవ్వాలి. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం ప్రవేశ పెట్టాలి. ప్రతి జిల్లాకు రెండు వెల్ నెస్ సెంటర్లను ఏర్పాటు చేసి నిష్ణాతులైన వైద్యులను నియమించి ఉచితంగా టెస్టులు చేసి, నాణ్యమైన మందులను అందజేయాలి. ఆర్‌టీసీ బస్‌లలో ఉచిత లేదా 50 శాతం రాయితీతో ప్రయాణ సౌకర్యం కల్పించాలి. ఈ కుబేర్ వ్యవస్థను రద్దు పరిచి గతంలో ఉన్నట్లుగా ట్రెజరీస్ డిపార్ట్‌మెంట్ ద్వారా చెల్లింపులు జరపాలి. పై సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచన చేసి ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి పెట్టి పెన్షనర్ల సమస్యలు పరిష్కరించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే ప్రయత్నం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లు కోరుకొంటున్నారు.

- వెలిశోజు రామ మనోహర్

రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం

99499 05035

Advertisement

Next Story