- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గురుత్వాకర్షణ శక్తి పనిచేయని ప్రదేశాలు ఇవే?
ఈ సృష్టిలో ఎన్నో అద్భుతాలు, అంతుపట్ట లేని వింతలు, విశేషాలు ఉన్నాయి. వాటిలో సగటు మనిషికి ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చి అబ్బురపరిచే ప్రకృతి దృశ్యాలూ ఉన్నాయి. ప్రత్యక్షంగా చూస్తేగానీ నమ్మలేని అద్భుతాలు అవి. వాటి మీద ఎన్నో పరిశోధనలు చేసినప్పటికీ శాస్త్రవేత్తలు కూడా సరైన కారణాలు అన్వేషించలేకపోతున్నారు. ఒక వస్తువును పైకి విసిరితే తిరిగి ఆ వస్తువు కిందకు పడటానికి కారణం భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి అని మనం పాఠ్యపుస్తకాలలో చదువుకున్నం. దీనిని న్యూటన్ తన గమన సూత్రాల ద్వారా నిర్వచించాడు.పైకి విసిరిన వస్తువు కింద పడకుండా ఉండటం సాధ్యమేనా? అనే సందేహం చాలా మందికి కలగడం సహజమే. గురుత్వాకర్షణ శక్తి ధిక్కరించిన చోట పైకి విసిరిన వస్తువు కింద పడకుండా ఉండటం సాధ్యమే. ఈ భూగోళంలో గురుత్వాకర్షణ శక్తి పనిచేయని ప్రదేశాలు ఐదు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు.
1. మాగ్నెటిక్ హిల్ (లేహ్, లడఖ్, ఇండియా)
మన దేశంలోని లడఖ్ ప్రాంతంలోని లేహ్ జిల్లాకు 30 కిలోమీటర్ల దూరంలో సుందర దృశ్యాలతో మాగ్నెటిక్ హిల్ కనిపిస్తుంది. ఇది సముద్ర మట్టం కంటే 14,000 అడుగుల ఎత్తులో లేహ్-కార్గిల్-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉంది. దీనికి తూర్పున సింధు నది ప్రవహిస్తుంది. ఇక్కడికి చేరుకోగానే ఓ పసుపు రంగు సైన్ బోర్డు పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తుంది. 'ఇది అయస్కాంత కొండ, ఇది గురుత్వాకర్షణను ధిక్కరించే దృగ్విషయం. ఇది అనుభవించాలంటే మీ వాహనాన్ని రోడ్డుపై తెల్లటి పెయింట్ గుర్తు పెట్టబడిన పెట్టెలో పార్క్ చేయండి' అని అందులో రాసి ఉంటుంది.
అక్కడ పార్క్ చేసే వాహనం ఇంజిన్ ఆపినా సరే గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కొండ పైకి ఎక్కినట్లు కనిపిస్తుంది. వాహనం ఆపిన చోట నుంచి కింది భాగంలో లోతు ఉన్నా సరే వాహనం మాత్రం పైకి వెళుతున్నట్టుగానే అనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ అర్థం కాని వింత ఇది. ఆ కొండకు అయస్కాంత శక్తి ఉండటం వలన అలా జరుగుతుందని కొందరు, ఆ ప్రాంతంలో అదృశ్య శక్తులున్నాయని కొందరు, ఆప్టికల్ ఇల్యూషన్ (దృశ్య భ్రమ) అని కొందరు, చుట్టుపక్కల భూమి ఆప్టికల్ భ్రమ ఉత్పత్తి చేసే ప్రాంతం కనుకే అలా కనిపిస్తుందని ఇంకొందరు చెబుతారు. దీనిని సందర్శించడానికి జూలై, అక్టోబర్ నెలలు అనుకూలం
2. సెయింట్ ఇగ్నాస్ మిస్టరీ స్పాట్ (మిచిగాన్, అమెరికా)
ప్రస్తుతం అమెరికా మిచిగాన్‌లోని సెయింట్ ఇగ్నాస్ ప్రాంతంలో ఒక మిస్టరీ స్పాట్ గొప్ప టూరిస్టు కేంద్రంగా ప్రసిద్ధి గాంచింది. దీనిని మొదట ఎవరూ గుర్తించలేకపోయారు. 1939లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా కొందరు సర్వేయర్లు మిస్టరీ స్పాట్ ప్రత్యేకతలను గుర్తించారు. వారు మొదటిసారి సెయింట్ ఇగ్నాస్ వచ్చినప్పుడు వారి దగ్గరున్న పరికరాలన్నీ పని చేయకుండా స్తంభించిపోయాయి. దీంతో వారు ఆశ్చర్యపోతూ కారణాల కోసం పరిశోధనలు చేశారు.
ఆ ప్రాంతంలోని 300 అడుగుల డయామీటర్ సర్కిల్‌లో మాత్రమే ఇలా జరుగుతుందని తేలింది. ఈ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తుల ఎత్తులు వేరువేరుగా ఉన్నా వారు అక్కడి రాయి ఎక్కగానే ఇద్దరూ ఒకే విధంగా కనిపిస్తారని, ఇక్కడ మనిషి గోడపై వాలుగా నిలబడవచ్చని తేల్చారు. దానికి గల కారణాలు ఆప్టికల్ ఇల్యూషన్ తప్ప మరొకటి లేదని చెప్పడమే తప్ప కచ్చితమైన కారణాలను చెప్పలేకపోయారు. దీని గురించి తెలిసి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వందల వేల మంది సందర్శకులను ఈ స్పాట్ ఆశ్చర్యపరుస్తుంది.
3. మిస్టరీ స్పాట్ (శాంతాక్రజ్, కాలిఫోర్నియా)
ఇది కూడా సెయింట్ ఇగ్నాస్ మిస్టరీ స్పాట్ లాంటిదే. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాంతాక్రజ్ సమీపంలో ఉన్న ఓ అడవి ప్రాంతంలో 150 అడుగుల వ్యాసార్థంలో ఉన్నవారు పక్కకు వంగగలరు. వంకరగా నడవగలరు, వారు ఓ కొండను ఎక్కుతున్నట్లు కనిపిస్తుంది. దీనికి కారణం ఆప్టికల్ ఇల్యూషన్ అనే చెబుతున్నారు. ఖచ్చితమైన కారణం చెప్పడం లేదు. ఆ మిస్టరీ అనుభవించడానికి చాలా మంది టూరిస్టులు వస్తుంటారు.
4. జలపాతం (ఫారో ఐలాండ్స్)
స్కాట్లాండ్-ఐలాండ్ మధ్యన అట్లాంటిక్ సముద్రంలోని ఫారో దీవులలో ఉన్న జలపాతంలోనీ నీరు కిందకు కాకుండా 75 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో పైకి వెళుతున్నట్టు కనిపిస్తుంది. సాధారణంగా నీరు పై భాగం నుండి కిందకు పడుతుంది. కానీ, ఇక్కడ జరిగేది వేరు. దీనికి కారణం అక్కడ బలమైన గాలి వీయడం ద్వారా ఇటువంటి ఆశ్చర్యకరం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
5 . హూవర్ డ్యామ్ (నెవాడా, అమెరికా)
ఈ డ్యామ్ అమెరికా లోని అరిజోనా-నెవాడా రాష్ట్రాల సరిహద్దులలో ఉంది. దీనిని ఒకప్పుడు బౌల్డర్ డ్యామ్‌గా పిలిచేవారు. ఇది కొలరాడో నది బ్లాక్ కేనియాన్‌లో నిర్మించబడిన ఆర్చ్-గ్రావిటీ డ్యామ్. ఇది లాస్ వేగాస్ నుండి 37 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడికి వెళ్లిన వారికి అక్కడున్న అద్భుతాలను చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ డ్యామ్ పై నుంచి ఓ బాటిల్ నుంచి నీటిని కిందకు జారవిడిస్తే ఆ నీరు కిందకు పడకుండా ఆకాశం వైపు వెళ్తుంది. ఎన్నిసార్లు చేసినా నీరు పైకే వెళ్తుంది. దీనిపై ఎన్నో పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు ఆ డ్యామ్ దగ్గర గాలి కింద నుంచి పైకి ఎక్కువగా వీస్తోందని. ఆ గాలినే నీటిని పైకి తోసేస్తుందని వెల్లడించారు. అయినా ఇదొక వింతలాగే భావించి పర్యాటకులు దీనిని సందర్శిస్తుంటారు.
కోట దామోదర్
93914 80475