- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వికలాంగుల సంక్షేమం పట్టదా?
పాలకులు మారినా, పాలసీలు మారినా వికలాంగుల సంక్షేమం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. సంక్షేమం కోసం ఎన్నో చర్యలు చేపట్టాల్సి ఉండగా, పాలకులు వికలాంగుల పట్ల వివక్ష చూపుతున్నారు. వారికి హామీలు ఇచ్చి అమలు చేయడం లేదు. రాష్ట్రంలో 21 రకాల వైకల్యాల ప్రకారం సుమారు 43.04 లక్షల మంది వికలాంగులు ఉన్నారు. వారికి ప్రస్తుతం రూ. 4016 పెన్షన్ ఇస్తున్నారు. దీనిని రూ.10,000లకు పెంచాలి. ఆసరా పెన్షన్లకు ఆదాయపరిమితి విధించే జీవో నెంబర్ 17 రద్దు చేయాలి. అలాగే 40% వైకల్యం కలిగిన వికలాంగులందరికీ పెన్షన్లు మంజూరు చేయాలి. వీరికి నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ కల్పించాలి. వారి కుటుంబాలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలి. ఆర్టీసీ, రైల్వేలో ఉచిత ప్రయాణం కల్పించాలి. వారి ఉద్యోగ నియామకాల రోస్టర్ 10 లోపు తగ్గించాలి. వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలి. వీరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు చేయాలి. వీరి సంక్షేమం కోసం వికలాంగుల బంధు పథకం ప్రవేశపెట్టాలి. దళిత బంధులో ఐదు శాతం కేటాయించాలి. వికలాంగులకు అంత్యోదయ రేషన్ కార్డులు ఇవ్వాలి. రేషన్ షాపులు ద్వారా నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలి. స్థలం లేని వికలాంగులకు 120 గజాల స్థలం కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలి. వీరికి ప్రతినెల సదరం క్యాంపు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీరికి అన్ని సౌకర్యాలు కల్పించాలి.
గారడీ మాటలు మానండి!
అలాగే వికలాంగులైన కళాకారులను వృత్తి కళాకారులు గుర్తించి సాంస్కృతిక శాఖ ద్వారా గుర్తింపు కార్డులు ఇవ్వాలి. సాంస్కృతిక సారథి ఉద్యోగాల్లో నాలుగు శాతం కేటాయించాలి. వీరిని వివాహం చేసుకుంటే ప్రోత్సహకం పెంచాలి. అలాగే వికలాంగుల్లోని క్రీడాకారులని గుర్తించి వసతితో కూడిన శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. దీని అమలు పర్యవేక్షణ కోసం రాష్ట్ర జిల్లా మండల స్థాయిలో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయాలి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికోసం రాష్ట్ర కేంద్రంతో పాటు ప్రతి జిల్లా కేంద్రంలో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి ఉచిత శిక్షణ వసతి మెటీరియల్ ఇవ్వాలి. ప్రభుత్వం నుండి సహాయం పొందుతున్న ప్రైవేట్ సంస్థలు నాలుగు శాతం ఉద్యోగాలు వికలాంగుల ఇవ్వాలి. పంచాయతీరాజ్ మున్సిపల్ ఆర్టీసీ శాఖలు నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్లో 25% అద్దెకి షాప్స్ కేటాయించాలి.
వికలాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న టీసీపీసీ కేంద్రాలను బలోపేతం చేయాలి. ప్రతి జిల్లా కేంద్రంలో టీసీపీసీ సెంటర్స్‌ను ఏర్పాటు చేయాలి. వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా మారుస్తూ విడుదల చేసిన జీవో నెంబర్ 33ను అమలు చేసి 33 జిల్లాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ సిబ్బందిని నియమించాలి. వారికి ప్రభుత్వ బడ్జెట్లో ఐదు శాతం కేటాయించాలి. ప్రభుత్వ శాఖలన్నీ ఐదు శాతం నిధులు వికలాంగుల సంక్షేమానికి ఖర్చు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. మానసిక వికలాంగుల కోసం జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక హోం ఏర్పాటు చేయాలి. 33 జిల్లాల్లో వికలాంగుల కోసం హాస్టల్స్ హోమ్స్ నిర్మించాలి. వీరి సంక్షేమంపై మాటలతో గారడీలు చేయడం మాని కార్యాచరణ చూపాలి.
రావుల రాజేశం
లెక్చరర్, సామాజికవేత్త
98488 11424