ప్రభుత్వ ఉద్యోగాలపై పేరాశ వద్దు!

by Ravi |   ( Updated:2024-11-21 00:31:00.0  )
ప్రభుత్వ ఉద్యోగాలపై పేరాశ వద్దు!
X

సెకండరీ విద్య, ఆపై ఉన్నత చదువులు చదివిన తెలంగాణకు చెందిన యువత ఎక్కువగా నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నట్లు ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 నివేదిక వెల్లడించింది. నిరుద్యోగిత అబ్బాయిల్లో 18.3% కంటే అమ్మాయిల్లో 30.3% గా ఉంది. అదే జాతీయ స్థాయిలో 65.7% ఉంది.

పెరిగిన నిరుద్యోగుల శాతం..

ప్రస్తుతం పోటీతత్వంలో పరుగులు తీస్తున్న ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు సాధించాలంటే విద్యార్హతలు ఎన్ని ఉన్నా, సరైన నైపుణ్యాలు.. సంస్థకి కావలసిన నైపుణ్యాలు లేకపోవడం ఒక సమస్యగా మారింది. 2016 సంవత్సరంలో పీఎంకేవీవై, డిడియుజికెవై అనే నైపుణ్య శిక్షణ కేంద్రాలు కొంతవరకు ఉపాధి కల్పించడంలో సహాయపడ్డాయి. అయితే ప్రస్తుతం అవి కొన్ని చోట్లకి మాత్రమే పరిమితమైనా ఆ నైపుణ్య సెంటర్లలో అధ్యాపకులు లేక గ్రామాలలో ఉన్న యువతలో వాటిపై అవగాహన లేక రాలేకపోతున్నారు అనే విషయం కూడా గమనించాలి.

ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ హ్యూమన్ డెవలప్మెంట్ సంస్థలు సంయు క్తంగా విడుదల చేసిన 2024 నివేదికలో పలు విషయాలు వెల్లడించాయి, వీటిలో 83 శాతం వరకు నిరుద్యోగ దారిద్య్రాన్ని మోస్తున్నాయి. వీరిలో 15 నుండి 34 సంవత్సరాల వయసు వారే ఉన్నట్లు వెల్లడైంది. 2000-2019 సంవత్సరాల మధ్యలో యువత నిరుద్యోగితా శాతం దాదాపు 5.7 నుండి 17.5% వరకు పెరిగింది. 2022 నాటికి అది 12.4 శాతానికి తగ్గిందని నివేదిక పేర్కొంది.

నిరుద్యోగితను తగ్గించాలంటే..

విద్యార్థి దశలోని మొదటి ప్రాథమిక విద్యలో గానీ, అలాగే ఉన్నత విద్యలో గానీ నైపుణ్యాలను నాణ్యత రూపంలో అధ్యాపకులు విద్యార్థులకు బోధించసాగాలి. సాంకేతిక రంగంలో కొత్త పుంతలు తొక్కుతున్న 5g, 6g, ఏఐ సాంకేతికతల ఆవశ్యకతను అర్థం చేసుకొని వాటిపై పట్టు సాధించేలా ప్రోత్సహించాలి. ప్రస్తుతం విద్యా కేంద్రాలలో సాంకేతిక విజ్ఞానాన్ని నేర్పించే ల్యాబులు ఉన్నా, వాటిని సరైన నైపుణ్యం కలిగిన అధ్యాపకులు లేకపోవడం దురదృష్టకరంగా చెప్పవచ్చు. కావున వాటిని సరైన గాడిలో పెట్టేలా శ్రద్ధ వహించాలి. పాఠశాల విద్య నుంచి డిగ్రీ విద్య వరకు కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్, నైపుణ్యాలు బోధించడానికి నైపుణ్యం కలిగిన అధ్యాపకులని లేదా ట్రైనర్స్‌ను నియమించాలి. ఇక ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న వారందరికీ ఉద్యోగాన్ని కల్పించాలంటే ప్రభుత్వానికి కుదరని పరిస్థితి. కావున ఉద్యోగం రాని వారికి కూడా ఏదో ఒక ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాలు శ్రద్ధ వహించాలి. విద్యార్థులు తమ నైపుణ్యాలను ఇతర రంగాలపై కేంద్రీకరిస్తే మంచి భవిష్యత్తును సాధించవచ్చు. దేశ అభివృద్ధి అంటే పెద్ద పెద్ద మేడలు రంగుల నిర్మాణాలు కాదు దేశ నిరుద్యోగిత తగ్గించి ఉపాధి పెంచిన రోజున నిజమైన అభివృద్ధి జరుగుతుంది. యువత నిశ్శబ్దమే దేశ వినాశనానికి దారి అని ఆనాడు స్వామి వివేకానంద అన్న మాటను నేడు గుర్తు చేసుకోక తప్పదు.

- స్వామినాథ్ రేవల్లి

63006 06165

Advertisement

Next Story

Most Viewed