- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రష్యాలో జిన్‌పింగ్ శాంతి యాత్ర
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఈ నెల 20-22 మధ్య మూడు రోజులపాటు రష్యాలో అధికారిక పర్యటన చేశారు. అక్కడి యుద్ధ పరిస్థితుల్లోనూ ఈ పర్యటన జరగడంతో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉక్రెయిన్‌పై దండయాత్ర సాగిస్తున్న నాటి నుంచి రష్యా ప్రపంచంలో ఏకాకిగా మారింది. అమెరికా సహా నాటో కూటమి, పాశ్చాత్య దేశాలు, బద్ధ శత్రువు వైఖరి అవలంభిస్తున్నాయి. భారత్, జపాన్ లాంటి దేశాలు తటస్థ వైఖరిని అవలంభిస్తున్నాయి. ఒక్క చైనా మాత్రం రష్యాకు స్నేహహస్తం అందిస్తున్నది. జిన్‌పింగ్ చైనా దేశానికి మూడోసారి అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత జరుపుతున్న తొలి అధికార పర్యటన ఇది. ఈ యాత్రపై చైనా విదేశాంగ ప్రతినిధి మాట్లాడుతూ జిన్‌పింగ్‌ది సహకార శాంతి, సుహృద్భావ పర్యటనగా వర్ణించారు. అయితే చైనా దాదాపు 12 అంశాలతో శాంతి ప్రతిపాదనలు చేస్తున్నట్లు సమాచారం. ప్రపంచంలో అన్ని దేశాలు సమానమేనని, దేశం చిన్నది అయినా పెద్దది అయినా, పేద దేశం - ధనిక దేశం అయినా, ఆధునిక దేశం- వెనకబడ్డ దేశం ఇలా ఎలాంటిదైనా ప్రతి దేశం ప్రపంచ యవనికలో సమానమేనని చైనా అంటున్నట్టు తెలిసింది.
దేశం దాటితే అరెస్ట్..
ప్రతి దేశం సార్వభౌమత్వం, స్వతంత్రత కాపాడాలని తాము వాంఛిస్తున్నట్టు చైనా పేర్కొన్నట్టు తెలుస్తుంది. ప్రపంచంలో ఒక దేశం ఆధీనంలోకి ఇంకొక దేశం రాదని, ఒక దేశం పైకి ఇంకొక దేశం రాకూడదని చైనా ప్రతిపాదిస్తున్నట్టు తెలుస్తున్నది. రష్యా-ఉక్రెయిన్‌పై తన దాష్టీకాన్ని ఆపడం లేదు. నిరంతరంగా ఉక్రెయిన్ పట్టణాలపై దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ ప్రాంతాలైన మరియాపోల్, డొంటస్క్ ప్రాంతాలను రష్యా తన పాలనలోకి తెచ్చుకున్నది. ఉక్రెయిన్ పౌరులపై జరుగుతున్న మానవ హక్కుల భంగం విషయంతో పుతిన్‌ను నేరస్థుడిగా భావిస్తూ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పుతిన్‌కు అరెస్ట్ వారెంట్ జారీచేసింది. పుతిన్ ఈ వారెంట్‌ను చెత్త కాగితం అని వర్ణించినా ఏ దేశం గుర్తించకపోయినా ఆయన రష్యా దాటితే అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
సమస్యను పరిష్కరించుకోవాలంటే..
అయితే యుద్ధం విషయంలో ఎన్నో నీతి వ్యాఖ్యలు చెబుతున్న చైనా ఈ వారెంట్ విషయంలో వ్యాఖ్యానించలేదు. అలాగే చైనా కనీసం రష్యా నుంచి కాల్పుల అభ్యర్థనను కోరలేదు. అయితే ఉక్రెయిన్ కలపకుండా చైనా ఎలాంటి శాంతియుత ప్రయత్నం చేసినా అది ఒక వైపు ప్రయత్నం అవుతుంది తప్పా పరస్పర ప్రయత్నం అవ్వదు. సమస్యను పరిష్కరించుకోవాలంటే పరస్పర చర్యలుండాలని భారత్ లాంటి దేశాలు సూచిస్తున్నాయి.
అందువల్ల చైనాది శాంతి కోసం జరిగిన యాత్ర కాదని స్పష్టం అవుతుంది. దీనిని రష్యాకు స్నేహ మద్దతు యాత్రగా చెప్పవచ్చు. ప్రపంచం మారుతున్నది. పాశ్చాత్య దేశాలు అన్ని పరిస్థితులు గమనిస్తున్నాయి. మీరు భయపడవద్దు అని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పుతిన్‌కు భరోసా ఇచ్చారు. మరోవైపు రష్యా నిరంతర దాడుల నేపథ్యంలో నాటో దేశాల నుంచి ఉక్రెయిన్‌కు ఆయుధ సహయం అందుతున్నది. జిన్‌పింగ్ రష్యా పర్యటన సమయంలోనే జపాన్ ప్రధాని ఉక్రెయిన్‌లో పర్యటించారు. ఈ పర్యటన వివరాలు తెలియలేదు. ఏదీ ఏమైనా జిన్‌పింగ్ పర్యటన వల్ల యుద్ధం ఆగితే, శాంతిని కోరితే ప్రపంచం మొత్తం హర్షం వ్యక్తం చేసే అవకాశం ఉంది.
శ్రీ నర్సన్
83280 86188