తొలి ఆదివాసీ యోధుడు బిర్సా

by Ravi |   ( Updated:2022-11-14 18:31:01.0  )
తొలి ఆదివాసీ యోధుడు బిర్సా
X

అనుచరులతో కలిసి బాణాలు ధరించి 1899 డిసెంబర్ 24న భారీగా 'ఉల్ గులాన్' తిరుగుబాటు ర్యాలీ నిర్వహించాడు. మతాలతో సంబంధం లేకుండా అందరూ ఆయన వెంట నడిచి మద్దతు తెలిపారు. ఇదంతా నూనూగు మీసాల యువకుడిగా ఉన్న సమయంలోనే సాధించాడు బిర్సా. ఈ చర్యలను గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం 1900 ఫిబ్రవరి 3న బంధించి రాంచీ జైలుకు తరలించి అక్కడ విషప్రయోగంతో బలి తీసుకుంది. పాతికేళ్ల వయసులోనే దేశం కోసం పరితపించిన ఆశాజ్యోతి 1900 జూన్ 9న ఆరిపోయింది. అనంతర కాలంలో బిర్సా స్ఫూర్తితో ముండా, ఒరియాన్, సంతాల్ తెగలు తమ హక్కులను సాధించుకున్నాయి. ఈశాన్య రాష్ట్రాల గిరిజనులకు రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ద్వారా స్వయం పాలన లభించింది. బిర్సా మరణించిన వందేళ్ల తరువాత 2000 నవంబర్ 15న ఆయన జయంతి రోజునే దేశంలో 28వ రాష్ట్రంగా ఝార్ఖండ్ ఏర్పడింది.

బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందరో యోధులు పోరాటం చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా వదిలేశారు అలాంటి వారిలో ఒకరు బిర్సా ముండా. దేశ ఆదివాసీ ప్రజల నుంచి వచ్చిన ధీరుడు. ఆయన జీవన పోరాటానికి మన తెలంగాణలో నిజాంను ఎదిరించిన కుమ్రం భీమ్ జీవన పోరాటానికి సారూప్యత కనిపిస్తుంది. ఇద్దరి పోరాట పంథా పరాయి పాలన ధిక్కారం, స్వయంపాలన నినాదమే. బిర్సా ముండా ఈశాన్య రాష్ట్రాలలో ఆంగ్లేయులపై రణభేరి మోగిస్తే, కుమ్రంభీం తెలంగాణ నిజాం, రజాకారులపై తుడుం మోగించారు. ఆనాటి ఆదివాసీ పోరాట వీరుల చరిత్రను విజయగాథలను స్వతంత్ర భారతదేశం గుర్తించకపోవడం గర్హనీయం.

వారిపైనే మొదటి తిరుగుబాటు

ఆదివాసీలలో పోరాట భావాలను రగిలించిన తొలి వీరుడు బిర్సా ముండా. బిహార్‌తోపాటు అనేక రాష్ట్రాలలో ఆదివాసీల రాజ్యం తేవటానికి సమర శంఖం పూరించాడు. తెల్లోళ్లను తరిమివేయడమే జీవిత లక్ష్యంగా బీహార్ గిరిజన ప్రాంతం డొమారీ హిల్స్ కొండలలో 1886 నుండి 1894 వరకు విప్లవం నడిపాడు. 'ముండా' తెగకు చెందిన సుగుణ-కార్మిహాలు దంపతులకు 1875 నవంబర్ 15న పుట్టిన బిర్సా భూమి కోసం, భుక్తి కోసం, ఆదివాసీ అటవీ హక్కుల కోసం చివరి శ్వాస వరకు ఉద్యమించాడు. బిర్సాను తన తండ్రి ఒక శాస్త్రవేత్తగా చూడాలనుకున్నాడు. అందుకే ఉలిహటు అనే క్రిస్టియన్ మిషనరీ స్కూల్ లో చేర్పించాడు. అందులో చేరాలంటే క్రైస్తవుడిగా మారాలనేది నియమం కావడంతో తన పేరును బిర్సా డేవిడ్‌గా మార్చుకున్నాడు.

క్రిస్టియన్ మిషనరీలు చేసే మత మార్పిడులను పసిగట్టి తిరిగి హిందూ మతాన్ని స్వీకరించారు. తన జీవితంలో మొదటి ఆందోళనను క్రిస్టియన్ మిషనరీల ఆగడాలపైనే ప్రకటించాడు. ఇదే తదనంతరం బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమంగా మారింది. సహించలేకపోయిన బ్రిటిష్ పాలకులు బిర్సాను ఛోటా నాగపూర్ ప్రాంతంలో 1895 ఆగస్టు 25న అరెస్టు చేసి రెండేళ్లు జైలులో ఉంచారు. జాతీయోద్యమకారులు భారీగా ఒత్తిడి తేవడంతో 1897 నవంబర్ 30న విడుదల చేశారు.

Also read: ఆదివాసీల గురువు జాదోనాంగ్

నూనుగు మీసాల వయసులోనే

జైలు నుండి బయటకు వచ్చిన బిర్సా తన తెగ ప్రజలకు నైతిక విలువలు, హిందూ మతం ఆచరించాల్సిన అవసరాన్ని వివరించాడు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను పాటించాలని సూచించాడు. స్వయంగా నుదుటన బొట్టు పెట్టుకొని, వీపున జంధ్యం వేసుకునేవాడు. పేదరికంతో బాధపడుతున్న వర్గాలను ఆదుకోవడానికి శక్తి మేర కృషి చేసేవాడు. వారికి ప్రకృతి వైద్యం అందించేవాడు. ఆ రోజులలో ఆదివాసీల సాగు భూములకు పన్నులు అధికంగా వసూలు చేసేవారు. కట్టకపోతే వాటిని జమీందారీ భూములుగా మార్చేవారు. దీంతో చాలా మంది తేయాకు కూలి పనుల కోసం అస్సాంకు వలస వెళ్లేవారు. దీనిని గమనించిన బిర్సా వన జీవులందరిని సమావేశపరిచి బ్రిటిష్‌ కప్పాలపై తిరుగుబాటు జెండా ఎగురవేసాడు. తెల్లోళ్లను తరిమి కొట్టాలని పిలుపునిచ్చాడు. అనుచరులతో కలిసి బాణాలు ధరించి 1899 డిసెంబర్ 24న భారీగా 'ఉల్ గులాన్' తిరుగుబాటు ర్యాలీ నిర్వహించాడు. మతాలతో సంబంధం లేకుండా అందరూ ఆయన వెంట నడిచి మద్దతు తెలిపారు. ఇదంతా నూనూగు మీసాల యువకుడిగా ఉన్న సమయంలోనే సాధించాడు బిర్సా.

ఈ చర్యలను గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం 1900 ఫిబ్రవరి 3న బంధించి రాంచీ జైలుకు తరలించి అక్కడ విషప్రయోగంతో బలి తీసుకుంది. పాతికేళ్ల వయసులోనే దేశం కోసం పరితపించిన ఆశాజ్యోతి 1900 జూన్ 9న ఆరిపోయింది. అనంతర కాలంలో బిర్సా స్ఫూర్తితో ముండా, ఒరియాన్, సంతాల్ తెగలు తమ హక్కులను సాధించుకున్నాయి. ఈశాన్య రాష్ట్రాల గిరిజనులకు రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ద్వారా స్వయం పాలన లభించింది. బిర్సా మరణించిన వందేళ్ల తరువాత 2000 నవంబర్ 15న ఆయన జయంతి రోజునే దేశంలో 28వ రాష్ట్రంగా ఝార్ఖండ్ ఏర్పడింది. ఆ రాష్ట్రం బిర్సా పేరిట యూనివర్సిటీని, ఇతర ప్రభుత్వ సంస్థలను నెలకొల్పి స్మరించుకుంటున్నది. బిహార్‌లోని డొమారీ హిల్స్‌లో బిర్సా స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేశారు.

Also read: భూంకాల్ తిరుగుబాటు యోధుడు

(నేడు బిర్సా ముండా జయంతి)


గుమ్మడి లక్ష్మీనారాయణ

సామాజిక రచయిత

94913 18409

Advertisement

Next Story