- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్మికుల సొత్తు కూడా కబ్జాల పాలు..
ఆజం జాహీలో మరోమారు అగ్గి అంటుకుంది. కారణం, చారిత్రాత్మక ఆజం జాహి మిల్లు కార్మికులు పైసా పైసా పోగేసి 1400 గజాల స్థలంలో (రహదారి వెంట) కట్టుకున్న కార్మిక భవనం నేలమట్టమవ్వడమే. కబ్జాదారుల కబంధ హస్తాలలో చిక్కి, 75 ఏళ్ల నిషాన్ ఈ నెల 15న కనుమరుగయ్యింది. కోట్లాది రూపాయల విలువ చేసే కార్మిక భవనాన్ని కూల్చి, ఆ స్థానంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల అండతో శంకుస్థాపన చేసిన 24 గంటల్లో ఒక చరిత్ర మట్టిలో కలిసిపోయింది. రాజకీయ పార్టీల నుండి ప్రజా సంఘాల నుండి వినతులు, నిరసనలు వెల్లువెత్తడంతో తాత్కాలికంగా కొత్త నిర్మాణం వాయిదా పడింది. కార్మికుల సమస్యలు చర్చించడానికి, పరిష్కారానికి వేదికగా ఉంటున్న, కార్మిక సంఘ భవనాన్ని నిలువునా కూల్చేశారు కాబట్టి తిరిగి దాని నిర్మాణం జరిగేనా? కార్మిక సంఘ భవనం తిరిగి ఎవరు నిర్మిస్తారు? కూల్చినవారా? సహకరించిన వారా? ప్రభుత్వమా? ఎవరు బాధ్యత తీసుకుంటున్నారన్నది అంతుచిక్కని ప్రశ్న.
వరంగల్ నగర అభివృద్ధిలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆజం జాహి మిల్లు కార్మికులది కీలక పాత్ర. ఈ పరిశ్రమ తెలంగాణకు తలమానికం. నాణ్యమైన బట్టల మిల్లుగా దేశంలోనే గుర్తింపు పొంది, ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు చేసి లాభాలు గడించినది. తెలంగాణలో రెండో అతిపెద్ద నగరంగా వరంగల్ అవతరించడానికి కారణమైంది. పారిశ్రామిక రంగానికి పునాదులు వేసింది కూడా ఈ పరిశ్రమే. ఆజం జాహి మిల్లు మూతపడి, అన్యాక్రాంతమై 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ పరిశ్రమను పునరుద్ధరించాలని కార్మికులు ప్రజా సంఘాలు చేసిన ఉద్యమ మంటల్లో రాజకీయ పార్టీల నేతలు సెగ కాసుకున్నారు. కానీ, కార్యక్రమంలో కార్మికుల జీవితాలు అత్యంత దుర్భ రంగా మారాయి. సంఘీభావం ప్రకటించిన రాజకీయ నాయకుల జీవితాలను మాత్రం మరింత ముందుకు, పైపైకి తీసుకెళ్లాయి.
దేశంలోనే అతిపెద్ద వస్త్ర పరిశ్రమ!
ఆజం జాహి మిల్స్ - వస్త్ర పరిశ్రమను ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మొదటి కుమారుడు ప్రిన్స్ ఆజం జాహి పేరుతో 1934లో 2000 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన దేశంలోనే అతిపెద్ద వస్త్ర పరిశ్రమ. ఆనాడే పదివేల మందికి పైగా ఉపాధి పొందారు. ఈ పరిశ్రమ సైరన్ వరంగల్ చుట్టుపక్క గ్రామాలకు వేకప్ కాల్‌గా ఉండేది. కాలగమనంలో 1974లో దీనిని బెంగళూరుకు చెందిన నేషనల్ టెక్ట్‌టైల్ కార్పొరేషన్ (N.T.C) స్వాధీనం చేసుకుంది. 1980 వరకు ఆరు దశాబ్దాల పాటు పరిశ్రమ పనిచేసింది. అనారోగ్యంతో, అస్తవ్యస్తంగా మారిన పరిశ్రమను 1990 నాటికి మూసి వేశారు. అదే సంవత్సరం చివరలో భూమిని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి (KUDA)కు అప్పగించారు. "కుడా" ఈ భూమిని నెమ్మదిగా ప్లాట్లు చేసి మరీ విక్రయించడం ప్రారంభించింది. తర్వాత ప్రజల డిమాండ్, ఒత్తిడి పెరగడంతో 200 ఎకరాల్లో అపెరల్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఇప్పుడు కేవలం 30 ఎకరాల భూమి మాత్రమే NTCకి ఉన్నట్లు తెలుస్తోంది.
ఆటో రిక్షా కార్మికులుగా మిల్లు కార్మికులు..
ఇతర ప్రాంతాల ప్రజలు విద్యుత్ కాంతులు చూడకముందే, ఆజం జాహి మిల్ కారణంగా వరంగల్ పట్టణంలోని ఇళ్లు, వీధులు ప్రకాశవంతం కాబడ్డాయి. గొప్పగతాన్ని, చరిత్రను కలిగిన ఆజం జాహి మిల్ అదృశ్యమైంది. నాటి కార్మికులు నేడు ఆటో రిక్షా కార్మికులుగా మారి ఉపాధి పోసుకుంటున్నారు. కబ్జాదారుల నుండి తమ కార్యాలయాన్ని కాపాడుకోవడానికి చేస్తున్న ఉద్యమ సెగ ఇంకా ఆరక ముందే ఆగమైపోయింది. ఇదిలా ఉండగానే, జిల్లాలో ఆరు లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన బొగ్గు, నీరు, భూమి, రవాణా సౌకర్యాలు ఉన్నాయి. టెక్స్‌టైల్‌లో మిల్లులను ఏర్పాటు చేస్తే 15 నుండి 20 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని కాటన్ ఫ్యాబ్రిక్ అని కాంపోజిట్ టెక్స్‌టైల్స్ మిల్లు ఏర్పాటు చేయాలని నేతల ప్రతిపాదించారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ కోసం 2017లో 1200 ఎకరాల భూమి సేకరించారు. వస్త్ర తయారీ, బట్టలు కుట్టడం ఇక్కడే ఉంటుందని 2010లో శంకుస్థాపన చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు చేసి భూమి ఇచ్చిన వారికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. 100 కోట్లతో ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చి ఏళ్లు గడిచినా ముందడుగు పడ్డ దాఖలాలు లేవు. నేతలు మాటలు నీటి మూటలుగా మిగిలాయి.
భూముల అమ్మకాలు ప్రభుత్వ బాధ్యతా?
ప్రభుత్వ భూములకు పాలకులు కేవలం సంరక్షకులు మాత్రమే. యజమానులు కాదన్నది నిత్య సత్యం. కానీ, ప్రభుత్వ భూములను అమ్మి వేయడం, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం నిత్యకృత్యంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన అభివృద్ధి చెందుతామని భావించి చేసిన త్యాగాలు గుర్తింపు లేకుండా పోయా యి. ఉద్యమకారుల ఊసే లేదు. పరాయి పాలన పోయినా, కార్పొరేట్ శక్తుల ఆగడాలు ఆగడం లేదు. కబ్జాల కోరలు చాస్తూనే ఉన్నాయి. సహజ వనరులు కొల్లగొట్టబడుతూనే ఉన్నాయి. ప్రజలు, విద్యార్థి - యువజనులు, ప్రజాస్వామిక వాదులు, కవులు-కళాకారులు, కార్మిక -కర్షకులు, బుద్ధి జీవులు ఒక్క తాటి పైకి వచ్చి పాలకులను నిలదీసి ప్రశ్నించగలిగితే తప్ప తెలంగాణా రాష్ట్ర భవిష్యత్తు మరింత దుర్భరమవుతుందనేది చారిత్రక సత్యం.
- రమణా చారి
99898 63039