ఏ జీఓ మాటున ఏ రహస్యం దాగి ఉందో?

by Ravi |
ఏ జీఓ మాటున  ఏ రహస్యం దాగి ఉందో?
X

రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ నాయకులకు భూములు దోచి పెట్టడానికే జీఓ 59, అది సరిపోక జీఓ 84 తీసుకొచ్చింది. జీఓ 59లో 200 గజాల నుండి 1000 గజాలు ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేయడమే అన్యాయం అంటే జీఓ 84 తీసుక వచ్చి 3వేల గజాల వరకు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం స్టాంపు డ్యూటీ తీసుకొని క్రమబద్ధీకరణ చేస్తామనడం అంటే ప్రభుత్వ భూమిని రాజకీయ నాయకులకు, సంపన్నులకు దోచి పెట్టడం కాక మరేమిటి? 250 గజాల నుండి మూడు వేల గజాలు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వాళ్ళు పేదలుగా భావించి రెగ్యులరైజ్ చేస్తుందా ప్రభుత్వం? ఏ జీఓ మాటున ఏ రహస్యం దాగివుందో, ఎవ్వరి ప్రయోజనాలు దాగి ఉన్నవో, జీఓ 84లొ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం తీసుకుంటాం అని చెప్పినా, వారి పార్టీ నాయకులకు వంద రూపాయలకు గజం లాగా తీసుకొని రెగ్యులరైజ్ చేసినా ఆశ్చర్య పోనక్కరలేదు

ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేశవరావుకు జీఓ 59లో పేర్కొన్న మార్కెట్ విలువ ప్రకారం కాకుండా కేవలం నామినల్ అమౌంట్ తీసుకొని రెగ్యులరైజ్ చేయడం తెలిసిందే, ఊరికే ఇన్ని జీఓలు తీసుకురావడం ఎందుకు? రాజకీయ నాయకులకు సంపన్నులకు వందో వెయ్యో ఎకరాలు కేవలం లక్ష రూపాయలకే రెగ్యులరైజ్ చేస్తామని ఒక జీఓ తీసుకురండి, ఏమిటి ఈ జీఓలు? ప్రభుత్వం ఎవరి కోసం పని చేస్తున్నట్లు? పేదల కోసమా, పెద్దల కోసమా?

జీఓ వచ్చిందే తడవుగా రాజకీయ నాయకులు వారి చెంచాలు దొంగ నోటరీ పేపర్లు, సృష్టించుకుని రూంలు నిర్మించుకుని ఇంటి నెంబర్‌లు, కరంట్ మీటర్‌లు తీసుకుంటారు రెగ్యులరైజ్‌కు దరఖాస్తు చేసుకుంటారు. ఎందుకంటే ఆ జీఓలో నియమ నిబంధనలు ఉల్లంఘించవచ్చు, ప్రభుత్వం వెంటనే జీఓ 84ను రద్దు చేయాలి, ప్రతిపక్ష పార్టీలు ఈ జీఓపై స్పందించాలి. లేదంటే సమర్థించినట్లే, ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే ముందుగా ఇండ్లు లేని కుటుంబాలను గుర్తించి వారికి ఒక్కొక్క కుటుంబానికి వంద గజాల స్థలం ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.

నారగొని, ప్రవీణ్ కుమార్

అధ్యక్షులు, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్

98490 40195

Next Story

Most Viewed