- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏజెన్సీ జీవోలను కాపాడండి!
షెడ్యూల్డ్ ప్రాంత స్థానిక గిరిజన అభ్యర్థులతోనే ఉపాధ్యాయ, ఇతర ఉద్యోగాలు భర్తీ జేసేందుకు ఉద్దేశించిన ప్రభుత్వ జీవో 3ను సుప్రీంకోర్టు రద్దు చేసి మూడేళ్ళకు పైనే అయ్యింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఉపాధ్యాయ పోస్టులతో పాటు షెడ్యూల్డ్ ప్రాంత ఇతర ఉద్యోగ పోస్టులను భర్తీ జేసే ప్రక్రియకు కూడా తెర పడింది. భారత రాజ్యాంగం ఐదవ పెడ్యూలు కింద రాష్ట్ర గవర్నర్ జనవరి 2000లో జారీ చేసిన జీవో -3 నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం ఏప్రిల్ 2020లో రద్దు చేసింది. దాంతో నిరుద్యోగ ఆదివాసీలకు జీవనోపాధి తెలుగు రాష్ట్రాలలో ప్రశ్నార్థకంగా మారింది.
అనేక వేల సంవత్సరాల నుండి అడవులనే నివాసంగా ఏర్పరుచుకొని జీవనం సాగిస్తున్న వారిని సాధారణంగా గిరిజనులు లేదా ఆదివాసులు అంటారు. అయితే రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి ప్రకటించిన జాతులను 342(1) కింద షెడ్యూల్ ట్రైబ్ గా పరిగణిస్తారు. వీరికి ప్రత్యేక సంస్కృతి భాషలు, సాంప్రదాయాలు ఉంటాయి. వీరి జీవన విధానం జీవనాధార అటవీ ప్రాంతాల్లోని భూ సంపద, వృక్ష సంపద, నీటి సంపదలఫై ఆధారపడి ఉంటుంది ఇతర వర్గాల ప్రజలతో పోలిస్తే అనేక రంగాలలో వెనుకబడి ఉన్న కారణంగా ప్రభుత్వం వీరికి కొన్ని ప్రత్యేక రాజ్యాంగ సదుపాయాలు కల్పించినది. గిరిజనులు అధికంగా నివసిస్తూ అభివృద్ధికి నోచుకోని ఆర్థిక స్థాయిలో అంతరాలు ఉన్న ప్రాంతాలను గుర్తించి రాష్ట్రపతికి ఆమోదం కోసం ప్రభుత్వం పంపుతుంది. అలా గుర్తించిన ప్రాంతాలను పాలన కోసం ప్రత్యేకంగా రాజ్యాంగం ఐదోవ షెడ్యూల్‌లో నియమలు నిబంధనలు పొందుపరిచారు.
గిరిజనుల జీవనోపాధి ప్రశ్నార్థకం
షెడ్యూల్డ్ ప్రాంత స్థానిక గిరిజన అభ్యర్థులతోనే ఉపాధ్యాయ, ఇతర ఉద్యోగాలు భర్తీ జేసేందుకు ఉద్దేశించిన ప్రభుత్వ జీవో 3ని సుప్రీంకోర్టు రద్దు చేసి మూడేళ్ళకు పైనే అయ్యింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఉపాధ్యాయ పోస్టులతో పాటు షెడ్యూల్డ్ ప్రాంత ఇతర ఉద్యోగ పోస్టులను భర్తీ జేసే ప్రక్రియకు కూడా తెర పడింది. భారత రాజ్యాంగం ఐదవ పెడ్యూలు కింద రాష్ట్ర గవర్నర్ జనవరి 2000లో జారీ చేసిన జీవో 3 నోటిఫికేషన్‌ను చేబ్రోలు లీలా ప్రసాద్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై దాఖలు చేసిన కేసులో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏప్రిల్ 2020లో నోటిఫికేషన్ రద్దు చేసింది. దాంతో నిరుద్యోగ ఆదివాసీలకు జీవనోపాధి తెలుగు రాష్ట్రాలలో ప్రశ్నార్థకంగా మారింది.
సుప్రీంకోర్టు తన తీర్పులో రాజ్యాంగ మౌలిక సమాన హక్కులకు విరుద్ధంగా జీవో3 ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని, నూరు శాతం షెడ్యూల్డ్ ప్రాంత స్థానిక గిరిజన అభ్యర్థులతో పోస్టులు భర్తీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని, అందువల్ల చెల్లనేరవని అన్నది. అలాగే ఆర్టికల్ 309 కింద జారీ అయిన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ నియామకాల నియమాలను సవరించే అధికారం ఐదవ షెడ్యూల్ పేరా 5(1) కింద గవర్నరుకు లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పుకు భిన్నంగా జీవో 3 స్థానే మరొక ఉత్తర్వు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే, 1986 నుంచి ఇప్పటివరకూ జీవో 3 కింద ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగ ఉత్తర్వులు కూడా రద్దవుతాయని సుప్రీంకోర్టు హెచ్చరించింది.
తీర్పు జాప్యంతో తీవ్ర నష్టం
21 సంవత్సరాలు తర్వాత జీవో నెంబర్ 3కి సుప్రీంకోర్టు ఇచ్చిన అనుకూల తీర్పు వల్ల 29 రకాల ఏజెన్సీ ఉత్తర్వులఫై ప్రభావం పడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు చొరవ తీసుకుని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి నాలుగు సంవత్సరాలు అవుతున్న ఏ తీర్పు రాకపోవడంతో రాష్ట్రాల గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విధంగా ప్రాంతీయ గిరిజనుల భాషలో విద్యార్థులకు అందవలసిన విద్య ఇకనుంచి గ్రహణం పట్టినట్టు అవుతుంది. వాస్తవానికి ఐదవ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో స్థానిక ఆదివాసీ అభ్యర్థుల ప్రభుత్వ ఉద్యోగ కల్పన, నియామకాల విషయంలో సాధారణ నియమాలకు భిన్నంగా ప్రత్యేక రాజ్యాంగ సవరణలను తీసుకు రావాల్సి ఉంది.
సుప్రీంకోర్టులో పెండింగులో ఉన్న తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల గిరిజన సంఘాల పిటిషన్‌పై తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియని విషయం. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ప్రధాన బాధ్యత తీసుకోవాలి. సమస్య పరిష్కారానికి చొరవ చూపాలి. కాగా షెడ్యూల్డ్ ప్రాంతాలలో నూరుశాతం స్థానిక ఆదివాసీ అభ్యర్థులకే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కల్పన ఇప్పటికైనా ఆయా ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఏజెన్సీ జీవోలను కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అందువల్ల ఈ విషయంలో ప్రభుత్వాలు ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
-ఎన్.సీతారామయ్య
94409 72048