- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బంజారాల ఆరాధ్యదైవం సేవాలాల్
సంత్ సేవాలాల్ మహారాజ్ ఒక సంఘసంస్కర్త, బంజారాల ఆరాధ్యదైవం, ప్రకృతి ప్రేమికుడు, ఆధ్యాత్మిక గురువు, బంజారాల సంస్కృతి సంప్రదాయాల పరిరక్షకుడు, జాతి ఉద్ధారకుడు. భారతదేశంలో సుమారు 10 కోట్లకు పైచిలుకు జనాభా కలిగిన బంజారాలు ఏటా సేవాలాల్ జయంతిని జరుపుకుంటున్నారు. నేడు తెలంగాణలో ప్రభుత్వం అధికారికంగా ఈ జయంతి వేడుకులు జరుపుతోంది. ఈ ఏడాది వేడుకలకు కోటి రూపాయలు కేటాయించింది.
సేవాలాల్ తన పాటలు రచనల ద్వారా ప్రజలను జాగృతం చేయడానికి అనేక ప్రబోధాలను బోధించాడు. అందులో ముఖ్యంగా బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేశారు. అందుకే సంత్ సేవాలాల్ ఇతర కులాలవారికి కూడా ఆదర్శమూర్తిగా నిలిచారు. సేవాలాల్ ప్రజల మూఢవిశ్వాసమైన జంతుబలికి తీవ్ర వ్యతిరేకి, జాతి జాగృతి కోసం ఎంతో హితబోధ చేశాడు. తన జాతి వారిని బ్రిటిష్ వారి నుంచి, ముస్లిం వారి నుంచి కాపాడిన ఘనుడు. అందుకే నేడు బంజారా జాతి ఆయన జయంతిని జరుపుకుంటున్నారు.
సేవాలాల్ జయంతి వేడుకలు జరిగే సమయంలో బంజారాలు తమ జాతి డిమాండ్లు నెరవేర్చాలని ఎన్నో ఏళ్ళుగా ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. అందులో ప్రధానంగా గోరబోలి బాషాను 8వ షెడ్యూల్‌లో చేర్చాలని, అలాగే ఫిబ్రవరి 15న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని కోరుతున్నారు. ఈ విజ్ఞప్తులను అటు కేంద్రం ఇటు రాష్ట్రం నెరవేర్చడం లేదు. ఈ మధ్య ప్రధాని మోడీ, కేసీఆర్‌లు వివిధ సందర్భాల్లో గోరబోలి భాష మాట్లాడుతూ ఉత్సాహపరిచారు. అయితే వీరు బంజారాల కోసం ఇది చేశాం అది చేశాము అని చెబుతున్నారే తప్ప వారి చిరకాల కోరికలను నెరవేర్చడం లేదు. ఎవరికైనా సంక్షేమ పథకాలు ముఖ్యమే కానీ తమ జాతి గుర్తింపును భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది.
తెలంగాణ ప్రభుత్వం కొత్త సెలవులుగా రంజాన్, గురునానక్ జయంతిని ప్రకటించినట్టే సేవాలాల్ జయంతి రోజును కూడా సెలవుగా ప్రకటించాలి. తరతరాల నుంచి అన్యాయానికి గురయిన జాతులను రక్షించే బాధ్యత ప్రభుత్వాలదే. అలాగే బంజారా సమాజం సేవాలాల్ సూత్రాలను గొప్పగా చెప్పుకోవడమే కాకుండా ఆచరించి చూపాలి. నేడు బంజారాల్లో వరకట్నం ప్రధాన సమస్యగా మారింది. పెళ్లిళ్ల పేర విపరీతమైన ఖర్చు చేస్తున్నారు. అలాగే ఎక్కువమంది తాగుడుకి బానిసలు అవుతున్నారు. ముందుగా బంజారాలు ఈ రుగ్మతలను పారదోలాలి. జై సేవాలాల్ జై బంజారా...
(నేడు సంత్ సేవాలాల్ మహరాజ్ 284వ జయంతి)
డా. శంకర్ నాయక్
అసోసియేట్ ప్రొఫెసర్
9110716674