- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నవ్య కవిత్వానికి అడుగుజాడ మన గురజాడ
గురజాడ ఈ పేరు వినగానే మనసులో మెదిలే ఛందస్సు ముత్యాల సరాలు. కొత్త పాతల మేలు కలయికతో తెలుగువారి మత్తువదల గొట్టిన భావ విప్లవకారుడు. కందుకూరి సాంఘిక విప్లవం, గిడుగు భాష విప్లవం తనలో సమన్వయించుకుని సాహిత్య విప్లవం లేవనెత్తిన నవయుగ వైతాళికుడు మన గురజాడ. తన చేతి చలువతో అస్పశ్యంగా పడివున్న వాడుక భాషను అందాలమెక్కించిన గురజాడ 1862 సెప్టెంబర్ 21న విశాఖ జిల్లాలో ఎలమంచిలి తాలూకా రాయవరంలో జన్మించారు. చీపురుపల్లిలో గ్రాంటు స్కూల్లో మరియు విజయనగరం మిడిల్ స్కూల్లో చదివిన తరువాత 1882లో మెట్రిక్ పాసయ్యారు. ఆ తరువాత ఎఫ్. ఎ చదివారు. 1884-86 లో బి. ఎ పూర్తయ్యింది. ఆపైన కొన్నాళ్ళు కాలేజీలో ఉద్యోగం చేసి మరికొన్నాళ్లు డిప్యూటీ కలెక్టర్ ఆఫీసులో హెడ్ గుమస్తాగా పని చేశారు. మరీ కొన్నాళ్ళు నాలుగో అసిస్టెంట్ లెక్చరర్ ఉద్యోగం చేశారు. మద్రాసు యూనివర్సిటీ ఫెలో గా నియమించబడ్డారు.
సమాజంలో స్త్రీ పాత్రను చూపుతూ..
సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఆనాటి మూఢనమ్మకాలను, సాంఘిక దురాచారాలను రూపుమాపే ప్రయత్నమే ముత్యాలసరాలు ఛందస్సు వస్తువు ఏదైనా ప్రజలకు సులభంగా, సూటిగా అర్ధమయ్యేలా ప్రజల దృష్టికి తీసుకువచ్చి మార్పుని ఆశించడమే గురజాడ ధ్యేయం. పాత పద్ధతులను విడిచిపెట్టి కొత్త బాటలో నడవాలనుకున్నాడు. ఆంగ్ల సాహిత్యాధ్యయనం, గిడుగు భాషోద్యమం అప్పటికే వీరిని ఆకర్షించాయి. అందుకే కొత్త గాలి పీల్చుకుని సరికొత్త చైతన్యంతో ముందుకు సాగారు. సహజం వర్ణనలతో, తేటైన మాటలతో రాయబడిన ఖండకావ్యాలు సంపుటే ముత్యలసరాలు. దీనిలో లవణ రాజుకల, కన్యక, పూర్ణమ్మ, లంగరెత్తుము, దేశభక్తి వున్నటి కవితలున్నాయి. ఒక్కో కవితలో ఒక్కో విషయాన్ని రేకెత్తించి ప్రజలలో నవ్య చైతన్యానికి నాందిగా నిలిచారు. కులంకన్నా గుణం మిన్న అని, అధికారంతో కన్ను మిన్ను కానని రాచరిక వ్యవస్థ యొక్క లోపాన్ని చూపుతూ సమాజంలో స్త్రీ యొక్క దుస్థితిని కన్యాశుల్కం ద్వారా అద్భుతంగా వర్ణించారు.
భావకవిత్వం, నవ్యకవిత్వం, భాషా నైపుణ్యానికి నిలువుటద్దంగా నిలిచి తన ఖ్యాతిని చాటుకున్నారు. ఆనాడు సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాల్లో బాల్యవివాహాలు ఒకటిగా చెప్పవచ్చు. భారత దేశం వెనుకబాటుకు ఇదొక కారణంగా భావింపవచ్చు. చిన్నపిల్లలను ఆఖరికి రోజుల పిల్లలను కూడ వివాహం చేసుకుని వెట్టి చాకిరికి బలిచేసేవారు. ఆ నేపథ్యంలో వచ్చినదే పూర్ణమ్మ గేయకవిత
మేలిమి బంగరు మెలతల్లారా
కలువల కన్నుల కన్నెల్లారా
తల్లుల గన్నా పిల్లల్లారా
విన్నారమ్మా ఈ కథను
అనే సంబోధనతో సాగిన ఈ గేయంలో పూర్ణమ్మ చివరికి ఆత్మత్యాగం చేస్తుంది. ఆ రోజుల్లో అందరిని కదిలించిన గేయంగా నిలిచిపోయింది.
గురజాడ వారి జాతీయ దృక్పధానికి, విశ్వామానా సౌభ్రాత్వానికి, విశాలాదృష్టికి, అభ్యుదయ భావాలకు ప్రతీక దేశభక్తి గేయం
దేశమును ప్రేమించుమన్న
మంచి అన్నది పెంచుమన్న
వొట్టిమాటలు కట్టిపెట్టవోయీ
గట్టిమేలు తలపెట్టవోయి
వ్యవహారిక భాషలో సుతిమెత్తగా మందలిస్తూ, బుజ్జగిస్తూ చెప్పడం గురజాడకు వెన్నతో పెట్టిన విద్యని పై పద్యాల ద్వారా తెలుస్తున్నది. అందుకే శ్రీ శ్రీ మాటల్లో గురజాడ వట్టి ఫోటోగ్రఫీ కాదని ఎక్సరే ఫోటోగ్రఫీ అని కొనియాడారు. ఇలా తాత్విక భావాలతో ప్రజలను తన గేయాలతో నడిపించి సమాజంలో దాగిన దురాచారాలను, మూఢనమ్మకాలను తరిమే ప్రయత్నంలో ఫలితాన్ని పొందారు. అటువంతు మహనీయున్ని తలుచుకుని ఆయన జయంతి రోజు తలుచుకుని మనసారా తరిద్దాం.
యం. లక్ష్మి
98484 34500
- Tags
- Gurajada Apparao