- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యూలరైజేషన్‌పై నిర్ణయం తీసుకుంటారా?
ఇప్పటికీ చాలా రాష్ట్రాలలో రెగ్యులర్ రిక్రూట్‌మెంట్‌లు లేవు. కాంట్రాక్టు పద్ధతిలోనే రిక్రూట్ చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు కాబట్టి 20 వేల మందిని రెగ్యులరైజ్ చేయక తప్పదు. వచ్చే ఎన్నికలకు ముందు చేస్తారా? ఈలోపే చేస్తారా అన్నది తేలాలి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ తాము అధికారంలోకి రాగానే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని మాట ఇచ్చారు. కానీ, ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మంత్రుల కమిటీ, అధికారుల కమిటీ వేసి చేతులు దులుపుకున్నారు. నమ్మి వెంట నడిచిన కాంట్రాక్టు ఉద్యోగులకు మూడున్నరేండ్లుగా ఎదురు చూపులు తప్పడం లేదు.
కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చి అన్ని పార్టీలు, ప్రభుత్వాలు ఓట్లు వేయించుకుంటాయి. ఆ తరువాత మరిచిపోతాయి. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాత్రం కాంట్రాక్టు ఉద్యోగులకు దీపావళి సందర్భంగా సూపర్ గిఫ్ట్ ఇచ్చారు. తన 76 వ జన్మదినోత్సవం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న 57 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాదు, రాష్ట్రంలో ఇకపై కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు ఉండబోవని కూడా స్పష్టం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులు ఏ రాష్ట్రంలో అయినా ఓటు బ్యాంకులే. పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకుంటారు. కానీ చెయ్యరు. ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ చేసింది ఇదే.
అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చినా ఆ దిశగా ఒక్క ప్రయత్నమూ లేదు. ఇటీవల కేసీఆర్ 20 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని ప్రకటించారు. అడుగు కూడా ముందుకు పడలేదు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఒక్క సంతకంతో 57 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి చూపించారు. ఇందుకు ప్రభుత్వానికి యేటా రూ.13 వందల కోట్ల ఖర్చు అవుతుందని కూడా చెప్పారు. ఒడిశా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో తెలుగు రాష్ట్రాల సీఎంల మీద ఒత్తిడి పడే అవకాశం ఉంది.
అంతటా ఇంతే
ఇప్పటికీ చాలా రాష్ట్రాలలో రెగ్యులర్ రిక్రూట్‌మెంట్‌లు లేవు. కాంట్రాక్టు పద్ధతిలోనే రిక్రూట్ చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు కాబట్టి 20 వేల మందిని రెగ్యులరైజ్ చేయక తప్పదు. వచ్చే ఎన్నికలకు ముందు చేస్తారా? ఈలోపే చేస్తారా అన్నది తేలాలి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ తాము అధికారంలోకి రాగానే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని మాట ఇచ్చారు. కానీ, ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మంత్రుల కమిటీ, అధికారుల కమిటీ వేసి చేతులు దులుపుకున్నారు.నమ్మి వెంట నడిచిన కాంట్రాక్టు ఉద్యోగులకు మూడున్నరేండ్లుగా ఎదురు చూపులు తప్పడం లేదు.
మినిమం టైం స్కేల్ అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, రెగ్యులర్ ఉద్యోగులకు లభిస్తున్న సదుపాయాలు కాంట్రాక్టు ఉద్యోగులకు అందడం లేదు. ప్రభుత్వంలో 13,671 మంది, ప్రభుత్వ రంగ సంస్థలలో 50 వేల మంది వరకు ఒప్పంద ఉద్యోగులు ఉంటారు. అత్యధికంగా 6,400 మంది వరకు భోదనా విభాగంలోనే ఉన్నారు యేటా ఏప్రిల్ వచ్చేసరికి తమ సర్వీస్ పునరుద్ధరణ అవుతుందో లేదో అని కలవరపడుతూ ఉంటారు. పీఎఫ్ సదుపాయం లేదు. ఆరోగ్య కార్డులు ఇవ్వడం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చి ఎనిమిదేండ్లు దాటింది. నిరుద్యోగులను నిండా ముంచారని నిందలు ఎదుర్కొంటున్న జగన్, కేసీఆర్ కాంట్రాక్టు ఉద్యోగులను ఇకనైనా రెగ్యులరైజ్ చేస్తారా లేదా అన్నది చూడాలి.
మందా వెంకటేశ్వర్లు
ఏఐటీయూసీ మున్సిపల్ కార్మిక సంఘం
జాతీయ సమితి సభ్యులు
94417 75596