ప్రియాంక సభతో యువతకు జోష్... నాయకుల ఖామోష్

by Ravi |   ( Updated:2023-05-10 00:15:32.0  )
ప్రియాంక సభతో యువతకు జోష్... నాయకుల ఖామోష్
X

ప్రియాంక గాంధీ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగు పెట్టడంతో కాంగ్రెస్ పార్టీకి కొత్త జోష్ వస్తుందని అధినాయకత్వం అంచనా వేస్తున్న తరుణంలో తెలంగాణలో ఆ ప్రభావం ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. సీనియర్ నేతలు పాదయాత్రలు చేస్తున్నారు. ప్రజల్లో తిరుగుతున్నారు. ప్రభుత్వ పనితీరుపై, ఇటీవల పరిణామాలపై విమర్శలను తీవ్రతరం చేశారు. యువతను ఆకట్టుకునే లక్ష్యంతో యువ సంఘర్షణ వేదికగా కాంగ్రెస్ ఎంచుకున్నది. ఈ సభలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పాల్గొన్నారు.

ప్రియాంక తొలి సభ

ప్రియాంకగాంధీ సభ ద్వారా ఎన్నికల సమరశంఖం పూరించాలని టీపీసీసీ చేసిన ప్రయత్నాలు కొంతవరకు పార్టీ శ్రేణులలో ఉత్సాహాన్ని నింపినాయి. ప్రభుత్వ వైఫల్యాలపై టీఎస్పీఎస్సీ పేపర్‌ లీకేజీలను, ఉద్యోగాల భర్తీ, ఉపాధి కల్పనలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ. ''యువ సంఘర్షణ సభ'' పేరిట యూత్ డిక్లరేషన్ ప్రకటన యువతను ఆకర్షించే ప్రయత్నం చేశారు. యువతపై వరాల జల్లు ప్రతిపక్ష నేతలకు చురకలు తెలంగాణలో బలపడడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఈ సారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ముందుకు వెళుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ ఎందుకు అధికారంలోకి రాలేకపోతున్నామనే ప్రశ్న కాంగ్రెస్ మదిలో మెదులుతూనే ఉంది. అందుకే టీ కాంగ్రెస్ సీనియర్లు, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఎక్కడ ప్రచారం నిర్వహించినా... తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేర్చి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని చేస్తున్న వ్యాఖ్యలకు బలం చేకూర్చే విధంగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఊరికే ఇవ్వలేదన్నారు. బలిదానాలు వృధా కాకూడదని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ప్రియాంక కోరారు. తన కుటుంబం కూడా ప్రాణ త్యాగాలు చేసిందన్న ప్రియాంక వారి ప్రాణ త్యాగాలు వృధా కాకూడదని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యలకు ఉపశమన లేపనం పూసారు. తెలంగాణ ఏర్పాటుకు సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయం వెనుక స్వప్రయోజనాలు లేవని రాజకీయ లాభాపేక్ష లేదని కేవలం తెలంగాణా కోసం పోరాడి అమరులైన వారి ఆకాంక్ష నెరవేర్చటం కోసమేనని పేర్కొనడంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ వల్ల సాధ్యమైందన్న సెంటిమెంట్‌ను బలంగా మరోసారి ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు.

నాయకులు నమ్మకాన్ని కలిగించేనా?

తెలంగాణలో బలపడడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఈ సారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ముందుకు వెళుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ ఎందుకు అధికారంలోకి రాలేకపోతున్నామని ప్రశ్న కాంగ్రెస్ మదిలో మెదులుతూనే ఉంది. అందుకే టీ కాంగ్రెస్ సీనియర్లు, టి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఎక్కడ ప్రచారం నిర్వహించినా... తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేర్చి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రియాంక వాగ్ధాటి తెలిసిందే. అమరవీరుల కుటుంబాలకు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వారికి అధిక ప్రాధాన్యతనిస్తామని ఆమె సోమవారం నాటి సభలో చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగానే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, అమరవీరుల కుటుంబాలకు నెలకు ఇరవై ఐదు వేల పింఛను అందిస్తామని హామీలు గుప్పించారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల, తెలంగాణ కోసం పోరాడిన వారికి స్వాతంత్ర్య ఉద్యమకారులుగా గుర్తింపు, అమర వీరుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం, నిరుద్యోగులకు నెలకు నాలుగు వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రియాంక తెలిపారు. యువ మహిళా సాధికారికతకు పెద్దపీట, విద్యార్థులు, నిరుద్యోగ యువత కోసం యూత్ కమిషన్ ఏర్పాటు, ప్రతి ఏడాది జూన్ 2న నోటిఫికేషన్ సెప్టెంబరు నెలలో నియామక ఉత్తర్వులు ప్రతి జిల్లాలో స్కిల్ డెవలెప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులందరీకి ఫీజు రీఎంబర్స్‌మెంట్. రాష్ట్రంలో నాలుగు రాజీవ్ గాంధీ ట్రిపుల్ ఐటీల ఏర్పాటు లాంటి అంశాల ప్రస్తావన కొంతవరకూ సభలో జోష్ నింపాయి అనే చెప్పాలి.

ప్రియాంక గాంధీకి దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలు అప్పగించబోతున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించినా ఆ విషయంపై అధికారికంగా ప్రకటన చేయలేదు. వేదికపై కాంగ్రెస్ నాయకులు హుషారుగా కనబడినా ఎన్నికల్లో వారు ఏమేరకు ప్రభావం చూపుతారో అన్నది పరిశీలించాల్సిన విషయం. కుర్చీల కుమ్ములాటలు మరచి నాయకులు ఐకమత్యంగా వుంటూ ఓటర్లను ఆకర్షిస్తూ తెలంగాణా రాష్ట్రాన్ని సాధించడంలో కాంగ్రెస్ కీలక పాత్ర అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలి. గతంలో చేసిన వ్యవస్థాపక తప్పిదాలు చేయమని, పార్టీ మార్పిడులు ఉండవన్న నమ్మకాన్ని కలిగించి రాష్ట్ర నాయకునికి చేదోడు వాదోడుగా వుంటే పార్టీ మనుగడ సాధ్యం. లేదంటే ప్రశ్నార్థకమే అని చెప్పక తప్పదు.

వాడవల్లి శ్రీధర్

99898 55445

Advertisement

Next Story

Most Viewed