- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజకీయమంతా ఈ రోజు చుట్టే!
రజాకారు దళాల దురాగతాలకు అంతు ఉండేది కాదు. రైతులు పండించిన పంటలను కూడా దక్కనిచ్చేవారు కాదు. మహిళలను నగ్నంగా బతుకమ్మలు ఆడించేవారు. ప్రజల వద్ద నుంచి ముక్కు పిండి పన్నులు వసూలు చేసేవారు. ప్రజలు తిండిలేక అలమటిస్తే పట్టించుకొనేవారు కాదు. రజాకారులు విచ్చలవిడిగా గ్రామాలపై పడి ఇండ్లు తగలబెట్టి అందినకాడికి దోచుకొనేవారు. ఉద్యమాలను ఆపడానికి నిజాం పాలకులు ఉద్యమకారులను చిత్రహింసలకు గురిచేసేవారు. పటేల్ కృషితో తెలంగాణ భారతదేశంలో భాగమైంది. అయితే, ఈ సైనిక చర్య ప్రజామోదమా? కాదా? అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ చరిత్రను ఎవరి కోణంలో వారు విశ్లేషిస్తున్నారు. రాజకీయ పార్టీలు అవసరానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నాయి.
1945-46 ప్రాంతంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నిజాం వెన్నులో వణుకు పుట్టించింది. దీంతో నిజాం రజాకారులను, సైన్యాన్ని రంగంలోకి దించారు. వారు గ్రామాలపై పడి హింసకు దిగారు. 1947 ముందు భారతదేశం అనేక సంస్థానాలుగా ఉండింది. బ్రిటిష్ పాలకులు భారత యూనియన్‌లో సంస్థానాల విలీనం వారి ఇష్టానికే వదిలేశారు. నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ యూనియన్‌లో కలిసేందుకు నిరాకరించాడు. అయినా, నిజాం మీద ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. చివరకు 14 సెప్టెంబర్ నుంచి 17 సెప్టెంబర్ 1948 వరకు నాలుగు రోజుల పాటు ఆనాటి కేంద్ర హోమ్ మంత్రి సర్దార్ వల్లభ్ భాయి పటేల్ రాజకీయ చతురతతో పోలీసు చర్య జరిపి నిజాం పాలనకు చరమ గీతం పాడారు.
హైదరాబాదును ప్రత్యేక దేశంగా ఉంచాలని, కనీసం పాకిస్తాన్‌లోనైనా కలపాలని విశ్వ ప్రయత్నం చేసిన నిజాం పన్నాగాలను బద్దలు కొట్టారు. 'ఆపరేషన్ పోలో' సమయంలో వేలాది మంది అమాయక ముస్లింలను ఊచకోత కోశానే వాదన ఉన్నది. నిజానికి ఆనాటి నిజాం వ్యతిరేక పోరులో హిందువులతోపాటు షేక్ బందగీలాంటి ముస్లిం వీరులు, మఖ్దూం మొహియుద్దీన్ లాంటి కవులు కీలక పాత్ర పోషించారు. సాయుధ పోరాటాలు, కమ్యూనిస్ట్ పోరాటాలు ఉధృతంగా సాగాయి. అవి విజయవంతమైతే తెలంగాణ కమ్యూనిస్టుల చేతులకు వెళ్తుందనే ఉద్దేశంతోనే భారత ప్రభుత్వం సైనిక చర్య జరిపిందనేది వామపక్ష వాదుల వాదన. తెలంగాణ నిజాం పాలనలో ఉండగా కాంగ్రెస్ కృషితో తెలంగాణకు స్వేచ్చ లభించిందని కాంగ్రెస్ వాదన. అసలు చరిత్రను దాచిపెట్టి, చరిత్రను తమకు అనుకూలంగా మల్చుకుని మత విద్వేషాలు సృష్టించే పనిలో ఉంది బీజేపీ.
అంతా ఆరోజు చుట్టే
తెలంగాణ రాజకీయాలన్నీ సెప్టెంబర్ 17 చుట్టూనే తిరుగుతున్నాయి. ఒక్కో రాజకీయ పార్టీ దానిని ఒక్కోలా అభివర్ణిస్తూనే ఉంది. తెలంగాణ విలీనం కోసం హిందువులు, ముస్లింలు అంతా కలిసి పోరాడారని అంటున్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. సెప్టెంబరు 17ను జాతీయ సమగ్రతా దినోత్సవంగా జరిపించాలంటూ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన లేఖ రాసి ప్రకంపనలు సృష్టించారు. అప్పటికే తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్ణయించాలని కేంద్రం నిర్ణయించింది. రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి బదలాయింపు జరిగిన తెలంగాణ సమాజ పరిణామ క్రమానికి సెప్టెంబర్ 17 నాటికి 75 సంవత్సరాలు.
ఈ నేపథ్యంలో 'తెలంగాణ జాతీయ సమైక్యతా దినం' గా పాటించాలని, సెప్టెంబర్ 16,17, 18 తేదీలలలో మూడు రోజుల పాటు 'తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల' ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. 16న నియోజకవర్గ కేంద్రాలలో విద్యార్థులు, యువతీ యువకులు, మహిళలతో భారీ ర్యాలీలు. 17న జిల్లా కేంద్రాలలో మంత్రులు, మున్సిపాలిటీ, పంచాయతీ కేంద్రాలలో, ప్రభుత్వ కార్యాలయాలలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు జాతీయ జెండా ఎగరేయాలని నిర్ణయించింది. అదే రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఎగురవేస్తారు. 18న స్వాతంత్ర్య సమరయోధులు, కవులు, కళాకారులను గుర్తించి సన్మానాలు చేయాలని. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ' స్పూర్తిని దశ. దిశలా చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు.
అవసరాలకు అనుగుణంగా
రజాకారు దళాల దురాగతాలకు అంతు ఉండేదికాదు. రైతులు పండించిన పంటలను కూడా దక్కనిచ్చేవారు కాదు. మహిళలను నగ్నంగా బతుకమ్మలు ఆడించేవారు. ప్రజల వద్ద నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేసేవారు. ప్రజలు తిండిలేక అలమటిస్తే పట్టించుకొనేవారు కాదు. రజాకారులు విచ్చలవిడిగా గ్రామాలపై పడి ఇండ్లు తగలబెట్టి అందినకాడికి దోచుకొనేవారు. ఉద్యమాలను ఆపడానికి నిజాం పాలకులు ఉద్యమకారులను చిత్రహింసలకు గురిచేసేవారు. పటేల్ కృషితో తెలంగాణ భారతదేశంలో భాగమైంది. అయితే, ఈ సైనిక చర్య ప్రజామోదమా? కాదా? అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ చరిత్రను ఎవరి కోణంలో వారు విశ్లేషిస్తున్నారు.
రాజకీయ పార్టీలు అవసరానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నాయి. బీజేపీ ఇది విమోచన దినమంటోంది. కమ్యూనిస్టులు తమకు అనుకూలంగా వక్రీకరించారని ఆరోపిస్తోంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చేసిన కమ్యూనిస్టు పార్టీలు ఇది విద్రోహ దినమే అని వాదిస్తున్నాయి. కాంగ్రెస్, టీజేఎస్ తదితర పార్టీలు మధ్యేమార్గంగా దీన్ని విలీన దినోత్సవమని అంటున్నాయి. సహ జీవన విలువలకు భంగం కలుగొద్దని అధికార టీఆర్ఎస్ పార్టీ జాతీయ సమైక్యతా దినంగా జరుపుకోవాలని నిర్ణయించింది.
డా. సంగని మల్లేశ్వర్
జర్నలిజం విభాగాధిపతి
కేయూ, వరంగల్
98662 55355