స్వాగతం శోభకృత్

by Ravi |   ( Updated:2023-03-21 18:30:35.0  )
స్వాగతం శోభకృత్
X

ప్రతి ఏడాది

ప్రకృతి గర్భం దాల్చి,

అగుపించని కాలగుహరంలో

ఆరు ఋతువులను కంటుంది.

ఒక్కో ఋతువుకు ఒక్కో గుణం

గమనం వాటి రహస్యం.

ప్రతీ ఋతుగమనం

అగుపించని కాల చట్రంలో పయనిస్తూ...

మనిషి జీవిత అనుభవాల్లో ఎదురైన

ప్రతీ క్రియకు కారణభూతమౌతుంది.

నమ్మలేని ఈ కటిక నిజం

మానవ మేథకూ తెలుసు.

అది పరమ సత్యమని తెలిసినా

పంచేంద్రియాలను పగ్గంలా బిగబట్టి

తాను సాగుతున్నది తిరుగులేని

రహదారనుకుంటాడు.

ఎదురుపడిన అవరోధాలను చీల్చి

దాటిపోవలనుకుంటాడు.

పగ్గం బిగువు తగ్గుతున్నా...

శరీరం కృశించి,శ్వాసకు ముడులుపడ్డా...

రాదారి ఇరుకుల్లో పడి నలిగిపోతాడు.

జీవితానికి నిత్య సహచరి ప్రకృతేనని,

చిరంతన సత్యాన్ని నమ్మలేడు.

కాల చక్ర భ్రమణంలో..

ఉగాది పర్వదినం సరికొత్త ఆశలు

ఆశయాలకు జీవం పోస్తుంది.

కొత్త ఊపుకు ఊతమవుతుంది.

ఆశ మంచిదే,ఆశయమూ మంచిదే

ఆశల పాదులో మొలిచే ఆశయం గొప్పదే

ప్రకృతి కన్న వసంత ఋతువు తొలి రోజైన

శోభకృత్ ఉగాది పర్వదినానికి స్వాగతం పలుకుతూ...

అనివార్యమైన ఋతు కాలంలో

పూడుకుపోయిన గత స్మృతులను అనుభవాలుగా

కొత్త ఆశ, శ్వాసను చేదుకుందాం.

దాసరి శాంతకుమారి

9652483644

Advertisement

Next Story

Most Viewed