- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శోభకృతూ శుభం శుభం
X
మరులు గొలిపే మనోహరంగా
చిగురించిన నవవసంతం
అందాల ఆమని కాగా,
పులకరించి పరవశించిన
గండుకోయిల రాగాల సందున
చీకటి దారులు విడిచి,
చైత్రమాస తొలి ఉషస్సువై,
నవనవోన్మేషాల ప్రకృతి శోభవై,
దశదిశలా వేవేల వర్ణాలతో
సర్వాలంకార సుశోభితవై
నండూరి ఎంకివై,
అణువణువూ పరిమళించు పరిమళాలతో
ఉజ్వలిస్తూ, ఉద్యమిస్తూ, ఊపిర్లూదుతూ
ఆశల పల్లకీలో ఊరేగుతూ,
వాసంతకన్య అనుబంధాల
కౌగిలింతల ముడివేయగా
ఉత్సాహ సమీరాల్ని వెంటతెస్తూ,
అవనికంతా ఆది పర్వదినాన
తెలుగు ముంగిళ్ళలోకి తొలిచుట్టమై,
సంబరాల వసంతాల మురిపాల తేలే
నవవత్సరమై,
తెలుగు జాతి కీర్తి ప్రభ వెలయగాను,
ఎల్లరకూ శాంతి సమైక్యతా
సమరసతలను పంచగాను,
విచ్చేస్తున్న ఓ శోభకృతూ !
నీ ఆగమనమే మాకు హరిచందనం,
నీ రాకతో పుడమంతా విరి నందనం.
నీ రాక కలిగించు శుభము శుభము,
నీకు జయము జయము.
వేమూరి శ్రీనివాస్
99121 28967
Advertisement
- Tags
- poem on ugadhi
Next Story