అవయవదానం ప్రాణదానం

by Ravi |   ( Updated:2023-09-27 00:30:44.0  )
అవయవదానం ప్రాణదానం
X

మనం బతికి ఉండి మరొకరికి ప్రాణాలు పోయవచ్చు..

మనం చనిపోయి ఇతరుల దేహాల్లో

బతికి ఉండవచ్చు..

బతికి ఉండీ.. మనసు ఉంటే

మరొకరికి ప్రాణాలు పోయవచ్చు

మరణించాక మట్టిలో కలిసే ప్రాణాలు..

మనసుంటే మరికొందరికి ప్రాణాలు పోయవచ్చు..

అగ్నికి ఆహుతి అయినా

మట్టిలో కలిసిపోయినా

మిగిలేది శూన్యం..

అదే అవయవ దానంతో

చనిపోయి జీవించవచ్చు..

జీవిస్తూ మరొకరికి ప్రాణాలు పోయవచ్చు

అవయవదానం ఎందరి ఆరోగ్యాన్నో కాపాడుతుంది..

ఎన్నో కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతుంది..

ఎందరికో అమ్మా నాన్నలను

అక్కా చెల్లెళ్ళును అందిస్తుంది.

ఎన్నో కుటుంబాలను నిలబెడుతుంది

ఒక్క నిర్ణయం ఎందరికో ఉషోదయం..

ఎన్ని యాగాలు చేసినా

రాని పుణ్యఫలం

ఒక్క అవయవ దానంతో పొందవచ్చు .

ఎన్ని దాన ధర్మాలు చేసినా

రాని కీర్తి ప్రతిష్టలు

ఒక అవయవదానంతో

సాధించవచ్చు..

చనిపోయి రేపటిని చూసే భాగ్యం

బతికుండీ రేపటిని చూపే భాగ్యం..

రెండూ సాధ్యం..

మీ ఒక్క నిర్ణయంతో..

నేడే అవయవ దానానికి ప్రతిజ్ఞ చేయండి..

అవయవ దానానికి అంగీకారాన్ని

తెలుపండి..

రేపటి వెలుగు కోసం

మీ వంతు ప్రయత్నం చేయండి.

ప్రాణ దాతలై కలకాలం వర్ధిల్లండి.

(నేడే https://notto.abdm.gov.in లో అవయవదానానికి రిజిస్టర్ అవ్వండి)

శిరందాస్ శ్రీనివాస్

నిజాం వైద్య విజ్ఞాన సంస్థ

94416 73339

Advertisement

Next Story

Most Viewed