- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శాసనసభ సీటు కావాలి!
కష్టాలెరగని తీరంలో
ఇష్టారాజ్యంగా సంపాదనకై
నాకు శాసనసభ సీటు కావాలి
అది మంత్రి పదవికి దారి చూపాలి!
పీలక దాకా మెక్కినా
అడ్డదార్లెన్ని తొక్కినా
అడ్డుకోలేని జనం కావాలి
అడుగడుగునా హారతి పట్టాలి!
ఎదురు తిరిగిన వాడి
మాడు పగలగొట్టుటకు
చట్టంతో పనిలేని చుట్టం లాంటి
పోలీసుల దండు కావాలి!
బడ్జెట్ లెక్కలను బేరీజు వేసి
కాంట్రాక్టర్లను కవ్వించి
కమీషన్ల మార్గాలకు దువ్వే
ఆదాయాల మార్గాన్వేషకులు కావాలి!
శతకోటి దరిద్రాల ప్రజలకు
అనంతకోటి ఉపాయాలను
వల్లించి, వల్లించి వారి ఆలోచనలను
దారి మళ్లించే మాటకారి కావాలి
అప్పుడప్పుడు సన్మానాల సభలు పెట్టి
డప్పు చప్పుళ్లు, సన్నాయి వాయిద్యాలతో
పురమంతా కలియ దిప్పేటి
స్వామి భక్త పరాయణులు కావాలి!
పై పదవుల కెదుగుటకై
పైరవీల నాశ్రయించి
మోతుబరిని చాటింపగల
మహా మహా మాయగాళ్లు కావాలి!
ఇచ్చేవాటిది ఖర్చు లెక్కగా
పుచ్చుకునే వారి కవి ఆదాయం హక్కుగా
అవినీతిని నీతిగా నిర్వచించగల
(అ)న్యాయ సలహాదారులు కావాలి!
భారత బ్యాంకుల్లో ఇష్టం లేనివాళ్లు
చీమచిటుక్కు మన్నా తెలిపేటి
స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు తెరచుటకై
పౌరుల హక్కుగా రాజ్యాంగ సవరణ కావాలి!
దేశీయ, విదేశీయ తేడాలెరుగని దేశంగా
అన్ని దేశాల వారిని అక్కున చేర్చుకుని
వ్యాపార లావాదేవీలను వారికే అప్పజెప్పగ
అప్పులెక్కున భారతాన్ని అమ్ముటకు లైసెన్స్ కావాలి!
కోరికలు కొన్నే అయినా దొరకని వింకెన్నో!
అరమరిక లెరుగని ప్రజలకిక వనవాసం
ప్రజాస్వామ్యాన్ని పాతరేసిన పౌరుల సంరంభంలో
దోచుకు తినేవారే దొరలీ కాలంలో!
వనవాసీలు, ఆదివాసీల రోదనలకిక అంతెక్కడ?
జనావాసాలకు దూరమౌతున్న పాలకులకు చోటెక్కడ?
అవినీతికి హారతి పడుతున్న నేతలకు పరువెక్కడ?
పరిహాస బాధితులైన ప్రజలకు దిక్కెక్కడ?
పెద్దిరెడ్డి తిరుపతి రెడ్డి
94400 11170
- Tags
- Poem