నీలో నేను

by Ravi |   ( Updated:2023-09-24 18:45:40.0  )
నీలో నేను
X

అద్దం ముందర నిలబడి

నన్ను నేను వెతుక్కుంటూ

నా ప్రతిబింబాన్ని చూస్తూ

నాకు నేనే వేసుకున్న

ఓ ప్రశ్న నా వ్యక్తిత్వమేదని

అంతా నీవై నన్నాక్రమించి

మదిలో ఓ నదిలా కలిసి పోయి

నేనే నీవైపోయిన వేళ

నేనెక్కడ, నా వ్యక్తిత్వమెక్కడ

నీడలో జాడైనా లేదు

అడుగుల గుర్తులైన లేవు

కనుచూపంతా నీవే

నిదురలో నీవు

నా యావత్తు నీవైనావు

నా మనసు నీకిచ్చినప్పుడే

నా వ్యక్తిత్వం నీకర్పించాను

నీలో నన్ను దాచుకున్నాను

ఇప్పుడు కొత్తగా నా వ్యక్తిత్వం

వెతికే పనేమిటి?

ఇష్టాలు కష్టాలయితే

తత్వాలు వెతకాలి

మనసులు ఒక్కటైన వేళ

వ్యక్తిత్వం మనసత్వమై

మురుస్తూ మురిపిస్తుంది

యం. లక్ష్మి

తెలుగు అధ్యాపకులు

7989049892

Advertisement

Next Story

Most Viewed