- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భవిష్యత్తు సోషలిజానిదే
70 యేళ్ల పాటు నిరాటకంగా కొనసాగిన తొలి సోషలిస్టు స్వప్నం గోర్భచెవ్ అనుసరించిన అసహేతుక విధానాలతో ముక్కలు ముక్కలుగా చెదిరిపోవడం పెను విషాదం. గోర్భచెవ్ మరణానంతరం సోషలిస్ట్ వ్యతిరేక వ్యక్తులు శక్తులు ఆయనను గొప్ప యోధునిగా కీర్తించాయి. జన వ్యతిరేకతను పోగు చేసుకున్న ఆయన వారికి యోధుడిగా ఎలా కనిపిస్తున్నాడో అర్థం కావడం లేదు. ప్రపంచానికి ప్రత్యామ్నాయ మార్గం చూపిన లెనిన్ పోరాటం, స్టాలిన్ సంకల్పం, అంతిమంగా సోషలిస్ట్ వ్యవస్థను నిట్టనిలువునా కూలిపోవడానికి దోహదపడిన ఆయనను సోషలిస్టు వ్యతిరేక శక్తులు కీర్తించడం సహజమే. కానీ, ఆయన గొప్ప యోధుడు కాదనేది శ్రామిక జన బాహుళ్యంలోకి గూడు కట్టుకొని ఉంది.
జార్ చక్రవర్తుల నియంతృత్వ పాలన నుంచి రష్యాను విముక్తి చేశారు లెనిన్. ప్రపంచ చరిత్రలో తొలిసారి మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని అన్వయించి సోషలిస్టు ప్రభుత్వాన్ని స్థాపించారు. దానిని 'యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్'గా తీర్చిదిద్ది సరికొత్త చరిత్రని సృష్టించారు. సోషలిస్ట్ వ్యవస్థని ఆచరణలో శాస్త్రీయంగా ఆవిష్కరించి స్వల్ప కాలం పాటు మాత్రమే రష్యాను పాలించారు. రష్యాను సూపర్ పవర్‌గా తీర్చిదిద్దడంలో విశేష కృషి చేశారు. లెనిన్ పాలనలో అనుసరించిన విధానాలు దేశ ప్రగతికి ఎంతో దోహదం చేశాయి.
సామ్రాజ్యవాద అమెరికాని ఢీకొట్టే దిశగా రష్యా ఎదగడం మొదలైంది. లెనిన్ తర్వాత ఉక్కు మనిషి జోసెఫ్ స్టాలిన్ కాలంలోనూ రష్యా ఉత్కృష్ణ ప్రగతిని సాధించింది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు పలచనవడంతో అమెరికా ఏకధృవ ప్రపంచానికి రష్యా అడ్డుకట్ట వేయడం ప్రపంచచరిత్రలో సరికొత్త అధ్యాయం. నిజానికి రష్యాలో లెనిన్, స్టాలిన్ పాలనా కాలం సోషలిస్టు పాలనలో ఉత్కృష్ణ యుగంగా పేర్కొనవచ్చు. తర్వాత వచ్చిన పాలకుల కాలంలో సోషలిస్టు విధానాలు నామమాత్రంగానే అమలయ్యాయి.
అసహేతుక నిర్ణయాలతో
స్టాలిన్ పాలనతో ప్రభావితుడైన మిఖాయిల్ గోర్భచెవ్ కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా, కేంద్ర కార్యదర్శిగా అంతిమంగా దేశాధినేతగా ఎదిగారు. తన పాలనలో సరికొత్త ఒరవడిని సృష్టించారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సమస్యలు పరిష్కరించారు. నాటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్‌తో చర్చలు జరిపి అమెరికా-రష్యా మధ్య సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన ప్రచ్ఛన్న యుద్ధాన్ని నివారించారు. అయిననూ నేడు యుద్ధాలు సాగుతూనే ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, చైనా-తైవాన్ యుద్ధ సన్నాహాలు అందుకు ఉదాహరణ.
గోర్బచేవ్ నోబెల్ శాంతి బహుమతితో పాటు ఎన్నో పురస్కారాలు పొందారు. నిబద్ధత కలిగిన, కరుడుగట్టిన మార్క్సిస్ట్-లెనినిస్ట్‌గా పేరు గడించారు. క్రమంగాక్రమంగా సంస్కరణల బాట పట్టారు. స్టాలిన్ విధానాలను మెరుగు పరుస్తున్నానని అంటూనే సోషలిస్ట్ వ్యతిరేక వైఖరితో ముందుకు సాగారు. డీస్టాలినైజేషన్ సంస్కరణలను సమర్థించారు. ఈ సంస్కరణలే సోషలిస్ట్ వ్యవస్థని ఉన్నతంగా తీర్చిదిద్దుతాయని ప్రకటించారు. ఆర్థికరంగ అభివృద్ధి కోసమంటూ పెరిస్త్రోయికా, గ్లాస్‌నాస్త్ వంటి సంస్కరణలను అమలు చేశారు. అసహేతుక నిర్ణయాలతో తప్పటడుగులు వేశారు. దీంతో జనాగ్రహం కట్టలు తెంచుకుంది. చివరకు 'యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్' పతనానికి దారి తీసింది.
దానికి కారణభూతుడిగా
70 యేళ్ల పాటు నిరాటకంగా కొనసాగిన తొలి సోషలిస్టు స్వప్నం గోర్భచెవ్ అనుసరించిన అసహేతుక విధానాలతో ముక్కలు ముక్కలుగా చెదిరిపోవడం పెను విషాదం. గోర్భచెవ్ మరణానంతరం సోషలిస్ట్ వ్యతిరేక వ్యక్తులు శక్తులు ఆయనను గొప్ప యోధునిగా కీర్తించాయి. జన వ్యతిరేకతను పోగు చేసుకున్న ఆయన వారికి యోధుడిగా ఎలా కనిపిస్తున్నాడో అర్థం కావడం లేదు. ప్రపంచానికి ప్రత్యామ్నాయ మార్గం చూపిన లెనిన్ పోరాటం, స్టాలిన్ సంకల్పం, అంతిమంగా సోషలిస్ట్ వ్యవస్థను నిట్టనిలువునా కూలిపోవడానికి దోహదపడిన ఆయనను సోషలిస్టు వ్యతిరేక శక్తులు కీర్తించడం సహజమే. కానీ, ఆయన గొప్ప యోధుడు కాదనేది శ్రామిక జన బాహుళ్యంలోకి గూడు కట్టుకొని ఉంది.
నూతన ప్రపంచ ఉషోదయాన్ని సంస్కరణల పేరుతో అడ్డుకొని సోషలిజం పతనానికి కారణభూతుడిగా నిలిచి, తన చరిత్రను సమాధి చేసుకున్న నేతగా ఆయనను పరిగణించవచ్చు. సోవియట్ యూనియన్‌లో సోషలిజం పతనం కావడంతో 'మానవజాతి మహాప్రస్థానం పెట్టుబడిదారీ విధానం తోనే పురోగమిస్తుంది' అని పెట్టుబడిదారులు నాడు కోడై కోశారు. కానీ, అనతి కాలంలోనే లాటిన్ అమెరికాలో పలు సోషలిస్ట్ ప్రభుత్వాలు ఏర్పడి నిరాటకంగా కొనసాగుతున్నాయి. ఏమైనా పెట్టుబడిదారీ పీఠాలు కదిలిపోవడం ఖాయం. భవిష్యత్తు అంతా సోషలిజానిదే.
జేజేసీపీ బాబూరావు
94933 19690