- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విప్లవ పార్టీల విలీనం
సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా, సీపీఐ (ఎం.ఎల్) (రెవెల్యూషనరీ ఇనీషియేటివ్), పీసీసీ సీపీఐ (ఎం.ఎల్.) (ప్రోవిజనల్ సెంట్రల్ కమిటీ) పార్టీలు 2024 మార్చి 3,4,5 తేదీల్లో ఖమ్మం నగరంలో నిర్వహిస్తున్న విలీన మహాసభ ద్వారా సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ ఆవిర్భవించబోతున్నది. 15 రాష్ట్రాల్లో ఉన్న మూడు పార్టీల నిర్మాణం ఒక్క కుదురు కిందికి రానున్నది. రెండున్నర లక్షల మంది సంఘటిత, అసంఘటిత కార్మిక వర్గం, నాలుగు లక్షల మంది రైతు, కూలీ వర్గం, తొంభై వేల మంది యువజన సంఘ సభ్యులు, లక్షలాది మంది విద్యార్థులకు ప్రాతినిధ్యం వహించే 350 మంది ప్రతినిధులతో మహాసభ నిర్వహిస్తున్నాం. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, అస్సాం, కేరళ, బీహార్, జార్ఖండ్ తదితర 15 రాష్ట్రాల ప్రతినిధుల సారధ్యంలో ఈ మహాసభలు సాగనున్నాయి.
మూడు పార్టీల విలీనం కోసం గత సంవత్సరం కాలంగా చర్చలు సాగుతున్నాయి. అనేక రాష్ట్రాల రాజధానుల్లో మూడు పార్టీల అగ్ర నాయకత్వం దశలవారీగా చర్చించింది. మౌలికమైన విషయాల పట్ల ఏకీభావానికి చేరుకున్నది. 2022 ఫిబ్రవరి 22న న్యూడెమోక్రసీ నుండి విడివడిన ప్రజాపంథా పార్టీ పూర్తి స్థాయి మౌలికమైన సిద్ధాంత విభేదంతో బయటకు వచ్చింది. గతంలో ఎంఎల్ పార్టీలు రచించిన వ్యూహం ` ఎత్తుగడల్ని విభేదించింది. సాయుధ దళాల నిర్మాణం కంటే, కోట్లాది కార్మిక వర్గాన్ని, ప్రస్తుత స్థితిలో రైతు, కూలీలను సంఘటితం చేయాలని నిర్ణయించుకొన్నది. చైనా మాదిరిగా భారత్‌లో దీర్ఘకాల సాయుధ స్థితికి ఈ దేశం అర్థవలస, అర్థభూస్వామ్య దేశం కాదని తీర్మానించింది. అభివృద్ధి చెందుతున్న పెట్టుబడిదారీ దేశంగా నిర్ధారిస్తూ, అందుకు తగిన నిర్దేశాలను సమకూర్చుకుంటున్నది. సీపీఐ (ఎం.ఎల్.) మాస్ లైన్ ఆవిర్భావం అనేది ఎం.ఎల్. పార్టీలో నుండి ఉబికి వచ్చిన సరికొత్త సిద్ధాంత ప్రయోగమే.
మతోన్మాదం, కార్పొరేటీకరణ జమిలిగా సాగుతున్న దేశంలో, అట్టడుగు వర్గాల ప్రజల హక్కులు, అవసరాలు మృగ్యమే. అంతేకాకుండా మత, కుల ఉన్మాదంతో మానవ హననానికి దారితీస్తున్నది. రాజ్యాంగ విలువలు, వ్యవస్థలు అంతరిస్తున్నాయి. ఈ స్థితిలో కార్మిక, రైతు, కూలీ, యువజన ఒక్క మాటలో యావత్ ప్రజల ఐక్యత అత్యవసరమైనది. అందుకు సీపీఐ (ఎం.ఎల్.) మాస్ లైన్ ఒక దిక్సూచి కావాలి.
(మార్చి 3,4,5 తేదీలలో ఖమ్మంలో విలీన మహాసభ జరుగుతున్న సందర్భంగా.)
- ఎం. హన్మేశ్,
రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు
సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా)
94411 62844
- Tags
- CPI ML