- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జయతి జయతి మహాయుతి
మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి హవా ఈసారి కూడా కొనసాగింది. మ్యాజిక్ ఫిగర్ (145)ని పాలకకూటమి అవలీలగా దాటేసింది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి కనీస పోటీ ఇవ్వలేకపోయింది. మహారాష్ట్ర ఓటరు ఈసారి స్పష్టమైన చరిత్రాత్మకమైన తీర్పుతో పాటు సుస్థిర ప్రభుత్వానికి పట్టం కట్టారు. యువత, మహిళా ఓటర్లు తమ ప్రభావం చూపారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా అన్ని స్థానాలకూ కలిపి ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో హోరాహోరీ తప్పదని అంతా భావించినా పోలింగ్ తరువాత వెలువడిన ఎన్నికల ఫలితాలలో మాత్రం కూటమి అత్యధిక స్థానాలు సాధించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రతిపక్ష స్థానానికి పరిమితం కావల్సి వచ్చింది. ఇక ఈడీ అరెస్ట్ చేసినప్పటికీ హేమంత్ సోరెన్ ప్రజాదరణ చెక్కుచెదరకుండా ఉందని జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితం చూపించింది.
రెండు రాష్ట్రాల్లో ఇప్పటివరకు వెలువడిన ఫలి తాల సరళి ప్రకారం.. మహారాష్ట్రలో మహాయుతి కూటమి 236 స్థానాల్లో గెలుపొందింది. అటు ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి 48 స్థానాల్లో గెలుపొందింది. ఇతరులు 4 స్థానాల్లో గెలిచారు. మహారాష్ట్రలో మొత్తం 288 శాసనసభ స్థానాలుండగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేం దుకు 145 ఎమ్మెల్యేలు అవసరం.. ఇక జార్ఖండ్ లో జేఎంఎం కూటమి 56 సీట్లతో గెలుపొందగా బీజేపీ 24 స్థానాల్లో గెలిచింది.
ఓబీసీల ఓట్లే కీలకం..!
మహారాష్ట్రలో ఓబీసీ ఓట్లను తనకు అనుకూలంగా సంఘటితం చేసేందుకు మహాయుతి క్షేత్రస్థాయిలో శ్రమించింది. ఈ ఎన్నికల్లో ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) ఓట్ల ఏకీకరణ కీలకమైన అంశాల్లో ఒకటి. భారతీయ జనతా పార్టీ (బీజేపీ), మహాయుతి కూటమిలో భాగంగా, మరాఠీ యేతర ఓట్లను, ముఖ్యంగా ఓబీసీలలో ఏకీకృతం చేయడానికి చురుకుగా పనిచేసింది. మాలి, ధన్‌గర్, వంజరి వర్గాలను ఏకతాటిపైకి తెచ్చింది. కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్న మరాఠా కమ్యూనిటీ ఆధిపత్యాన్ని ఎదుర్కోవడం ఈ వ్యూహం లక్ష్యం. ఓబీసీల కన్సాలిడేషన్ బీజేపీ, దాని మిత్రపక్షాలకు అనుకూలంగా పని చేసింది. ఇటీవలి హర్యానా ఎన్నికల్లో కూడా ఈ వ్యూహం విజయవంతమైంది. కాంగ్రెస్ హర్యానాలో జాట్‌ల ఓట్లపై దృష్టి సారించడంతో, బీజేపీకి అనుకూలంగా కౌంటర్ కన్సాలిడేషన్ కనిపించింది. 'ఏక్ హై తో సేఫ్ హై' అనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నినాదం, ఓబీసీల ఓట్లను ఏకీకృతం చేయడానికి బీజేపీ చేసిన గట్టి ప్రయత్నాలు ముఖ్యమైన ప్రయోజనాన్ని అందిం చాయి. కాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రత్యక్ష పోటీ జరగడం మొత్తం ఫలితాన్ని నిర్ణయించడంలో కీలకమైన అంశంగా మారింది.
మహాయుతికి మేలు చేసిన పథకం
మహారాష్ట్ర ఎన్నికల్లో రెండు కూటముల నుండి వివిధ రెవిడీలు (ఉచితాలు), వాగ్దానాలు కూడా ఎన్నికలను యుద్ధభూమిగా మార్చాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రకటనలు, మహారాష్ట్రకు పెద్ద పారిశ్రామిక ఒప్పందాలు మహాయుతి కూటమికి కీలకంగా మారాయి. పాలక కూటమి చే గేమ్ చేంజర్‌గా పేర్కొనబడిన లడ్కీ బహిన్ యోజన పథకం, 21 నుండి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల, వార్షిక కుటుంబ ఆదాయం రూ. 2.5 లక్షల కంటే తక్కువ ఉన్న మహిళలకు నెలకు రూ.1,500 అందిస్తుంది. ఈ పథకం ద్వారా కనీసం 2.26 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరగలదు. నెలవారీ ప్రయోజనాన్ని రూ. 2,100కి పెంచుతామని కూడా పాలక కూటమి వాగ్దానం చేసింది, ముఖ్యంగా ఆర్థిక కష్టాలు ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో, మహాయుతికి ఎక్కువ మహిళా ఓట్లను కూడా సంపాదించడంలో ఈ పథకం సహాయపడింది.
ముచ్చటగా మూడోసారి జేఎంఎం
మనీలాండరింగ్ కేసులో ఈ ఏడాది ప్రారంభం లో ఈడీ అరెస్టు చేసిన తర్వాత డంప్‌లో ఉన్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేతృత్వంలోని కూటమికి అద్భుతమైన పరిణామాన్ని అందించారు. ఈడీ అరెస్ట్ చేసినప్పటికీ హేమంత్ సోరెన్ ప్రజాదరణ చెక్కుచెదరకుండా ఉందని ఫలితం చూపించింది. జార్ఖండ్‌లోని అన్ని కీలక ప్రాంతాలైన చోటా నాగ్‌పూర్, కొల్హా న్, కోయిలాంచల్, పాలము, సంతాల్ పరగణాలలో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి తన ప్రభా వాన్ని చూపించింది. చొరబాటుదారులు గిరిజనుల నుండి జల్, జమీన్, అడవిని లాక్కుంటున్నందున జార్ఖండ్‌లోని 'మాటి, బేటీ, రోటీ' ప్రమాదంలో పడ్డాయని బీజేపీ చేసిన ఎన్నికల ప్రచారం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను ధిక్కరిస్తూ, జార్ఖండ్ మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. 2019 ఎన్నికల్లోనూ జేఎంఎం-కాంగ్రెస్ కూటమి 47 సీట్లు గెలుచుకోవడం తెలిసిందే. జేఎంఎం సంక్షేమ పథకాలు, ప్రత్యేకించి మైయ సమ్మాన్ యోజన గట్టి ప్రభావం చూపింది. అర్హత గల మహిళా లబ్ధిదారులకు నెలకు రూ. 1,000 పొందేందుకు మైయా సమ్మాన్ యోజన పథకం వీలు కల్పించడం వల్ల మహిళా ఓటర్ల బలమైన మద్దతుతో జేఎంఎం విజయం సాధించింది. మనీలాండరింగ్ కేసులో ఈడీ సీఎం హేమంత్ సొరేన్‌ని జనవరి 31న అరెస్టు చేసింది. ముఖ్యమంత్రి అరెస్టు ఘటనను ఒక గిరిజన నాయకుడి వేధింపుగా జేఎంఎం చిత్రీకరించింది. ఆ సానుభూతి బలంగా పనిచేసిందని ఫలితాలు తేల్చిచెప్పాయి.
- వాడవల్లి శ్రీధర్
99898 55445