- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లేఖ:మార్పు అవసరం
ఉపాధ్యాయులందరూ తమ ఆస్తుల వివరాలు తెలియజేయాలంటూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి, తిరిగి వెనుకకు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతోంది. టీచర్లు మాత్రమే ఎందుకు ఆస్తుల వివరాలు తెలియజేయాలి? రాజకీయ నాయకుల ఆస్తులు మదింపు చేసేలా జీఓ జారీ చేసి, దాని అమలు బాధ్యతను ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించాలి. నిజానికి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనవారు కొద్ది కాలంలోనే సంపన్నులవుతున్నారు. ఎమ్మెల్యేలలో దాదాపు ప్రతి ఒక్కరికి హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో సొంత నివాసాలు ఉన్నాయి. వాటి విలువ కోట్లలో ఉంటుంది. కానీ, వారు లెక్కలలో చూపించేది చాలా తక్కువ. వారి ఇంటిలో పని చేసే కార్మికులకు ఇచ్చే జీతం కంటే, ఉపాధ్యాయుల జీతం తక్కువే. రాజకీయ నాయకులకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక పార్టీ మీటింగ్ పెడితే ఎంత ఖర్చువుతుంది? ఢిల్లీ నేత ఇక్కడికి వస్తే చేసే ఖర్చు చాలా ఎక్కువ, వారికి ఆదాయం ఎక్కడిది?
అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రభుత్వం రైతుల నుంచి భూసేకరణ చేస్తుంది. వారికి నష్టపరిహారం ఇస్తుంది. అది వారికి సరిపొతుందా? నేటి ఖర్చులకు ఆ డబ్బుతో కనీసం స్థలం కూడా కొనలేం. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ, ఎవరూ ఏమీ చేయలేరు. మారాల్సింది ఎవరు? మార్పు ఎక్కడి నుంచి రావాలి? ప్రజల నుంచి రావాలి. డబ్బుతో ఓట్లు కొనలేరని నాయకులకు ప్రజలు చూపించాలి. అప్పుడే మార్పు సాధ్యమవుతుంది. ఎన్నికల సమయంలో నెల రోజులు డబ్బు పంపిణీ చేసి ఐదేళ్ల పాటు మనలను దోచుకుంటారు. కాబట్టి మనమే వారిని మార్చగలం. వారి నుండి డబ్బు తీసుకోకుండా, మనకేమి కావాలో అడుగుదాం. అప్పుడే ఈ వ్యవస్థ మారుతుంది.
క్రాంతి వైభవ్ అర్రా
సీఈఓ, నియాన్ టెక్నాలజీస్
ఇడాహో, యూఎస్ఏ
+919701508741