దేశంలో మార్పును కోరుకుందాం

by Ravi |   ( Updated:2024-02-01 00:30:52.0  )
దేశంలో మార్పును కోరుకుందాం
X

రాహుల్ గాంధీ చేపడుతున్న ‘భారత్ న్యాయ్ యాత్ర’ మణిపూర్ నుండి మొదలు పెట్టిన విషయం తెల్సిందే. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకునే విధంగా అణగారిన ప్రజలతో, మహిళలతో, యువతతో సంభాషించాలనే లక్ష్యంతో పాటు.. తమ ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రజల వద్దకు చేరవేసే విధంగా తన యాత్రను కొనసాగిస్తున్నారు.

మణిపూర్లో ప్రారంభమైన యాత్ర, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, ఛత్తీస్‌ఘడ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రాలలో ప్రయాణించి ముంబైలో ముగుస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థను నీరుగార్చి కార్పొరేట్ వ్యవస్థను తీసుకువచ్చే.. మతతత్వ విధానాల ప్రోద్బలంతో ముస్లింలపై, క్రిస్టియన్లపై మతాల పేరిట విధ్వంసం సృష్టిస్తున్న బీజేపీ సర్కార్‌కు ప్రజాస్వామ్యయుతంగా బుద్ధి చెప్పాలని రాహుల్ వివరిస్తున్నారు. ప్రజలు ప్రజాస్వామ్యంగా జీవించే మాట్లాడే రాజకీయ స్వేచ్ఛా స్వాతంత్రాలను కాపాడుకునేందుకు రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యాత్రకు దేశ ప్రజలందరం అండగా ఉందాం. రాహుల్ గాంధీని మననం చేసుకోని దేశంలో మార్పు అవసరమని గుర్తించుదాం. దేశవ్యాప్తంగా ఏదో ఒకచోట మహిళలపై దాడులు అఘాయిత్యాలు, హత్యలు, అత్యాచారాలు, అల్లర్లు, మతకల్లోలాలు నిత్యం ప్రజాస్వామ్య వ్యవస్థలో కొనసాగుతున్నప్పుడు వాటిని రూపుమాపాలనే లక్ష్యసాధనకు అండగా నిలుద్దాం. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు ద్వారా మార్పును తీసుకురావడానికి కృషి చేద్దాం. 14 రాష్ట్రాలు, 85 జిల్లాల్లో కొనసాగే యాత్రలో రాహుల్ గాంధీ తపన, ఆరాటం, పోరాటమంతా దేశ ప్రజలు స్వేచ్ఛగా, ప్రజాస్వామికంగా జీవించాలన్నదేనని గుర్తించుకోండి.

మాటలకే పరిమితమైన అభివృద్ధి!

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, కాలయాపన చేసి పేదవారిని పేదవారిగానే ఉంచడంలో బీజేపీ ముందంజలోనే ఉందనే వాదన వినిపిస్తోంది. నల్లధనం వెలికి తీసి పేదల అకౌంట్లో సొమ్మును వేస్తానన్న నరేంద్ర మోడీ అటు వైపుగా ఆలోచన చేయకపోవడంతో పేదలకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కిన వారిగా చరిత్రలో నిలిచిపోక తప్పదు. కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలకు మతాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తున్నప్పటికీ.. భారతీయ జనతా పార్టీ మతాలకు కులాలకు చిచ్చుపెట్టే ప్రేరేపణలను కొన్ని రాష్ట్రాలలో కండ్లకు కట్టినట్టుగా కనపడుతుంది. మేకిన్ ఇండియా, సేవ్ భారత్ పేర్లతో చేసింది ఏమీ లేదు, పైగా వినూత్నమైన పద్ధతులతో భారతదేశాన్ని అభివృద్ధి చేస్తానన్న మోడీ వ్యాఖ్యలు మాటలకే పరిమితమయ్యాయే తప్ప మన దేశం ఇతర దేశాలతో పోల్చుకున్నప్పటికీ అభివృద్ధిలో వెనుకబడే ఉంది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో మార్పును కోరుకోకపోతే మరో ఐదు సంవత్సరాలు భారతదేశంలోని యావత్తు ప్రజానీకం దారిద్ర పేదరికంలోకి నెట్టి వేయబడుతుందన్నది విశ్లేషకుల మాట. దేశం బాగుపడాలంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మార్పు కోరుకోవలసిన బాధ్యత ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, ఉద్యోగులు, నిరుద్యోగులు,ముఖ్యంగా యువతి, యువకులు ఆలోచన చేసి రాహుల్ గాంధీ యాత్రకు మద్దతుగా నిలిచి మన వంతు బాధ్యతను నెరవేరుద్దాం. ఆయనకు అండగా నిలిచి మార్పును కోరుకుందాం.

- వేముల గోపీనాథ్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ

96668 ౦౦౦౪౫

Read More..

నేడే మధ్యంతర బడ్జెట్

Advertisement

Next Story

Most Viewed