కెనడాలో ఖలిస్తానీయుల కొత్తనాటకం!

by Ravi |   ( Updated:2024-11-21 01:00:09.0  )
కెనడాలో ఖలిస్తానీయుల కొత్తనాటకం!
X

కెనడాలో దేశ ప్రధాని జస్టిస్ ట్రూడో అండ చూసుకొని "ఏకు మేకై"న అక్కడ ఖలిస్తాన్ సానుభూతిపరులు.. స్థానిక పౌరులనే బెది రించే స్థాయికి తెగబడ్డారు. వారు ఇప్పుడు అక్కడ మరో కొత్త నాటకానికి తెర తీశారు. ఇప్పటివరకు హిందువులను లక్ష్యంగా చేసు కొని దాడులు చేసిన ఈ మూకలు తాజాగా స్థానికులైన కెనడా వాసులనే హెచ్చరించడం ప్రారంభించారు. నిన్నటి దాకా తమ కష్టా లకు భారతదేశమే కారణమంటూ అకారణంగా నిందిస్తూ వచ్చిన వారు.. ఇప్పుడు కెనడాలో స్థానికులుగా ఎన్నో ఏళ్లుగా స్థిరపడి జీవిస్తున్న వారిపైనే విమర్శలు గుప్పిస్తున్నా రు. చివరకు బెదిరింపుల దాకా వచ్చారు.

ఇది మా దేశం అంటూ..

ఇటీవల జరిగిన నగర సంకీర్తనలో పాల్గొన్న కొందరు వ్యక్తులు ఇలాంటి హెచ్చరికలు చేస్తూ రెండు నిమిషాల నిడివిగల వీడియోను కూడా విడుదల చేశారు. "ఇది కెనడా. ఇది మా సొంత దేశం. మీరు మీ సొంత దేశాలకు తిరిగి వెళ్లిపోండి" అంటూ హెచ్చరించడం అందులో కనిపించింది. దీనిపై భారత నిఘా వర్గాలు స్పందిస్తూ కెనడాలో ఇలాంటి సంఘటనలు ఇటీవల కాలంలో సర్వసాధారణం అయ్యాయని అభిప్రాయపడ్డాయి. అక్కడ తగిన నిఘా లేకపోవడంతో వారు అన్ని వ్యవస్థలను అదుపు చేస్తున్నారని తెలిపాయి. భద్రంగా ఉండాలంటే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వచ్చిన వారు, ఇప్పుడు ఏకంగా స్థానికులను కూడా అదే విధంగా హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. ఖలిస్థాన్ సానుభూతిపరులను లక్ష్యంగా చేసుకుని ఇండియా ఏజెంట్లు పనిచేస్తున్నారంటూ సాక్షాత్తు కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో ప్రకటించిన దగ్గర నుండి రెండు దేశాల మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇరు దేశాల దౌత్య వ్యేత్తలను పరస్పరం బహిష్కరించుకునే స్థాయి వరకు పరిస్థితి వెళ్ళింది. ట్రూడో ఆరోపణలను ఖండించిన భారత ప్రభుత్వం ఉగ్రవాదులకు జస్టీస్ ట్రూడోనే స్వయంగా ఖలిస్థాన్ తీవ్రవాదులకు ఆశ్ర యం కల్పిస్తున్నారని ప్రత్యారోపణలు చేసిం ది. ఖలిస్తాన్ తీవ్రవాదులు భారత్‌లో అల్లర్లు సృష్టించడానికి కుట్ర పన్నుతుండడంతో పాటు, కెనడాలోని హిందువుల పైన కూడా దాడులు చేస్తున్నారని తెలిపింది.

హుందాగా ప్రవర్తించకుండా..

కెనడాలో ప్రజాధరణ కోల్పోయిన తన పార్టీ ఎంపీ జగ్మీత్ సింగ్‌ను వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో గెలిపించడానికి జస్టిస్ ట్రూడో స్వయంగా ఖలిస్థాన్ తీవ్రవాదులకు మద్దతు ఇస్తున్నారని భారత నిఘా వర్గాలు అంచనా వస్తున్నాయి. అందుకే ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత్‌పై బాధ్యత లేకుండా ఆరోపణలు చేస్తున్నారని పేర్కొ న్నాయి. అయిన దానికి, కానిదానికీ.. ప్రతిదానికీ ...భారత్‌నే టార్గెట్ చేస్తూ నిందిస్తూ దేశ ప్రధానిగా హుందాగా ప్రవర్తించకుండా, చిన్నపిల్లాడిలా వ్యవహరిస్తున్నారు. ఐఎస్ఐ, ఖలిస్థాన్ వాదుల చేతిలో చిక్కుకొని ఎంత ప్రమాదకరమైన ఆట ఆడుతున్నారో ఆయన గుర్తించడం లేదు. కొందరు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఖలిస్తాన్ సానుభూతిపరుల హత్యలో భారతదేశ హస్తం ఉందంటూ ఆరోపణలు చేశానని ట్రూడో గతంలో ఒకసారి స్వయంగా చెప్పారు. అంటే సరైన దర్యాప్తు చేయకుండానే, బలమైన సాక్షాధారాలు లేకుండానే, ఎంతో కాలంగా స్నేహ సంబంధాల గల దేశంపై తీవ్ర ఆరోపణలు చేయటం తగునా? ఇటీవల కెనడా పార్ల మెంట్ మొత్తం ఖలిస్థాన్ సానుభూతి పరు లతో నిండిపోయింది. వారు ట్రూడో పై కూర్చుని స్వారీ చేస్తున్నారు. ఇలా ఏ రకంగా చూసినా సరే.. కెనడా అనుసరిస్తున్నది ప్రమాదకరమైన విధానమేనని చెప్పక తప్పదు.

డాక్టర్. కోలాహలం రామ్ కిశోర్

98493 28496

Advertisement

Next Story

Most Viewed