- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ పతనానికి కారణం కేసీఆర్…నిజమెంత!?
ఏపీ నేతలకు మాట లెక్కువ, పని తక్కువ అని, ఏపీ నేతల మాటలు కోటలు దాటుతాయని చేతలు తక్కువని, ఏపీకి చెందిన ఇద్దరు నేతల కారణంగా ఆ రాష్ట్రం బోర్లా పడిందని, ఓ నేత తనను తాను దేశంలో ఉత్తమ అడ్మినిస్ట్రేటర్‌గా, హైటెక్ నాయకుడిగా చెప్పుకుంటారని, సుపరిపాలన దినోత్సవ కార్యక్రమంలో తెలంగాణా మంత్రి హరీష్ రావు వెటకారాలు చేశారు. కానీ నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ నాశనం కావడానికి కేసీఆర్ కూడా కారణమని మంత్రి హరీష్ రావు గుర్తించాలి. కేసీఆర్‌కి కూడా మాటలు ఎక్కువ, చేతలు తక్కువ అని అర్ధం అయింది. మీ చేతలు, మీ మాటలు, మీ అబద్ధాలు ఎల్లకాలం నమ్మడానికి సిద్ధంగా లేరని హరీష్ రావు గుర్తించాలి.
ఎన్నో కుట్రలు చేసి..
మీ ఏడుపు ఏమిటో మీరు ఏడవకుండా ఇంకా చంద్రబాబుపై ఏడవడం మీ దిగజారుడుతనానికి, చేతకాని తనానికి నిదర్శనం కాదా? తెలంగాణలో కేసీఆర్ కుటుంబం బాగుపడింది తప్పా, ఇతర ఏ కుటుంబాలైనా బాగుపడ్డాయా? ఆంధ్రప్రదేశ్ సంగతి మీకేందుకు? అది అక్కడి సమస్య అక్కడి ప్రతిపక్షం చూసుకొంటుంది కదా, అక్కడ మీ అవసరం ఏంటి? తెలంగాణాలో మీ ఏడుపు ఏమిటో మీరు ఏడవకుండా ఆంధ్రప్రదేశ్ ఎంత పాడుపడితే తెలంగాణా అంత బాగుపడుతుందని, అందుకే ఆంధ్రప్రదేశ్‌లో జగన్ రెడ్డి దీర్ఘకాలం అధికారంలో వుండాలని కేసీఆర్, ఆయన కుటుంబం కోరుకుంటున్నది. నిజానికి 2019 ఎన్నికల్లో మళ్ళీ తెలుగుదేశం గెలిచి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే తెలంగాణా అభివృద్ధిలో వెనకబడిపోతుందన్న దుర్బుద్దితో చంద్రబాబుపై ముప్పేట దాడి చేసి జగన్‌కి ఎదురు డబ్బులు ఇచ్చి చంద్రబాబును ఓడించడానికి కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డారు. గెలిచాకా, అతికొద్ది సమయంలో అంతర్జాతీయ స్థాయిలో అమరావతికి వచ్చిన బ్రాండ్ ఇమేజ్‌ను, అంతర్జాతీయ వేదికలపై అమరావతిపై జరుగుతున్న చర్చను, అక్కడికి వస్తున్న పెట్టుబడులు చూసి ఓర్చుకోలేకపొయిన కేసీఆర్ కుట్రలకు తెరతీశారు. తెరవెనుక మంత్రాంగం నడిపి అమరావతిని పురిటిలోనే చంపేయాలని కంకణం కట్టుకొని జగన్‌కి మూడు రాజధానుల సలహా ఇచ్చి అమరావతి రెక్కలు విరిసి ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని కూడా లేకుండా చేసిందే కేసీఆర్ అని చెప్పాలి. ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ ఆగమయిందని అసెంబ్లీ సాక్షిగా ఆనందపడటం ప్రజలు చూసారుగా.
కులాల మధ్య చీలికలు తెచ్చి..
కుళ్ళు రాజకీయంతో ఆంధ్రప్రదేశ్‌పై భస్మాసుర హస్తం పెట్టారు కేసీఆర్. అద్భుత రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబుకి పేరు వస్తుందన్న దుష్టబుద్దితో ఈ వికృత రాజకీయానికి పూనుకొన్నారు. అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెరిగే కొద్దీ, హైదారాబాద్‌లో ఉన్న సీమాంధ్రులు తమ బిజినెస్‌లను అమరావతికి తరలిస్తారని, సొంత రాష్ట్రమన్న ఫీలింగ్‌తో హైదరాబాద్‌లో బిజినెస్ చేస్తూనే, అమరావతి విస్తరణకు సహాయపడ తారని, అమరావతిలో పెట్టుబడులు పెడితే భవిష్యత్‌లో వ్యాపారాలు మరింత విస్తరించుకునే అవకాశం ఉందని గ్రహించిన కేసీఆర్ ఈ విష ప్రయోగం చేశారు. జాతీయ మీడియా కూడా విభజన జరిగినప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అనాధగా ఉన్నదని, కానీ అమరావతి ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతుందని వెల్లడించింది, దీంతో కేసీఆర్‌లో ద్వేషం, ఈర్ష్యా, అక్కసు ఉగ్రరూపం దాల్చాయి. అందుకు తగిన విధంగా అమరావతి అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కేసీఆర్ పావులు కదిపి ప్రణాళిక సిద్ధం చేశారు. 2019 ఎన్నికల సమయంలో తెలంగాణ కొన్ని సామాజిక వర్గాల నాయకులను ఏపీకి పంపించి కులాల మధ్య చీలికలు తెచ్చి జగన్‌కి అనుకూలంగా ప్రచారం చేయించడంతో పాటు కొన్ని కోట్ల రూపాయల ధనసహాయం జగన్‌కి చేసి జగన్ అధికారంలోకి రావడానికి ఎంత చెయ్యాలో అంత చేసి నేడు ఆంధ్రప్రదేశ్‌ను బలి పీఠంపైకి నెట్టిన ఘనుడు కేసీఆర్. ఈ రోజు ఆయన అల్లుడు ఆ రాష్ట్రం బోర్లాపడ్డదని, దానికి చంద్రబాబుని నిందించడం హరీష్ రావు దిక్కుమాలిన రాజకీయాలకు నిదర్శనం. అమరావతి వెలుగొందుతుందని ఆశపడిన అయిదు కోట్ల ఆంధ్రుల జీవితాలు అంధకారం అయ్యాయి. జగన్, కేసీఆర్ చేసిన దారుణ దగాకి, సంకుచిత రాజకీయానికి రెక్కలు తెగేసిన జటావులా అమరావతి నిట్టనిలువునా కుప్పకూలింది. అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన అన్నదాతలు ఆర్తనాదాలు చేస్తూ దిక్కులు పిక్కటిల్లేలా 1300 రోజులుగా ఘోషిస్తున్నారు. ప్రజలు గుడ్డిగా నమ్మి ఓట్లేసి గెలిపించిన పార్టీనే ఈ పాపానికి ఒడిగట్టింది.
వారికి అనుకూలంగా జగన్ నిర్ణయాలు..
కేవలం అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తే చంద్రబాబుకి పేరు వస్తుందన్న అక్కసు, దుర్భుద్దితో ఆంధ్రప్రదేశ్‌ను బ్రష్టు పట్టించాలని అమరావతిపై కక్షగట్టి పగపట్టి, పడగొట్టారు, నవ్యాంధ్రా కోలుకుంటే కష్టమని అనేక కుట్రలకు తెరలేపి, నవ్యాంధ్ర తమని మించిపోతుందేమో అనే దుర్భుద్ది, కుట్రతో, ముప్పేట దాడితో అమరావతిని కుప్పకుల్చారు. అతి కొద్ది సమయంలో అక్కడికి వస్తోన్న పెట్టుబడులు చూసి ఓర్చుకోలేక, తట్టుకోలేక, 2019 ఎన్నికల్లో ఒక సామాజిక వర్గంపై విషం చిమ్ముతు అన్నీ కులాలాను రెచ్చగొట్టి ఆశపెట్టి ప్రలోభపెట్టి జగన్‌కు అనుకూలంగా మారేలా చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించి కేసీఆర్ అమరావతిని నాశనం చేశారు. నిజానికి తెలుగుదేశం ప్రభుత్వం హాయాంలో ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ ఒక వెలుగు వెలిగింది. పెద్ద ఎత్తున హైదరాబాద్ నుండి రియల్టర్లు అమరావతికి బారులు తీరారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది. ప్రపంచం అంతా అమరావతి వైపు చూసింది. ఎప్పుడైతే మూడు రాజధానుల ప్రకటన వచ్చినదో అప్పుడే అభివృద్ధి బాట పట్టిన ఆంధ్రప్రదేశ్ తిరోగమన బాట పట్టింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కంపెనీలు, పెట్టుబడులు అన్ని ఆంధ్రప్రదేశ్‌కి తరలించుకుపోయారని, ఇప్పుడు ఆ బాధలేదని రియల్ ఎస్టేట్ రంగం బాగా కోలుకొన్నదని తెలంగాణా మంత్రి కేటీఆర్ కూడా అనడం, పక్క రాష్ట్రంలో రాజధాని పనులు ఆపేయడం, ఇసుక ఆపేయడం మూలంగా మన రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగానికి కలిసొచ్చిన అదృష్టం అని బిల్డర్ అసోసియేషన్ మీటింగ్‌లో హరీష్ రావే అనడమే వారు ఏపీ అభివృద్ధిపై ఎంత భయం ఏర్పడిందోనడానికి సాక్షాలు! దీనికి మన సీఏం జగన్, ఆంధ్రప్రదేశ్‌లో బిల్డింగ్‌ల నిర్మాణం ఆపేసి హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగమే కాకుండా భూముల ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగే విధంగా తన రాజకీయ, ఆర్థిక అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ నాశనం చేసి పొరుగు రాష్ట్రం తెలంగాణా అభివృద్ధి చెందే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు జగన్ రెడ్డి. ఒకప్పుడు అమరావతి ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ పురోగమించిందని కోడై కూసిన జాతీయ మీడియా నేడు మూడు రాజధానుల నిర్ణయం వల్ల ఏపీ పరిస్థితి దిగజారిపోయిందని చెబుతున్నది. ఇప్పుడు నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ గురించి కేసీఆర్, ఆయన కుటుంబం హేళనగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ సంకుచిత రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌కి మరణ శాసనం రాశాయి.
అధికారం ఉందని మిడిసి పడుతూ..
ఏ రాష్ట్ర ఆర్థికైనా, వృద్ధికి రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలు అత్యంత కీలకమైనవి. కానీ జగన్ సీఎం అయ్యాక ఆంధ్ర సమాజం మీద కక్ష గట్టినట్లు ఈ రెండు రంగాలను చావుదెబ్బ తీశారు. అక్కడ నుంచి అన్ని వర్గాల వారు, అన్ని రంగాలు అట్టడుగుకు నెట్టబడి అమరావతిని నాశనం చేశారు. విభజన అనంతరం దిక్కు దివాణం లేకుండా అనాధగా పడివున్న ఆంధ్రప్రదేశ్‌ని అయిదేళ్ళ తర్వాత అభివృద్ధి పధంలో పయనిస్తుందన్న నమ్మకం అందరిలో కలగ చేసారు గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా అందరూ చెప్పుకొన్నారు. కానీ నేడు కేసీఆర్ తన తుచ్చ రాజకీయంతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ మళ్ళీ ప్రశ్నార్ధకం చేశారు. కేసీఆర్ ఆడిన అంతర్నాటకం, జగన్ ఆడిన జగన్నాటకం ఆంధ్రప్రదేశ్‌ని అగాధంలోకి నెట్టాయి. ఆంధ్రప్రదేశ్‌ను నాశనం చేసి తెలంగాణా అభివృద్ధికి బాటలు వేసుకొన్నారు. ఏదైనా అభివృద్ధిలో పోటీ పడాలి, కానీ ఈ విధంగా కుట్రలతో సమర్ధులను, అభివృద్ధి కారకులను ఓడించి అసమర్ధులు ఎదురు డబ్బులు ఇచ్చి గెలిపించి తెలంగాణా అభివృద్ధి చెందుతుందని డబ్బాలు కొట్టుకోవడం సిగ్గుచేటు. వారు తెలంగాణలో హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాలు గ్రామీణ జీవనం జీవచ్ఛంలా మారిన విషయం గుర్తించాలి. మాటలతో ఇంకా మభ్యపెట్టాలని చూడవద్దు. ఇప్పటికైనా హరీష్ రావు మీ రాష్ట్రం గురించి మీరు ఆలోచించండి, చంద్రబాబుపై ఏడవడం మానండి. హైదరాబాద్‌ను చంద్రబాబు అభివృద్ధి చేస్తే, మామా అల్లుడు కులుకుతూ దానిని మీ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటు. అధికారం ఉందని మిడిసి పడవద్దు. అధికారం ఎప్పుడు ఎవరికీ శాశ్వతం కాదు.
నీరుకొండ ప్రసాద్
98496 25610