- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కథా సంవేదన: నేను పువ్వుని
నేను పువ్వుని, నేను పుష్పాన్ని, నేను ద్వంద్వాన్ని. నేను పుష్పాన్ని, మృదువుగా సుకుమారంగా వుంటాను. భూమి నా ద్వారా నవ్వుతుంది.
సూర్యునిలా వెలుగుతుంది. నేను చిన్నపిల్లల మాదిరిగా సున్నితంగా ఉంటాను. నన్ను ఇష్టపడని వాళ్లు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. దేవుడికి కూడా నేను ఇష్టమే. ఆయనకి ఇష్టమో కాదో నాకు తెలియదు గానీ నన్ను మాలగా చేసి అలంకరిస్తారు. ప్రేయసికే కాదు భార్యకి నన్ను కానుకగా ఇచ్చినప్పుడు వాళ్ళు ఆనందిస్తారు.
నన్ను కొమ్మ మీద చూసి ఆనంద పడే వాళ్లు కొంతమందైతే తుంచి ఆనంద పడేవాళ్లు మరెంతో మంది. నేను చెట్టు మీద వున్నా కింద పడిపోయినా మీ అందరికీ సుందర దృశ్యాన్నవుతాను. నా మీద పక్షులు వాలతాయి. నా అందాన్ని చూసి అవి మురిసి పోతాయి. తుమ్మెదలు సీతాకోక చిలుకలు నా లోని మకరందాలని గ్రోలతాయి. అప్పుడు నేను పరవశించి పోతాను.
ఓ యువతి నన్ను తెంపుకొని జడలో తురుముకుంటే నాకు గొప్ప ముచ్చట వేస్తుంది. ఓ ప్రియుడు తన ప్రియురాలికి బహుకరించినప్పుడు మరీ మరీ ఆనందపడతాను. నన్ను మాలగా చేసి ఆ దేవదేవుని మెడలో వేసినప్పుడు నా జన్మ సార్థకమైందని భావిస్తాను.
ఎవరినైనా అభినందించాల్సి వచ్చినప్పుడు చాలా మంది పుష్పాలనే ఎంచుకుంటారు. అదే విధంగా చనిపోయిన వ్యక్తులని సందర్శించినప్పుడు కూడా పూలని ఎక్కువగా వాడతారు. సంతోషానికి, విషాదానికి రెండింటిలో నేను ప్రధాన పాత్ర పోషిస్తాను. అదే విధంగా అనారోగ్యంగా ఉన్న వాళ్లని చూసినప్పుడు కూడా అప్పుడప్పుడు పువ్వులనే ఉపయోగిస్తారు.
నేను పువ్వుని, నేను పుష్పాన్ని, నేను ద్వంద్వాన్ని
నేను రకరకాల రంగుల్లో వుంటాను. సువాసనలని వెదజల్లుతాను. కంటికి ఇంపు కలిగిస్తాను. ఒక ప్రేమపూర్వకమైన అనుభూతిని కలిగిస్తాను. ఉత్సాహాన్ని నింపుతాను. స్ఫూర్తిని వెదజల్లుతాను. మనుషుల మూడ్‌ని మార్చేస్తాను. ఆనందాన్ని కలిగిస్తాను. నన్ను మీకు ఎవరో ఇవ్వాల్సిన పనిలేదు. మీకు మీరే కూడా ఇచ్చుకోవాలి.
నేను త్వరగా వాడిపోతాను. కృత్రిమ పుష్పాలు వాడవు. నిజమే! నేను ఇచ్చే అనుభూతిని,ఆనందాన్ని అవి ఇవ్వవు. నేను ఎక్కడ వున్నా అక్కడ శోభని కలుగ చేస్తాను. నేను ఆనందాన్ని ఇస్తాను. మనుషులని ఆనందంగా ఉంచడమే కాదు, మెడిసన్‌గా కూడా నేను పని చేస్తాను.
నేను పువ్వుని, నేను పుష్పాన్ని, నేను దంద్వాన్ని
నన్ను ఉదయం మూలకి విసిరి వేసినప్పుడు కూడా నాకు ఆనందమే! బాధ లేదు.. కానీ నన్ను ఎత్తలేని విధంగా గజమాలగా మార్చినప్పుడు
నేను విలవిలలాడుతాను. ఏ నాయకుని మెడలోనో ఇంకెవరి మెడలోనో వేసే ప్రయత్నం చేసినప్పుడు వేసినప్పుడు నేను దుఃఖిస్తాను. అదేం సంబురమో నాకర్థం కాదు. వాళ్ల మెడలో వేయలేరు వేసినట్టు నలుగురు పట్టుకుంటారు. శవాన్ని నలుగురు మోసినట్లు
అప్పుడు నా నుంచి సువాసన రాదు నాకే దుర్వాసన వస్తుంది.
నేను పువ్వుని
నేను పుష్పాన్ని
నేను ద్వంద్వాన్ని.
మంగారి రాజేందర్ జింబో
94404 83001