- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కథా సంవేదన: పిచ్చుకలు
మా ఇల్లు విశాలంగా ఉండేది. పెద్దింటికి వంటింటికి మధ్య ఎండాకాలం పడుకోవడానికి విశాలమైన స్థలం వుండేది. ఇంటి ముందు కచేరీ ఉండేది. పెద్దింటికి వంటింటికి మధ్య వున్న స్థలం కూడా కచేరీ మాదిరిగా ఓపెన్‌గా ఉండేది. గ్రిల్ వుండేది కాదు. అందుకని పిచ్చుకలు హాయిగా ఇంట్లోకి వచ్చేవి. మా హాల్లో వున్న రెండు స్తంభాలకి రెండు పెద్ద అద్దాలు వుండేవి. వాటిని పిచ్చుకలు బాగా ఉపయోగించుకునేవి. ఆ అద్దాల్లో తమ ప్రతిబింబాలని చూస్తూ వేరే ఎవరో అక్కడ వున్నారనుకొని తమ ముక్కులతో పొడుస్తూ కాలక్షేపం చేసేవి. మేం ఎవరన్నా అటువైపు రాగానే అక్కడి నుంచి పరుగెత్తుకెళ్లేవి. వాటి అజ్ఞానం చూసి మేం నవ్వుకునేవాళ్లం. అద్దంలో తమ ప్రతిబింబాలని చూసి అవి ముక్కులతో కొట్టుకోవడం చూసినప్పుడు అవి అజ్ఞానులుగా అనిపించేది. కానీ కాదని మరికొన్ని సంఘటనలని చూసినప్పుడు అనిపించేది.
అలాంటి సంఘటనల్లో ఇది ఒకటి.
మా ఇంట్లో గోడలకి ఫొటోఫ్రేమ్‌లు ఎక్కువగా వుండేవి. అలా వేలాడదీసిన ఫొటో ఫ్రేముల వెనక పిచ్చుకలు గూళ్లు పెట్టుకునేవి. గుడ్లని కూడా పెట్టేవి. వాటి నుంచి అప్పుడప్పుడు వాటి గుడ్లు క్రిందపడి పగిలిపోయేవి. ఒక్కోసారి పక్షి పిల్లలు కూడా కింద పడేవి. తల్లి పిచ్చుక వాటి చుట్టూ తిరిగి వాటిని తిరిగి పైకి తీసుకొని వెళ్లేవి. కొంత పెద్దగా అయిన పక్షులు కూడా కిందపడేవి. అవి పైకి ఎగరడానికి ప్రయత్నం చేసేవి. ఎవరైనా కొంత సహాయం చేస్తే పైకి ఎగిరిపోయేవి. ఒకసారి ఓ చిన్న పిచ్చుక అలాగే కింద పడింది. ఓ రెండు రెక్కల ఈకలు కూడా కింద పడిపోయాయి. అది ఎగరడానికి విఫల ప్రయత్నం చేస్తూ కన్పించింది. దాని రెక్కకు గాయమైంది. చాలా కష్టంగా అది ఎగరడానికి ప్రయత్నం చేస్తూ కన్పించింది. దాన్ని చూస్తే జాలేసింది. దాన్ని నా చేతిలోకి తీసుకొని పైకి ఎగరడానికి తోడ్పడినాను.
అది సరిగ్గా ఎగరలేకపోయింది. ఎగరడంలో కూడా కొంత కుంటినట్టు అన్పించింది. కానీ అది ఆకాశంలోకి ఎగిరింది. ఆశ్చర్యం, ఆనందం. నాలో కలిగాయి. ఆ పిచ్చుక మీద నేను చూపించిన సానుభూతి స్థానంలో ఉత్సాహం వచ్చింది. ఆ చిన్న పిచ్చుక దాని గాయాన్ని నెపంగా తీసుకొని నేల మీదనే ఉండటానికి ప్రయత్నం చేయలేదు. మనకు మాదిరిగా వాటికి సాంఘిక మాధ్యమాలు లేవు. వున్నా అవి మన మాదిరిగా సాంఘిక మాధ్యమాల్లో ఘోషించి సానుభూతిని ఆశించవేమో. మన చుట్టూ వున్న మనుషులని చూసినప్పుడల్లా ఈ రెండు సంఘటనలు ఈ మధ్య తరుచూ గుర్తుకొస్తున్నాయి.
ఆ పిచ్చుకలకన్నా మనం ఏమైనా విభిన్నంగా వున్నామా? మనకీ ఆ పిట్టలకీ ఏమైనా భేదం వుందా? బాగా తెలివిగల వాళ్లమని అనుకునే మనం ఆ పిచ్చుకల మాదిరిగా ప్రవర్తిస్తున్నామా? లేదే..? మనల్ని మనం హింసించుకోవడం లేదా? మన ప్రయత్నాలని మనం నిలుపుదల చేయడం లేదా? మన పట్ల మనం ప్రేమపూర్వకంగా ఉంటున్నామా? లేదే! మన ప్రతిబింబాన్ని అద్దంలో చూసినప్పుడు మన పట్ల మనం ప్రేమపూర్వకంగా వుంటున్నామా..? మనల్ని మనం ఉత్తేజపరచుకుంటున్నామా..? మనకి అవసరమైన మార్పులని తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నామా..? అలా చేయనప్పుడు ఆ పిచ్చుకల మాదిరిగానే మనం మారిపోతాం. ఆ పిచ్చుకలాగే మనలో కొన్ని కష్టాలు ఉన్నాయి. మనం ఎగరకుండా అంటే ముందుకు వెళ్లకుండా ఉండటానికి లక్ష కారణాలు ఉండవచ్చు. అవి పెద్ద కారణాలు కూడా కాకపోవచ్చు.
మనలో బాధ ఉండవచ్చు. ఎంతో కొంత వేదన ఉండవచ్చు. మన లోపాలు మనకి ఆటంకాలుగా కన్పించవచ్చు. అవి సహేతుకంగా కూడా అన్పించవచ్చు. ఏమైనా నిర్ణయం మనమీదే ఉంది.
ఆ పిచ్చుక లాగా ఎగురుదామా? నేల మీద ఉంటూ బాధపడుతూ కూర్చుందామా?
మంగారి రాజేందర్ జింబో
94404 83001