- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రుణమాఫీతో పేద రైతులకు న్యాయం...
రాహుల్ గాంధీ సమక్షంలో రైతు రుణమాఫీని ప్రకటించిన కాంగ్రెస్... తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. మొత్తంమీద రుణమాఫీని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారు. పేద రైతులు ఆనందంతో ఉన్నారు. వారికి న్యాయం జరిగినట్లు అయ్యింది. రైతు రుణమాఫీఫై పెద్దఎత్తున చర్చజరిగింది. ఒక దశలో ప్రభుత్వం రుణమాఫీ చెయ్యలేదని కూడ సోషల్ మీడియాలో, మీడియాలో ప్రతి పక్షాలు చర్చకు తెరలేపాయి. రైతుల సంఖ్య బాగా తగ్గించారనే విమర్శలు ఉన్నప్పటికీ చిన్న సన్నకారు రైతులను విస్మరించకుండా న్యాయం చేశారని స్పష్టమైంది. రుణమాఫీని ప్రారంభించి ఆ చర్చకు ముఖ్యమంత్రి ముగింపు పలికారు. ఓట్లు వేసిన రైతులకు ఊరట కలిగిoచారు. రూ. 31 వేల కోట్ల రుణమాఫి చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ముఖ్యమంత్రి. భవిష్యత్తులో కూడా రైతు అనుకూల విధాన నిర్ణయాలతో ముందుకు పోవాలని కోరుకుందాం
అంతకు ముందు రేషన్ కార్డు పట్టాదారు పాసుబుక్ నిబంధన పెడ్తున్నట్లు చర్చ జరిగింది... కానీ అవి ఏవీ లేకుండానే కేవలం పేదరికం ఆధారoగానే రుణమాఫి జరగడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోoది. రుణాలు చెల్లించి రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ లేదని మీడియాలో రావడంతో రైతులు కొంత నిరుత్సాహపడ్డది వాస్తవం... కానీ అధికారులతో హై లెవల్ మీటింగ్ పెట్టి జీవోలో పట్టాదారు పాసు్బుక్ ఆధారంగానే రుణమాఫీ జరుగుతుందని... కుటుంబాన్ని గుర్తించటం కోసం మాత్రమే రేషన్ కార్డు ఉంటుందని... రుణాలు చెల్లించి తిరిగి తీసుకున్న వారికి కుడా మాఫీ ఉంటుందని జీవోలో స్పష్టత ఇవ్వటంతో రైతుల అనoదాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించినట్లు అయ్యింది...
పేదరికమే ప్రాతిపదికగా రుణమాఫీ
ఈ విషయమై ముఖ్యమంత్రి మీడియా చిట్ చాట్‌లో ఈ జీవోలో ఉన్న విషయాలను వివరించటంతో ప్రజలకు పూర్తి క్లారిటీ ఇచ్చినట్లు అయ్యింది... గతంలో చెట్లకు పుట్టలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు రుణమాఫీ చేయడం సమంజసం కాదని ప్రజలు చెప్పుకున్నారు... ఇన్‌కమ్ టాక్స్ కట్టే వాళ్లనుoచి కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. మూడు లక్షలు ఇన్‌కమ్ టాక్స్ జీరో టాక్స్ కిందకు వస్తుందని... కొంతమంది రైతులు పిల్లల చదువు లోన్స్ కోసం టాక్స్ కడతారని వారిని మినహాయించాలని అభ్యంతరాలు వచ్చాయి.... ఏది ఏమైనా పేదరికాన్ని నిబంధనగా తీసుకుని రుణమాఫీ చెయ్యటం పట్ల రైతులు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. దేశంలో పిన్నీసు తయారుదారుడు కూడా తాను ఉత్పత్తి చేసిన పిన్నీసు ధర తానే నిర్ణయ్యించుకొని మార్కెట్ శక్తిగా మారుతున్నాడు...
రైతును ఎదిగించే విధానం
కానీ రైతు మార్కెటింగ్‌లో ఆశక్తుడుగా మారుతున్నాడు. దేశానికి వెన్నుముక రైతు అంటారు. పల్లెటూళ్ళే పట్టుగోమ్మలు కావాలంటే, పరిపూర్ణంగా రైతులు ఎదిగే, రైతు సంక్షేమం కోసం ప్రభుత్వ విధాన నిర్ణయాలు ఉండాలి. అందుకోసం విత్తనాలు, ఎరువులు సబ్సిడీ ఇవ్వాలి. నూతన పోకడలు అలవర్చుకోవడం కోసం. వ్యవసాయ యాంత్రికీకరణ కోసం సేంద్రియ సాగుకోసం ప్రభుత్వాలు రాయితీని ఇచ్చి ప్రోత్సహించాలి. నేడు కూలిరేట్లు పెరగడంతో గిట్టుబాటు ధర రాక రైతు సతమతమౌతూ, నిత్యం కష్ట నష్టాలకు గురి అవుతూ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నాడు. గ్రామీణ రైతు భారతం రుణగ్రస్థమై కునారిల్లుతోంది. దాన్నుంచి రైతులు బయటపడాలనీ, రైతు ప్రోత్సాహక విధానాలు ఉండే ప్రభుత్వాలు రావాలనీ కోరుకుందాం.
రూ.31 వేల కోట్ల రుణమాఫీ ప్రారంభం
గత వారం 'రుణమాఫితో రైతులంతా సాఫీ' పేరిట ఎవరూ రాయని విషయాన్ని నేను దిశ ఎడిట్ పేజీకి రాసిన విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది.. అనేక సందర్బాలలో ముఖ్యమంత్రి రేవంతరెడ్డి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ అంశాన్ని ప్రస్తావించారు. నా సూచనలను స్వీకరించి ప్రభుత్వ నేతలు అమలు చేసినందుకు చాలా సంతోషం.. ఏది ఏమైనా 31 వేల కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ ప్రక్రియను మొదలుపెట్టి, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భవిష్యత్తులో కూడా రైతు అనుకూల విధాన నిర్ణయాలతో ముందుకు పోవాలని కోరుకుందాం.
సాదం వెంకట్
93953 15326