- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమరుల తెలంగాణనా.. కల్వకుంట్ల తెలంగాణనా?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అసలు ఈరోజు సాధించుకున్న తెలంగాణ అమరవీరులు కలలు కన్న తెలంగాణా? లేక కల్వకుంట్ల కుటుంబం కోసం ఏర్పాటు చేసుకున్న తెలంగాణ సంస్థానమా? అనే విషయం అర్థం కాక తెలంగాణలోని ప్రజలు, ఉద్యమకారులు, అమరవీరుల తల్లిదండ్రులు ఒక సందిగ్ధ పరిస్థితిలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమం దేనికోసం అయితే సాగిందో ఈరోజు ఆశయాలన్నీ కల్వకుంట్ల కుటుంబం కాళ్ళ కింద నలిగిపోతున్నాయి. 1386 మంది తెలంగాణ కోసం బలిదానాలు చేసుకుంది, ఇటువంటి నిరంకుశ తెలంగాణ రాష్ట్రం కోసమేనా? తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలైనా సుఖ సంతోషాలతో ఉన్నారా? ఎందుకు స్వరాష్ట్రంలో అమరవీరులపై ఇంత కఠినత్వం?
ప్రపంచంలో జరిగిన ఏ ఉద్యమంలో కూడా ఆత్మహత్యలు లేవు కదా! అయినా కేసీఆర్ మాటలు విని ఇన్ని వేలమంది ఆత్మహత్యలు చేసుకుని సాధించుకున్న తెలంగాణలో వారికిస్తున్న గౌరవం ఏమిటి? ఒక జవాన్ చనిపోతే కుటుంబానికి కోటి రూపాయలు ఇచ్చి ఆయన అర్ధాంగికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చిన కేసీఆర్‌కి, తెలంగాణ అమరవీరుల త్యాగాలు కనిపించడం లేదా? పెట్రోల్ పోసుకొని రైలుకి ఎదురు వెళ్లి, ట్యాంకులపై నుండి దూకి విషం తాగి, ఉరికొయ్యలకు వేలాడిన మా పిల్లల త్యాగాలు మీకు కనిపించడం లేదా? వీరే కాక ఆత్మహత్య ప్రయత్నం చేసి బ్రతికి నరకయాతన పడుతున్న మా తెలంగాణ ఉద్యమకారులు కనిపించడం లేదా? ఎందుకు మా కుటుంబాలపై, మా ఉద్యమకారులపై ఇంత కక్ష సాధింపు? రాష్ట్ర ఏర్పాటు కోసం నా బిడ్డలు వెయ్యికి మందికి పైగా చనిపోయారని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించి ఇప్పుడు అమరవీరుల కుటుంబాలను గుర్తించకపోవడం న్యాయమా?
మీరు చేసిన న్యాయం ఏంటి?
కేసీఆర్ సార్, మీరు 200 కోట్లు పెట్టి తెలంగాణ అమరవీరుల స్థూపం నిర్మించినా, మా అమరవీరుల కుటుంబాలను మీరు గుర్తించనప్పటికీ, నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పటికీ మా పిల్లల త్యాగాలు గుర్తే ఉంటాయి. ఈరోజు అమరవీరుల కుటుంబాలను ఆదుకోకుండానే అమరవీరుల స్థూపం నిర్మించిన మీకు తెలంగాణ అమరవీరులను గుర్తించే చిత్తశుద్ధి లేకపాయె! అందుకే ఆ స్థూపాన్ని మీ నిరాహార దీక్షకు, మీ పోరాటానికి గుర్తుగా ఉంచుకోండి! అస్సాం రాష్ట్రంలో ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ అయిన వారికి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నెలకు 15 వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తోంది. మరి మీ మాటలు నమ్మి ఉద్యమాలు చేసి బంగారు భవిష్యత్ కోల్పోయిన ఉద్యమకారులకు మీరు చేసిన న్యాయం ఏమిటి?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మూలం నీళ్లు, నిధులు, నియామకాలు... కానీ ఈరోజు మీరు ప్రధాని కావడానికి పక్క రాష్ట్రాలకు నీళ్లను తాకట్టు పెట్టారు, ఇక నిధులు మేఘా లాంటి ఆంధ్ర సంస్థలకు మళ్లి పోయాయి, తొమ్మిది సంవత్సరాల మీ పాలన తర్వాత కూడా నేటికీ పోరాటాలు చేసిన ఉద్యమకారులకు, తెలంగాణ విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. కల్వకుంట్ల కుటుంబంలో మాత్రం నాలుగు ఉద్యోగాలు వచ్చాయి! అందుకే కనీసం ఈ స్థూపం ప్రారంభోత్సవ సమయంలోనైనా అమరవీరుల 1386 త్యాగాలు గుర్తించి వారికి గ్రూప్ -2 ఉద్యోగం, హైదరాబాద్ లో వేయి చదరపు గజాల ఇంటి స్థలం ఇచ్చి, ప్రతి నెల 50 వేల రూపాయలు గౌరవ భృతి ఇవ్వాలి. ఇదే సందర్భంలో తెలంగాణ ఉద్యమకారులకు ప్రతినెల 50 వేల రూపాయల గౌరవ వృత్తి అందించి, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టవలసిన బాధ్యత ఈ పాలకులపై ఉంది. స్వరాష్ట్రంలో వారికి న్యాయం దక్కక ఏ ఒక్క అమరవీరుల తల్లిదండ్రులు కానీ, తెలంగాణ ఉద్యమకారులు కానీ ఆకలిచావులకు ఆత్మహత్యలకు పాల్పడితే ఆ పాపం కల్వకుంట్ల కుటుంబానికి తప్పక తగులుతుంది!
ఎం. రఘుమారెడ్డి
తెలంగాణ అమరవీరుల & ఉద్యమకారుల ఐక్యవేదిక
83282 12979
Also Read: తొమ్మిదేండ్ల ప్రగతి తెలంగాణ!