- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దర్శక రత్న దాసరి స్ఫూర్తితో..
మానవ సమాజ పరిణామ క్రమాన్ని, సాంస్కృతిక వైభవాన్ని, మానవీయ సంవేదనలను వెండితెర మీద వెలిగించే వాడు దర్శకుడు. చిత్రసీమకున్న రెండుకళ్ళుగా చెప్పుకునే వారిలో మొదటివాడు నిర్మాత. అయితే, నిర్మాత ఇచ్చిన పెట్టుబడిని మానవీయ కళ్యాణానికి కళను కళాత్మకంగా తెరమీద ప్రతిబింబిస్తాడు. భారతీయ చలనచిత్ర సీమకు కథా కథనంతో పాటు నటీనటుల ఎంపిక, సన్నివేశాలకనుగుణంగా వారిని నటింపజేసి ఎన్నుకున్న లక్ష్యానికి చేరువ చేయడంలో దర్శకునిదే పెద్దపాత్ర. ఒక్కోసారి కళను పండించడానికి తానే అన్ని పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి మార్గనిర్దేశం చేస్తాడు. ఒక సినిమా విజయ తీరాలకు చేరాలంటే తండ్రిలా అన్ని సహించి సఫలీకృతం చేసేవాడు దర్శకుడు. దాదాసాహెబ్ ఫాల్కే, రఘుపతి వెంకయ్య నుండి నేటి వరకు ఎందరో దర్శకులు తమ ప్రతిభను చిత్రసీమలో నిరూపించున్నారు. అందులో తెలుగువారి జీవితాలను, వారి సంఘర్షణలను ఒడిసిపట్టి సమాజానికి చక్కటి సందేశాన్ని, మార్గాన్ని అందించిన దర్శకుడు దాసరి నారాయణ రావు.
తన పేరిట 18000 అభిమాన సంఘాలు
విఠలాచార్య, కె.వి.రెడ్డి, హెచ్.ఎం.రెడ్డి, సి. పుల్లయ్య, ఎల్.వి.ప్రసాద్, బి. నాగిరెడ్డి, తాతినేని ప్రకాశరావు, కె. విశ్వనాథ్, సింగీతం శ్రీనివాస్, బాపు, బాలచందర్, కె. రాఘవేంద్రరావు, విజయనిర్మల, టి.క్రిష్ణ, నేటి రాజమౌళిలు ఒక ఎత్తైతే దర్శకరత్న దాసరి నారాయణరావు ఒక ఎత్తు అని చెప్పుకోవాలి. తెలుగు సినిమా ప్రపంచంలో అత్యధిక సినిమాలు చేసిన దర్శకుడిగా చరిత్ర సృష్టించాడు. దర్శకత్వమే కాదు అద్భుతంగా నటించి ఒక నటుడిగా కూడా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఈయన పేరిట 18000 వేల అభిమాన సంఘాలు ఉండడమే ఆయన ప్రతిభకు నిదర్శనం. కొన్ని వందల సినిమాలకు దర్శకత్వం వహించి అన్నింటా అందెవేసిన చెయ్యిగా తనను తాను నిలబెట్టుకున్నాడు. సబ్జెక్టు ఏదైనా తనదైన పనితనం చూపించి తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. అందుకే ఆయన జయంతి మే నాలుగవ తేదిన దర్శకుల దినోత్సవంగా జరపడానికి తెలుగు ఫిలిం అసోసియేషన్ నిర్ణయించడం జాతికి ఎంతో గర్వకారణం.
యువ దర్శకులకు మిడ్ డే మీల్స్
ఈ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని జరుపుకుంటున్న దర్శక దినోత్సవం సందర్భంగా పలు కొత్త నిర్ణయాలు తీసుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం. ఎంతో వైభవంగా ఎల్బీ స్టేడియంలో జయంతి కార్యక్రమం జరిపి తద్వారా వచ్చిన రుసుమును డైరెక్టర్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమానికి ఉపయోగించే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అంతేకాదు కొత్తగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న యువ దర్శకులు, నటీనటులకు మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేసి వారి ఆకలి బాధను పోగొట్టే మిషన్‌ను ఏర్పాటు చేశారు.అసోసియేషన్ కు ఒక శాశ్వత భవనంతో పాటు వయస్సు పై బడి విశ్రాంతి తీసుకుంటున్న అలనాటి దర్శకులకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి సైతం నడుం బిగించారు. ఈ పరిణామం ఎంతో గొప్పది. వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడుగా నిలిచినట్టు దాసరి నారాయణ రావు గారు పంచిన సుహృద్భావ సేవకు కొనసాగింపుగా ఈ సేవను పేర్కొనవచ్చు.
దాసరి స్ఫూర్తికి కొనసాగింపు
కవి, రచయిత, దర్శకుడు, నటుడు, సామాజిక వేత్త దాసరి నారాయణరావు గారి ఉదాత్త ఆశయాలను కొనసాగిస్తూ చేసిన ఈ నూతన ప్రయత్నం ఎంతో ఎందరో భావి దర్శకులకు, నటులకు సహాయకారిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. దాసరి నారాయణరావు ఎందరో నటీనటులను, సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఎందరికో కష్టాలలో అండగా పెద్దన్నగా నిలబడ్డారు. ఆయన స్పూర్తికి కొనసాగింపు ఈ ముందడుగు. ఈ ప్రయత్నం సుదీర్ఘంగా కొనసాగాలని కోరుకుంటూ తెలుగు దర్శకుల దినోత్సవ శుభాకాంక్షలు ......
కుమారస్వామి
సెన్సార్ బోర్డు మెంబర్
96767 26726