- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అప్పుల కుప్పలా భారత్!
భారతదేశంతో పాటు, రాష్ట్రాలు సైతం అప్పుల కుప్పలు అవుతున్నాయి. దేశం 155 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయి 2024 మార్చ్ నాటికి 160 లక్షల కోట్ల అప్పు దాటనున్నదని అంచనా ఉంది. కాగా, రాష్ట్రాలు ఇప్పటికే 75 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకు పోయాయి. ఒక్క ఒడిశా తప్ప ఏ రాష్ట్రం లోనూ అప్పులు తగ్గలేదు. ఒడిశాలో 2022 మార్చి నాటికి 1,39,356 కోట్ల అప్పు ఉండగా ఇందులో 15 వేల కోట్ల అప్పు తగ్గి 2023 మార్చి నాటికి 1,13,856 కోట్లకు తగ్గింది. దేశంలో ఒడిశా లోనే ఈ అద్భుతం జరిగింది. రాజకీయ స్థిరత్వం ఉన్న చోట ఇది సాధ్యంగా కనిపిస్తున్నది. ఒక విజన్ లేని కారణంగా, చాలా రాష్ట్రాల్లో అప్పులు పెరుగుతున్నాయి. కర్ణాటక 5,35,157 కోట్ల అప్పుల్లో ఉండగా, ఇందులో ఈ ఏడాదిలోనే 60,000 కోట్లు అప్పు చేశారు. పశ్చిమ బెంగాల్ 6 లక్షల 8,000 కోట్లు అప్పుల్లో ఉండగా, ఒక ఈ ఏడాదే 58,000 కోట్ల మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసింది. మహారాష్ట్ర 6,80,000 కోట్ల అప్పుల్లో ఉండగా, ఉత్తరప్రదేశ్ 7,10,000 కోట్ల అప్పుల్లో ఉంది. మార్చి 2023 నాటికి ఈ అప్పు 10 శాతం పెరిగింది. తమిళనాడు అప్పు 7 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్ అప్పు 4,42,000 కోట్లు, గుజరాత్ అప్పు 4,50,000 కోట్లు, మధ్యప్రదేశ్ అప్పు 4 లక్షల కోట్లు, తెలంగాణ అప్పు 3,75,000 కోట్లు, పంజాబ్ అప్పు 3 లక్షల కోట్లు, హర్యానా అప్పు 2,50,000 కోట్లు, జార్ఖండ్ అప్పు 1,50,000 కోట్లు...
అప్పులను దాచిపెట్టి..
ఇలా ప్రతీ రాష్ట్రం అప్పుల్లో ఎంతో కొంత కూరుకుని పోయి ఉంది. ఎన్నికల కోసం, అధికారం నిలుపుకోవడం కోసం కొత్త పథకాలు తీసుకుని రావడం, ఉచితాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అప్పులు ఇలా పెరుగుతూ పోతున్నాయి. సంక్షేమ పథకాల అమలు కూడా ఆర్థిక భారానికి ఒక కారణంగా పేర్కొనవచ్చు. మొత్తంగా ప్రస్తుతానికి కేంద్ర, రాష్ట్రాల మీద అప్పుల భారం 225 లక్షల కోట్లు ఉంది. ధరలు అదుపులో లేవు, పీఎస్‌యుల అమ్మకం, పెట్టుబడుల ఉపసంహరణ లాంటివి కూడా అనుకున్న విధంగా కేంద్రానికి వర్క్ అవుట్ కాలేదు. ఆరు లక్షల కోట్ల టార్గెట్ నిండలేదు, కొనుగోలు దారులు అనుకున్న రీతిలో రాలేదు. కేంద్రం ఆధీనంలోని 388 ప్రాజెక్ట్స్ ఆలస్యం కావడం వల్ల బడ్జెట్ మీద 4,65,556 కోట్ల అదనపు భారం పెరిగింది. మరో 345 ప్రాజెక్ట్స్ స్థితి అసలు తెలియడం లేదు. మొత్తం 23 లక్షల కోట్ల ప్రాజెక్ట్స్ మీద బడ్జెట్ భారం భారీగా పెరిగింది. 2024లో కొత్త ప్రాజెక్ట్స్ వచ్చే పరిస్థితి లేదు. కొన్ని ప్రాజెక్ట్స్ పనులు అసలు ప్రారంభమే కాలేదు. కొన్ని మధ్యలో ఆగి ఉన్నాయి. నమామి గంగే లాంటి గంగను శుద్ధి చేసే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు. నిజానికి దేశంలోని వాస్తవ ఆర్థిక పరిస్థితిని నీతి లేని, అబద్దపు, రాజకీయం వెలుగు చూడనీయకుండా దాచి పెడుతున్నది. 2024 ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి బీజేపీ వచ్చినా, లేదా కాంగ్రెస్‌తో కూడిన ఇండియా కూటమి అధికారం చేపట్టినా దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టడానికి ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ బలహీనతలను ఎప్పటి దాకా దాచి పెడుతారు.
అబద్ధాలు.. ప్రజలు నమ్మరు!
ఇక ధరల విషయానికి వస్తే, నిన్నటి దాకా టమాటా ధర 200 రూపాయలు పలికింది, ఇప్పుడిప్పుడే కొంత టమాటా ధర తగ్గి ఊరట పొందుతున్న సమయంలో ఉల్లి ధర ఇప్పుడు పెరుగుతోంది. మహారాష్ట్రలో ప్రభుత్వం ఉల్లి మీద పెంచిన సుంకం కారణంగా మండిలలో సమ్మె జరుగుతున్నది. ఈ సారి ఉల్లి ఉత్పత్తి కూడా తగ్గింది. వర్షం వల్ల ఇబ్బందులు వచ్చాయి. ప్రభుత్వ రైతు వ్యతిరేక నిర్ణయాల వల్ల, పాలు, పాల ఉత్పత్తులు సైతం దిగుమతి చేసుకోవడం లాంటి విధానాల వల్ల దేశం రైతులు ఆగం అవుతున్నారు. పప్పుల ధరలు 34 శాతం పెరిగాయి. మరోవైపు నిరుద్యోగం భారీగా పెరగడం, పని లేకుండా ఉండే వారి సంఖ్య పెరగడం ఇవన్నీ ఒకవైపు ఉండనే ఉన్నాయి.
మొత్తానికి లక్షల కోట్లు అప్పులు చేసి కూడా పౌరులకు మేలు జరిగింది లేదు! అసమానతలు పెరిగిపోయాయి. కేంద్రం ప్రకటించిన పది లక్షల ఖాళీల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లేదు. సామాన్యుడు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు బతకడానికి అప్పులు చేసే పరిస్థితి వచ్చింది. ఇదీ టూకీగా మన దేశం పరిస్థితి. ఇంకా మన ప్రధాని నరేంద్ర మోడీ మన దేశం విశ్వ గురు కాబోతోందని, అయిదో స్థానం నుంచి మూడో స్థానానికి మన ఎకానమీ ప్రపంచంలో చేరబోతుందని, పేర్కొంటారు! ఈ తానా షాహీ మాటలను ఏమనాలి? ఇంకా నల్లధనం వెలికి తీసి ప్రతీ పౌరుని అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పిన ముచ్చటనే ఆయన ప్రతీ మాటలో గుర్తుకు వస్తుంటుంది! వట్టి మాటలు నమ్మే పరిస్థితుల్లో ఇప్పుడు దేశ ప్రజలు లేరు మోడీజీ! ఏమి చెప్పినా నిజమా, అబద్దమా, అని క్రాస్ చెక్ చేసుకుంటున్నారు!...
ఎండి. మునీర్,
సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు,
99518 65223
- Tags
- india debts