- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నా ఓటు నేను అమ్ముకోను.. మరి మీరు?
రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే.. బతుకు బండిని నడిపేది పచ్చనోటేలే అని ఓ సినీ గేయ రచయితా జీవితంలో పచ్చనోటుకు ఉన్న విలువేంటో ఈ పాటలోనే చెప్పేశాడు. జీవితానికి పచ్చనోటు ఎంతో విలువైంది అది లేనిది జీవితం గడవదనేది జగమెరిగిన సత్యం. కానీ కొన్ని కొన్ని సార్లు డబ్బుతో కొనలేనివి ఉంటాయి అన్న విషయం కూడా మనకు తెలియాలి.. తెలుసుకోవాలి.. అప్పుడే మనం మనలాగా జీవించవచ్చు.. లేదా డబ్బే జీవితం అని బతికేస్తాం అంటే అంతకు మించిన నేరం ఇంకోటి లేదు అనే చెప్పాలి.. డబ్బుతో దేనినైన కొనగలమేమో కానీ నిన్ను నువ్వు అమ్ముకోలేవు.. కొనుక్కొలేవు కదా.. మరి నన్ను నేను అమ్ముకునేది ఏది అని ఆలోచిస్తున్నారా.. అదే ఓటు..
ఆయుధం కాని ఆయుధం
ఒకప్పుడు రాజుల కాలంలో రాజు తర్వాత రాజు... రాజు కొడుకే అన్న విషయం అందరికీ తెలిసిందే.. అందుకే రాజులు తమకు వారసులు పుట్టాలని కోరుకునే వారు.. కానీ రోజులు మారాయి.. పద్ధతులు మారాయి. అందుకు బిన్నంగానే... ప్రజల్ని పరిపాలించే వారిని ప్రజలే ఎన్నుకోవాలని రాజ్యాంగం ఆ అవకాశాన్ని ప్రజలకు ఇచ్చింది. మహానుభావులు.. అలా మనకు ఇచ్చిన ఆయుధం కానీ ఆయుధమే ఓటు. ఇది నిన్ను పరిపాలించే వాడిని నువ్వే ఎన్నుకోవడం. ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడు పెళ్లి కొడుకును ఎంచుకోవడానికి రాణికి చేసే స్వయంవరం లాంటిది ఇది.. జీవితాంతం తోడు ఉండేవాడు ఎలా ఉండాలో తన కన్న బాగా ఇంకెవరికి తెలుస్తుంది చెప్పండి. అందుకే కాబోలు రాజుల కాలంలో స్వయంవరం ఉండేది. ఇప్పుడు మనం వేసే ఓటు కూడా అలాంటిదే అని మరవకూడదు. చీకటి మయమైన మన జీవితాలను వెలుగులోకి నెట్టాలన్నా.. ఇంకా చీకటిలోకి నెట్టాలన్నా అది కేవలం రాజకీయం వల్లే సాధ్యం అవుతుంది. ఒకప్పుడు రాజకీయం అంటే ప్రజా సేవా.. ఇప్పుడు రాజకీయం అంటే వ్యాపారం కానీ వ్యాపారం.. పెట్టుబడులకు మించి రాబడులు ఉండాలని ఆలోచించే కీయం.. అదే రాజకీయ వ్యాపారం..
జీవితాన్నే అమ్మేస్తుంది ఓటు
మరి అలాంటి రాజకీయ నాయకున్ని ఎన్నుకునే హక్కు రాజ్యాంగం మనకు ఇచ్చింది. కానీ మనం ఏం చేస్తున్నాం ఒక్క పూట బిర్యానికి, ఒక్క మందు సీసకు లొంగి ఓటు అంటే అంగట్లో అమ్ముకునే సరుకులా తయారు చేసుకున్నాం. ఓటు అంటే మనది, మన పిల్లల భవిష్యత్తు అన్న సంగతి మరిచాం.. ఒకప్పుడు అక్షరాస్యత తక్కువగా ఉన్నప్పుడు కూడా ఓట్లను ఇంత దారుణంగా ఎవరూ అమ్మలేదు.. ఎవరూ కొనలేదు... ప్రస్తుతం పెరుగుతున్న అక్షరాస్యతలో ఇంత నీచంగా ఆలోచనలు తయారు చేసుకున్నాం. ఓటుకు ఇచ్చే డబ్బు ప్రజల నుంచి దోచుకున్న నల్ల ధనం కాబట్టి మనం తీసుకోవడంలో తప్పులేదు. అని మనల్ని మనం సర్ది చెప్పుకుని జీవితాన్ని అమ్ముకుంటున్నాం. నిజమే కావచ్చు అది నల్లధనమే అయినా దానిని ఒక్కరోజు గడవడానికి వాడుకోవడం సమంజసమా చెప్పండి. మనం కూలి వెలితేనే రోజు వెయ్యి రూపాయలు లేదా... తక్కువల తక్కువ ఐదు వందలు డిమాండ్ చేస్తాం.. లేదా రోజువారీ కూలి పడదని పని చెయ్యం.. ఒక్క రోజు కూలికే ఇంత ఆలోచించే మనం ఐదు సంవత్సరాలు ఓటు గురించి ఎందుకు ఆలోచించలేక పోతున్నాం చెప్పండి.. ఐదు సంవత్సరాలకు వెయ్యి రూపాయలు.. లేదా వంద రూపాయల మద్యం సీసీ అంటే రోజుకు ఎంతో మనం ఆలోచించాలి..
ఓటుకు నోటు మనకే చేటు
కూలి దగ్గర ఉన్న విలువను ఓటు దగ్గర తగ్గించుకుంటున్నాము. ఓటుకు నోటు మనకే చేటు అన్న విషయాన్ని మరిచిపోతున్నాం. వ్యాపారం చేసే వారు పది రూపాయలకు కొన్న వస్తువును 15 రూపాయలకు అన్నట్టుగా అమ్ముతుంటారు. మరి రాజకీయంలో మనకోసం కోట్లు పంచి పెట్టే వారు కనీసం రెండు కోట్లు ఆలోచించడం తప్పా.. రాజకీయ నాయకుడు దోచుకుంటే.. బాధపడుతున్నాం. కానీ అతనికి ఆ అవకాశం ఇచ్చింది మనమే అన్న సంగతి మరిచిపోతున్నాం. ఎవరైనా ఫ్రీగా డబ్బులు ఖర్చు పెట్టరు. ఇక్కడ మనం రాజకీయ నేతలు పంచే డబ్బు మనదే అని ఆలోచిస్తున్నాం. కానీ ఇంత డబ్బు ఎందుకు పంచుతున్నారు. అసలు ఓటు ఎంత విలువైనది అని ఆలోచించడం లేదు. వెయ్యి ఇచ్చారు వెయ్యమంటున్నారు. వేద్దాం. ఎవరు గెలిస్తే ఏం వస్తదిలే అని ఆలోచిస్తున్నాం. కానీ ఓటు వేశాక నీరు రావడం లేదని నీటి కోసం.. పంట పండాక అమ్మకం కోసం..రోడ్లు బాగోలేవని రోడ్లు వేయమని అడగడం కోసం.. ప్రభుత్వ బడులల్లో విద్య కోసం.. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యం కోసం వెళ్లినప్పుడు మనకు తెలియకుండానే వస్తుంది. ఓ పదం అదే ఈ సారి ఓటు వెయ్యమని అడగడండి చెబుతాం అని... అదిగో చూశారా అదే ఓటు శక్తి
ఓటు.. నోటుకు వేసే ముద్రకాదు
ఓటు అంటే నోటుకు తీసుకుని వేసే ముద్రకాదు. ఓటు అంటే భవిష్యత్తు.. ఓటు అంటే విద్య, వైద్యం, ఓటు అంటే అభివృద్ధి ఓటు అంటే గిట్టుబాటు.. మరి అలాంటి ఓటును ఒక్క రోజు బిర్యానీ ప్యాకెట్ కు, ఒక్క మందు సీసాకి.. అమ్ముకుంటే మనల్ని మనమే అమ్ముకున్నట్లు కదా..? మనం వేసే ఓటుకే విలువ లేకుంటే.. ఏ రాజకీయ నాయకుడి కోసం మనం కిందామీదా పడి కలవడానికి తపన పడుతామో ఓటు సమయంలో అదే నాయకుడు మన ఇంటి ముందుకు వచ్చి దేహి అని అడగడు.. కాబట్టి మనం నిజాయితీగా ఓటు వేసి.. అభివృద్ధిని నిలదీయడం మంచిది. రాజకీయ నాయకుల దగ్గర ఉచిత హామీలు, ఉచిత పథకాలు కాదు.. ఉచిత విద్య ఉచిత వైద్యం అడుగుదాం. అంతే కానీ గుంపులో గోవిందా అన్న చందంగా ఓటుకు వెయ్యి రూపాయలు తీసుకుని మన భవిష్యత్తు,, పిల్లల భవిష్యత్తు అభివృద్ధిని గంగలో కలుపుకోవద్దు.. ఓటును అమ్ముకుంటే నిన్ను నువ్వు (మనల్ని మనం) అమ్ముకున్నట్టే... అన్న సంగతి మరవకూడదు. నా తెలంగాణ ప్రజల్లారా.. మేలుకోండి.. ధన స్వామ్యాన్ని బద్దలు కొట్టండి - ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి' నోటుకి ఓటు అమ్ముకుంటే ఐదేళ్ల భవిష్యత్తు అధోగతే! ఎన్నికల్లో రాజకీయ నాయకులు చూపే డబ్బు ఎరకు ఆశపడితే మరో ఐదేళ్ల పాటు మోసపోవడం ఖాయమన్న సంగతి మర్చిపోవద్దు. ఓటు మన ఆయుధం.. దానిని నేను అమ్ముకోను.. మరి మీరు?
అమీనా కలందర్
కవయిత్రి, జర్నలిస్ట్
77994 26260