- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్ని రోజులీ అవమానాలు?
మాకు కావలసింది రాహుల్‌గాంధీతో కలిసి అన్నం తినడమో, మోడీతో కలిసి టీ తాగడమో కాదు. వర్ధంతి సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద అధికారికంగా నివాళులు అర్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అమరుల స్థూప నిర్మాణం పూర్తి చేయాలి. దయచేసి మాకు రాజకీయ రంగు పూయకండి. మాకు అన్ని పార్టీలూ సమానమే. మాకు న్యాయం చేసినవారికి రుణపడి ఉంటాం. మాకు ఆత్మ గౌరవం కావాలి. అవమానాలు కాదు. ప్రతి కుటుంబానికి గుర్తింపు కార్డు ఇవ్వాలి. వ్యవసాయ భూమి ఇవ్వాలి. ఇండ్లు కట్టించి ఇవ్వాలి. ఉచిత విద్య, వైద్య సదుపాయాలు కల్పించాలి. తల్లిదండ్రులకు పింఛన్ ఇవ్వాలి. అమరుల కుటుంబాలు ఒక సంఘంగా ఏర్పడాలి. మనం నాయకుల దగ్గరకు పోకుండా వారే మన దగ్గరకు వచ్చే విధంగా చేయాలి.
తెలంగాణలో రాహుల్‌గాంధీ రెండు రోజుల పర్యటన అమరవీరుల కుటుంబాలను అవమానాలకు గురి చేసేలా ఉంది. రాహుల్‌గాంధీ షెడ్యూల్ ప్రకారం అమరవీరుల కుటుంబాలతో లంచ్ చేస్తారని స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ, కుదరలేదు. ప్రభుత్వం నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక మండపం దగ్గరికి వెళ్లారు. చూసీచూడనట్టు వచ్చారు తప్ప, దీని గురించి మీడియాతో మాట్లాడలేదు అక్కడికి వచ్చిన వారితోనూ మాట్లాడలేదు. 'మేం ఏం పాపం చేశాం. ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు మమ్ములను అవమానాలకు గురి చేయడం ఎంతవరకు సమంజసం? మా బిడ్డలను కోల్పోవడమే మేము చేసిన ఘోరమా? మమ్ములను మనుషులుగా ఎప్పుడు గుర్తిస్తారు? రాజకీయ పార్టీలు సొంత డబ్బా కొట్టుకోవడం మాని తెలంగాణ అమరవీరుల త్యాగం వలననే వారు అలా ఉన్నామనే విషయాలను తెలుసుకోవాలి. ఆ రోజు అందరూ అమరుల పాడె మోసినవారే కానీ, ఈ రోజు పార్టీలు తమ వలననే తెలంగాణ వచ్చిందని గొప్పలకు పోతున్నాయి. మరి ఆ 1200 మంది త్యాగం ఎటుపోయింది?
వేడి పుట్టించడం కోసమేనా?
అన్ని పార్టీలకు మా త్యాగాలు కావాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ మా పేరు పలకడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మీలాంటి సత్తా ఉన్న నాయకులు మాత్రమే మాకు న్యాయం చేయగలరు. మా గురించి ఓ సారి ఆలోచన చేయండి. అమరుల తల్లిదండ్రులు పార్టీ పదవులు కోరుకోవడం లేదు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే అమరవీరుల తల్లిదండ్రులు చనిపోతున్నారు. వారు ఒంటరి అవుతున్నారు. న్యాయం చేయండని నాయకుల దగ్గరకు పోతే హీనంగా చూస్తున్నారు. చివరికి చీదరించుకునే పరిస్థితికి వచ్చాం. ఇలా ఎందుకు జరుగుతుందో ఆలోచన చేయాలి.
అమరవీరుల కుటుంబాల మధ్య ఐక్యత లేకుండా చేశారు. కొన్ని కుటుంబాలను తాము బాగుంటే చాలు అనుకునే విధంగా తయారుచేశారు. మేం నిత్యం మా త్యాగాల గురించి ప్రచారం చేస్తూ అందరికీ తెలిసే విధంగా చేస్తాం. అకస్మాత్తుగా అమరుల త్యాగము రాజకీయ వేడి పుట్టించడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. అన్ని ప్రధాన పార్టీలు అమరవీరుల త్యాగాలను నినదిస్తున్నాయి. మరి గడిచిన ఏడు సంవత్సరాల కాలంలో వీరి త్యాగం గుర్తురాలేదా? రాహుల్‌గాంధీ నిజంగానే సహంపక్తి భోజనం చేయాలనుకున్నారా లేదా రాజకీయాల కోసం త్యాగాలను వాడున్నారా? అనేది అనుమానంగానే ఉంది.
వారి త్యాగం ఏమైనట్టు?
త్యాగాలను గుర్తించి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. శ్రీకాంతాచారి ఆత్మహత్య నుంచి ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేశారు. కేసీఆర్ దీక్షతో ఉద్యమం మారిపోయింది. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అమరవీరులలో అర్హత కలిగినవారికి పది లక్షల చొప్పున ఇచ్చారు. ఇతర హామీలు మరిచారు. ఆయనను కలవడానికి ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. ప్రతిపక్ష పార్టీలు అయితే ఏ రోజూ అమరుల కుటుంబాల తరఫున మాట్లాడింది లేదు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని అమరులు గుర్తుకు వచ్చారు. వారి కుటుంబాలకు న్యాయం చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసే విధంగా కృషి చేయలేదు. బీజేపీ నేతలు అయితే కనీసం నివాళులు అర్పించడానికి కూడా రారు.
మాకు కావలసింది రాహుల్‌గాంధీతో కలిసి అన్నం తినడమో, మోడీతో కలిసి టీ తాగడమో కాదు. వర్ధంతి సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద అధికారికంగా నివాళులు అర్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అమరుల స్థూప నిర్మాణం పూర్తి చేయాలి. దయచేసి మాకు రాజకీయ రంగు పూయకండి. మాకు అన్ని పార్టీలూ సమానమే. మాకు న్యాయం చేసిన వారికి రుణపడి ఉంటాం. మాకు ఆత్మ గౌరవం కావాలి. అవమానాలు కాదు. ప్రతి కుటుంబానికి గుర్తింపు కార్డు ఇవ్వాలి. వ్యవసాయ భూమి ఇవ్వాలి. ఇండ్లు కట్టించి ఇవ్వాలి. ఉచిత విద్య, వైద్య సదుపాయాలు కల్పించాలి. తల్లిదండ్రులకు పింఛన్ ఇవ్వాలి. అమరుల కుటుంబాలు ఒక సంఘంగా ఏర్పడాలి. మనం నాయకుల దగ్గరకు పోకుండా వారే మన దగ్గరకు వచ్చే విధంగా చేయాలి.
నరేశ్‌నాయక్
తెలంగాణ అమరవీరుల
కుటుంబాల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు
85005 85982