- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజా పాలనలో ఆరోగ్య తెలంగాణ
తెలంగాణలో ప్రజా ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ప్రతి పౌరుడికి వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సర్కారు దవాఖానాలలో నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలను అందించేందుకు కావాల్సిన చర్యలను చేపట్టింది. హైదరాబాద్‌ను వైద్య రాజధానిగా తీర్చిదిద్దుతుతుంది.
దేశంలోనే తెలంగాణ అనేది మెడికల్ హబ్‌గా మారింది. దేశానికి ఆదర్శంగా తెలంగాణ వైద్యారోగ్య శాఖ నిలిచింది. వైద్యారోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి, ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయ కంగా మారింది. రాష్ట్రానికి ముఖ్యమం త్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి ప్రజా ఆరోగ్య భద్రతపై ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు.
అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు..
అలాగే హెల్త్ ఎడ్యుకేషన్, మెడికల్ టూరిజంకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇదే కాకుండా నాణ్యమైన వైద్య, విద్యను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ప్రైవేటు వైద్య విద్య కళాశాలలు ఆరోగ్య విశ్వవిద్యాల యం పర్యవేక్షణలో ఉండేవి. కానీ ఇక నుంచి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే పర్యవేక్షించనుంది. అలాగే ఇప్పటి వరకు ప్రైవేటు వైద్య, విద్య కళాశాలలు ఆరోగ్య విశ్వవిద్యాలయం పర్యవేక్షణలో ఉండేవి. కానీ ఇక నుంచి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే పర్యవేక్షించనుంది. ఇప్పటికే ఇదే విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. వైద్య విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయకుండా, స్టైఫండ్ విద్యార్థులకు సక్రమంగా అందే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
భారీ కేటాయింపులు..
పేదలకు సైతం ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులలో ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతో గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే గొప్ప పథకాన్ని అమల్లోకి తెచ్చింది. కానీ గత పాలకులు పెరిగిన వైద్య ఖర్చులకు అనుగుణంగా దీని పరిమితిని పెంచలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ఒకటైన రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతూ సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజుల్లోనే ఈ హామీని అమలు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులలో నర్సింగ్ సిబ్బందిని పెంచేందుకు 6,956 మంది స్టాఫ్ నర్సుల నియామకాలను చేపట్టారు. వైద్య రంగానికి బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. ఏకంగా రూ.11,500 కోట్లు కేటాయించారు. దక్షిణ భారతదేశంలో ప్రజా వైద్యంపై చేస్తున్న ఖర్చులో ప్రభుత్వ వాటా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. వైద్యం కోసం చేసే ఖర్చులో ప్రజలపై తక్కువ భారం పడుతున్న రాష్ట్రాలలో దేశంలోనే తెలంగా ణ 3వ స్థానంలో ఉంది. ఇదే కాకుండా ప్రసూతి మరణాల రేటు తగ్గింపులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది.
వైద్య కళాశాలల స్థాపనలో రికార్డు
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో మూడు వైద్య కళాశాలలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎయిమ్స్‌లో 100, ఈఎస్ఐలో 125 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 28 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,690 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, 28 ప్రైవేటు మెడికల్ కాలేజీలలో మరో 4,600 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 1,320 పీజీ సీట్లు ఉండగా, సూపర్ స్పెషాలిటీ పీజీ మెడికల్ సీట్లు 179, ప్రైవేటు కాలేజీల్లో మరో 1,566 పీజీ సీట్లు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి ఏటా 8,515 మెడికల్ గ్రాడ్యుడేట్స్, 6.880 మంది నర్సింగ్ గ్రాడ్యుయేట్స్‌తో పాటు 22,970 మంది పారా మెడికల్ కోర్సులను విజయవంతంగా పూర్తి చేస్తూ వైద్య సేవా రంగంలోకి వస్తున్నారు. ప్రతి మెడికల్ కళాశాలకు అనుబంధంగా 400 బెడ్ల ఆస్పత్రులు, స్పెషలిస్టు డాక్టర్లు అందు బాటులోకి వచ్చారు. ప్రజలకు కావాల్సిన వైద్య సేవలను మెరుగు పర్చేందుకు ప్రభుత్వం కావాల్సిన చర్యలను చేపట్టింది.
సర్కారు దవాఖానాల్లో నాణ్యమైన సేవలు..
ఒకప్పుడు ప్రజావైద్యం అంటే ఎక్కడో దూరంగా ఉన్న సర్కార్ దవాఖానాకు పోవాల్సి వచ్చేది. ఇప్పుడు గ్రామాల్లో పల్లె దవాఖానాలు, పట్టణాల్లోని బస్తీలలో బస్తీ దవాఖానాలు అందుబాలోకి వచ్చాయి. అంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా నాణ్యమైన వైద్యాన్ని అందించే వైద్యులు ప్రజలకు అందుబాటులోకి వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3500 పల్లె, 500 బస్తీ దవాఖానాలు ప్రజలకు కావాల్సిన నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నాయి. ఇవే కాకుండా ప్రైమరీ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా అప్‌గ్రేడ్ చేయడంతో అన్ని వేళలలో వైద్య సేవలు అందుతున్నాయి. ఇదే కాకుండా ప్రజలకు అవసరమైన వైద్య పరీక్షల కోసం ప్రభుత్వం డయాగ్నోస్టిక్స్ సెంటర్ల ద్వారా 57 రకాల పరీక్షలను ఉచితంగానే చేస్తోంది. డయాలసిస్ సెంటర్లను 102కు పెంచింది.
ప్రమాదాలకు ప్రైవేట్ సేవలు..
రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు అండగా నిలిచేందుకు కూడా ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తెచ్చే ఆలోచనలో ఉంది. రోడ్డు ప్రమాదం జరిగితే వైద్యం చేసేందుకు అందుబాటులో ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు నిరాకరించడమే ఎక్కువగా జరుగుతుంది. ఎక్కడో దూరంగా ఉన్న ప్రభుత్వ ఆస్ప త్రులకు క్షతగాత్రులను తరలించడం లో జరిగే ఆలస్యంతో ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు. సకాలంలో వైద్యం అంది స్తే ప్రాణాలు నిలిచే అవకాశాలు ఎక్కువ. అందుకే ఆ సమయాన్ని గోల్డెన్ అవర్స్ అని అంటాం. ఈ కీలక సమయంలో వైద్యం అందక ఎంతో మంది నిత్యం ప్రమాదాలలో మరణిస్తూనే ఉన్నారు. దీనిని నివారించే లక్ష్యంతో రూ.లక్ష వరకు ప్రైవేటు ఆస్పత్రులలోనే ఉచిత వైద్యం చేసే విధంగా ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన రహదారు లపై ప్రతి 35కి.మీ.కు ఒక ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ పథకం అమలైతే ఎంతో మంది ప్రాణాలను కాపాడొచ్చు.
డా.ఎన్.యాదగిరిరావు,
అదనపు కమిషనర్, జీహెచ్ఎంసీ
97044 05335
- Tags
- Prajapalana