గురుకుల బోర్డు అభ్యర్థుల నుండి రీలింక్విష్‌మెంట్ తీసుకోవాలి!

by Ravi |   ( Updated:2024-06-25 00:31:12.0  )
గురుకుల బోర్డు అభ్యర్థుల నుండి రీలింక్విష్‌మెంట్ తీసుకోవాలి!
X

తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే గురుకుల నియామక బోర్డు ఉపాధ్యాయ నియామక పత్రాలను గత డిసెంబర్ నెలలో హడావుడిగా అందించింది. ఫలితాల్లో అవరోహణ క్రమం పాటించకుండా ఒకే అభ్యర్థిని 3 - 4 పోస్టులకు ఎంపిక చేసింది. ఎంపిక కాబడిన అభ్యర్థుల నుండి (హామీ పత్రం) రీలింక్విష్‌మెంట్ తీసుకోలేదు. దీని వలన మెరిట్ అభ్యర్థులు 3 వేల మందికి పైగా అన్యాయానికి గురవుతున్నారు. దీనిని ప్రభుత్వం ఆర్భాట కార్యక్రమంగా నిర్వహించింది తప్ప, సరైన విధి విధానాలు పాటించలేదు. దీంతో విద్యావేత్తలు, మేధావులు, అభ్యర్థులు బోర్డు ప్రక్రియను తప్పుపడుతున్నారు. బోర్డు మాత్రం గతంలో ఇదే విధానంలో ఉన్నట్లు బుకాయిస్తోంది. అయితే బోర్డు సమాధానాలు అన్నీ అవాస్తవం. గతంలో ఎంపికైన వారి నుండి రీలింక్విష్‌మెంట్‌ను బోర్డు తీసుకునేది వాస్తవం. నిరుద్యోగుల పాలిట అన్యాయంగా ప్రవర్తిస్తున్న విధానాన్ని నిరసన రూపంలో అభ్యర్థులు తెలియజేస్తున్నా ప్రభుత్వం నుండి ఏ స్పందన లేకపోవడం శోచనీయం. అన్నీ గురుకుల సొసైటీలలో పదోన్నతులు, బదిలీలు, నూతన నియామకాలు చేపడుతున్న ఈ సమయంలోనైనా ప్రభుత్వం నుండి మెరిట్ అభ్యర్థులకు శుభవార్త రావాలి. ప్రభుత్వం వెంటనే స్పందించి గురుకుల నియామకాల్లో అవరోహణ పాటించేలా, రీలింక్విష్‌మెంట్ తీసుకునేలా నిర్ణయం వెలువడాలి. మెరిట్ అభ్యర్థుల జీవితాల్లో వెలుగులు నింపాలని అభ్యర్థులు కోరుతున్నారు.

- సామల కిరణ్,

కరీంనగర్,

9949394688

Advertisement

Next Story

Most Viewed