- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్మశాన కబ్జాలను ఆపాలి!
ఖమ్మం జిల్లాలో ఉన్న దళిత శ్మశానవాటికలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. ఖమ్మం నియోజకవర్గం 1226 గ్రామాల్లో సుమారు 550 గ్రామాల్లో దళితులకు శ్మశాన వాటికలు ఉన్నాయి. మిగితా గ్రామాల్లో అయితే శ్మశాన వాటికలే లేవు. అవి ఉన్న గ్రామాల్లో శ్మశానవాటికలకు వెళ్లేందుకు సరైన రహదారులు లేవు. ఇక్కడి పారిశుద్ధ్యం అధ్వాన పరిస్థితుల్లో ఉండటంతో అంత్యక్రియలు చేయడానికి వచ్చిన బంధుమిత్రులు ముక్కు మూసుకొని అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం హిందువుల కోసం వైకుంఠ దామాలను ఏర్పాటు చేసి వాటిలో సౌకర్యాలను అభివృద్ధి చేస్తోంది. అయితే దళిత శ్మశానవాటికల అభివృద్ధిపై దృష్టి సారించకుండా నిర్లక్ష్యపూరిత వైఖరితో వివక్ష కనబరుస్తుంది. దళితుల శ్మశాన భూముల కేటాయింపు కోసం ప్రభుత్వానికి ఎన్నోసార్లు సిఫార్సు చేసినా హామీలు తప్పా అందుకు అనుగుణంగా కేటాయింపు జరపడం లేదు. అలాగే శ్మశాన భూముల ఆక్రమణలు నేడు రాష్ట్రంలో పెద్ద సమస్యగా తయారైంది. కబ్జాదారులు ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు అధికార లేఅవుట్లతో పాటు మానవుల ఆఖరి మజిలీ అయిన శ్మశాన భూములను ఆక్రమించేస్తున్నారు.
సి.హెచ్ ప్రతాప్
95508 51075
- Tags
- Graveyards