- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గెస్ట్ లెక్చరర్లను ఆదుకోండి!
రాష్ట్ర రాజధానిలో చారిత్రాత్మక సిటీ కాలేజీలో 63 మంది గెస్ట్ లెక్చరర్లు ఉన్నారు. ఇక హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని 25 కళాశాలలో 400 పైగా గెస్ట్ లెక్చరర్లు పని చేస్తున్నారంటే డిగ్రీ విద్యా వ్యవస్థను పటిష్టం చేయడంలో గెస్ట్ లెక్చరర్ల అవసరం ఎంత ఉందో తెలుస్తుంది. ఇలాగే ప్రతి కళాశాలలో 10 నుండి 50కి పైగానే గెస్ట్ లెక్చర్‌లతోనే డిగ్రీ కళాశాలలు నడుస్తున్నాయి. గెస్ట్ ఫ్యాకల్టీ లలో పది సంవత్సరాల పైబడి పనిచేస్తున్న వారిని, అన్ని విద్యా అర్హతలు కలిగి ఉన్న మమ్మల్ని కాంట్రాక్టు పద్ధతిలోకి ఎందుకు మార్చరు? సర్వీస్‌ని ఎందుకు కంటిన్యూ చేయరు..?
10 సంవత్సరాల నుండి డిగ్రీ కళాశాలలో రెగ్యులర్ నోటిఫికేషన్ ద్వారా లెక్చరర్ల పోస్టుల భర్తీ చేయని కారణం ఒకటైతే, ఇంటర్ కాలేజీలలో నుండి ప్రమోషన్లు పొంది డిగ్రీ కాలేజీలకు రాకపోవడం వల్ల ప్రభుత్వం గత 12 సంవత్సరాల నుండి గెస్ట్ లెక్చరర్ల సేవలను వినియోగించుకుంటున్నారు. రాష్ట్రంలో డిగ్రీ కళాశాలలో 60 నుండి 70% వరకు గెస్ట్ లెక్చరర్ల సేవలతో నడుస్తున్నాయి. రాష్ట్రంలో 150 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1940 మంది గెస్ట్ లెక్చరర్లు పీజీ, డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నారు. వీరికి డాక్టరేట్ పట్టాలు, నెట్, సెట్ లాంటి ఉన్నత విద్య అర్హతలు కలిగి ఉన్నారు.
కూలీల కన్నా దారుణం..
రాష్ట్రంలోని రెసిడెన్షియల్ కాలేజీలలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులు ఒక్కసారి డెమో చెప్పి కన్సాలిడేటెడ్ పే తో ప్రతి సంవత్సరం కంటిన్యూగా కొనసాగుతారు. ఇంటర్, కేజీబీవీల్లో కూడా ఇదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. కానీ కేవలం డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులు మాత్రం ఉన్నత విద్య కమిషనరేట్ వారు జారీ చేసే నోటిఫికేషన్ ద్వారా, త్రి మెన్ కమిటీతో ప్రతి సంవత్సరం డెమో ఇచ్చుకుంటూ మళ్లీ కొత్తగా జాయిన్ కావలసిన వింత పరిస్థితి. ఆరు, ఏడు నెలల కాలానికి వచ్చే జీతం కోసం అందర్నీ మెప్పించాలి. దీని ద్వారా రెగ్యులర్, కాంట్రాక్టు ఉద్యోగుల మధ్య అనునిత్యం వారితో సమానం కాదనే భావనతో వివక్షతకు గురవుతున్నారు. వీరిని ప్రతి సంవ త్సరం పూర్తి విద్యా సంవత్సర కాలానికి నియమించుకొని యూనివర్సిటీల అల్మానాక్ ప్రకారం, వీరికి రెండు సెమిస్టర్లు కలిపి 180-200 రోజులకీ మాత్రమే వేతనం ఇస్తున్నారు. ఇది సమాన పనికి సమాన హక్కుకి విరుద్ధం. వీరికి సెలవు కాలంలో ఒక్క పైసా రాదు. దీంతో గెస్ట్ లెక్చరర్లుగా 30 సంవత్సరాలు పనిచేసినా సొంత ఇళ్లు, పిల్లలకు మంచి విద్య అందించలేని దౌర్భాగ్య స్థితిలో జీవితం గడుపుతున్నారు. పైగా ఉద్యోగ భద్రత లేని కారణంగా గెస్ట్ లెక్చరర్లు చనిపోయినా, ఏదైనా ప్రమాదం సంభవించినా సర్వం కోల్పోవాల్సిందే గానీ ప్రభుత్వం నుండి ఎలాంటి ఆర్థిక సహాయం అందదు. భవన నిర్మాణ, ప్రైవేట్ కంపెనీలలో కార్మికులుగా పనిచేస్తున్న వారికి కనీస హక్కులు అయినా అమలు అవుతాయి కానీ అతిథి అధ్యాపకులు రోజు కూలీల కన్నా అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నారు.
హవర్లీ బేస్డ్ వేతనం రద్దు చేసి..
గత ప్రభుత్వంలో గెస్ట్ లెక్చరర్ల సమస్యలపై అసెంబ్లీ సాక్షిగా ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆటో రెన్యువల్, కన్సాలిడేటెడ్ పే ఇస్తామన్న హామీని నెరవేర్చలేకపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కావున ఈ విషయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ప్రస్తుతం పనిచేస్తున్న 1940 మంది అతిథి అధ్యాపకులకు హవర్లీ బేస్డ్ వేతనం రద్దుచేసి యూజీసీ నిబంధనల మేరకు విద్యా సంవత్సరం మొత్తానికి ప్రతి నెల యాభై వేల రూపాయల కన్సాలిడేటెడ్ పే అమలు అయ్యే విధంగా, ప్రతి సంవత్సరం డెమో ద్వారా సెలక్షన్ చేసే విధానాన్ని రద్దు చేసి ప్రస్తుతం పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లను రెన్యువల్ చేయాలనే అంశాలపై చర్యలు తీసుకోవాలని ఈ ప్రజా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
- డాక్టర్. కొర్ర ఈశ్వర్ లాల్,
డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
94911 11983