రీయంబర్స్‌మెంట్ ప్లీజ్

by Ravi |   ( Updated:2023-01-13 03:34:42.0  )
రీయంబర్స్‌మెంట్ ప్లీజ్
X

త రెండు విద్యా సంవత్సరాలకు గాను తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయకపోవడంతో దాదాపు 16 లక్షల మంది విద్యార్థుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ఫీజు చెల్లించలేదని కాలేజీలు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు పై చదువులకు చదవడానికి మార్గం లేకుండా పోతోంది. ఫీజు రీయంబర్స్‌మెంట్ కోసం విద్యార్థులు తల్లితండ్రులు రెండు ఏళ్ల తరబడిగా నిరీక్షిస్తున్నారు. అప్పు చేసి ఫీజు చెల్లించిన వారు వడ్డీలు కట్టుకుంటూ రీయంబర్స్‌‌మెంట్ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు 2019-20, 2020-21 విద్యా సంవత్సరాలకు రూ.3, 350 కోట్లకు పైగా రీయంబర్స్‌మెంట్ స్కాలర్‌షిప్ బకాయిలు చెల్లించాలని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. 2021-22 విద్యా సంవత్సరం రీయంబర్స్‌మెంట్ దరఖాస్తుల పరిశీలన పూర్తయితే బకాయిల మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది.

రీయంబర్స్‌మెంట్ టోకెన్ల జారితోనే సరి.....

ఫీజు రీయంబర్స్‌మెంట్ మంజూరు చేసి ముందుగా టోకెన్లు జారీ చేస్తారు, ఆ తరువాత విద్యార్థుల బ్యాంకు ఖాతాలో నగదు జమ అవుతుంది. కానీ గత విద్యా సంవత్సరానికి సంబంధించి టోకెన్లు జారీ చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు విద్యార్థుల ఖాతాలో నగదు జమ కాలేదు. అదేమిటని విద్యార్థులు తల్లిదండ్రులు అధికారుల్ని ప్రశ్నిస్తే త్వరలోనే ఖాతాల్లో నగదు జమ అవుతుందని బదులుస్తున్నారు నెలలు తరబడి విద్యార్థులు తల్లిదండ్రులు సంక్షేమ శాఖ అధికారుల కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు, కాగా ఇటీవల రీయంబర్స్ మెంట్, స్కాలర్షిప్ చెల్లింపులకు వేరువేరుగా ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బిఆర్ఓ) విడుదల చేసింది. అయినా నేటికీ ఒక్క పైసా విడుదల చేయలేదు. నిధుల విడుదలకు ఇంకెంత సమయం పడుతుందని విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

త్రైమాసికంగా చెల్లించాలి కానీ..

ఒకేసారి ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్షిప్ చెల్లింపులు ఆర్థిక భారంగా మారడంతో వాయిదాల పద్ధతిలో ప్రతి మూడు నెలలకు ఒకసారి (త్రైమాసిక) చెల్లిస్తామని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది కానీ, అవి అమలులోకి రావడం లేదు. రీయంబర్స్‌మెంట్ విద్యా సంవత్సరం ప్రారంభంలో 25% మధ్యలో 50% విద్యా సంవత్సరం ముగిసే నాటికి మిగతా 25% చెల్లించాల్సి ఉంది. కానీ గత విద్యా సంవత్సరం ముగిసి నెలలు గడిచినా... నిధుల విడుదల ఊసే లేదు.

- సభావట్.కళ్యాణ్

ఏబీవీపీ రాష్ట్ర నాయకులు

9014322572

Read More...

ఎవరు తీసిన గోతిలో వారే పడతారు ..!


Advertisement

Next Story