- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనువాదమే ప్రపంచ వారధి
ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతికత పెరిగిన తర్వాత అనువాద రంగంలో యంత్రాల ప్రమేయం కూడా పెరిగింది. ఫలితంగా మెషిన్ ట్రాన్స్‌లేషన్ కూడా వచ్చింది. 1990 తర్వాత పెల్లుబికిన ప్రపంచీకరణ నేపథ్యంలో అనువాద ప్రక్రియ విస్తృతంగా జరుగుతున్నది, దానికి ప్రాముఖ్యతా పెరిగింది. అంతా అన్నీ ఇంగ్లిష్‌మయం అయిపోయిన స్థితిలో దాదాపు అన్ని రంగాలలో అనువాద అవసరం పెరిగింది. ఇవ్వాళ ముఖ్యంగా అయిదు రంగాలలో అనువాదం జరుగుతున్నది. అవి సాహిత్యానువాదం, సాంకేతికానువాదం, కార్యనిర్వాహకానువాదం, ఆర్థికానువాదం, చట్టాల అనువాదం, వీటికి తోడు వెబ్ సైట్ ల అనువాదం, మెడికల్, జీవశాస్త్ర, పేటెంట్, క్రీడా రంగాలలో కూడా అనువాదాల ప్రాముఖ్యత చాలా పెరిగిందనే చెప్పాలి.
ఇచ్చి పుచ్చుకోవడం' అన్న భావనే మనిషి మనుగడకు మూలాధారం అయ్యింది. అంతేకాదు 'తెలియంది తెలుసుకోవడం తెలిసింది పంచుకోవడం' అన్నది మానవ సంస్కృతిలో అంతర్భాగమయ్యింది. జీవన మార్గంగా మారింది. వేలాది లక్షలాది సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా భిన్న భాషలు, సంస్కృతులతో కొనసాగుతున్న మానవాళి ఈ భాషా, సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, అభివృద్ధి రంగాలలో కొనసాగుతున్న ఈ 'ఆదాన్ ప్రాధాన్' భావనతోనే ముందుకు సాగుతున్నది. మనిషి తనను తాను వ్యక్తం చేసుకోవడానికి కాలక్రమంలో భాషను గొప్ప మాధ్యమంగా రూపుదిద్దుకున్నాడు. అయితే, ఆ భాష అన్నిప్రాంతాలకూ ఏక రూపకంగా కాకుండా భిన్న రూపాలలో వ్యక్తమవుతూ, ఎదుగుతూ వచ్చింది.
కేవలం మన దేశ విషయం చూసినా భారత రాజ్యాంగం మొదట 14 భాషలను అధికార భాషలుగా గుర్తించి, తర్వాత ఆ సంఖ్యను 22 వరకు పెంచింది. నిజానికి మన దేశంలోనే ఇంకా ఎన్నో లెక్క లేనన్ని భాషలున్నాయి. వాటిలో లిపి ఉన్నవీ, లిపి లేనివి కూడా వున్నాయి. మరయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎన్ని భాషలున్నాయో చెప్పడం కష్టం. ఆ స్థితిలో ఒక ప్రాంతంలో ఒక భాషలో జరిగిన విషయాలు, విజయాలూ, పెల్లుబికిన భావాలూ, తాత్వికతలూ ఇతర ప్రాంతాలకు చేరడానికి, వాటిని ఒక భాష నుంచి మరో భాషలోకి చేరవేయడానికి తర్జుమా అవసరమయ్యింది. దాన్నే 'అనువాదం' అన్నారు.
ఏనాటి నుంచో ఉన్న ప్రక్రియ
ఈ అనువాదం ఇవ్వాలో నిన్ననో మొదలైంది కాదు. క్లాసికల్ సాహిత్య కాలం నుంచి వుంది. ఇట్లా భావాలని పంచుకోవడం పెంచుకోవడంలో ప్రధాన భూమికను పోషిస్తున్న అనువాదం కోసం ఐక్య రాజ్య సమితి 30 సెప్టెంబర్‌ను ప్రపంచ అనువాద దినోత్సవంగా కూడా నిర్వహిస్తున్నది. మానవ జీవన గమనంలో అనువాదానికి వున్న ప్రాధాన్యతను ముందుకు తేవాలన్నది దాని ముఖ్య ఉద్దేశ్యం. నిజానికి ఇవ్వాళ అనువాదానికి అంత ప్రాధాన్యం, ప్రాముఖ్యత ఉందా? వుంటే అనువాద అభివృద్ధికి ఏ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది అందరూ ఆలోచించాల్సి వుంది. అసలీ అనువాద ప్రక్రియ ఎట్లా వుంటుంది? అంటే ఏ భాషలోంచి అనువాదం చేయాలను కుంటామో దాన్ని మూల భాష అనీ, ఎందులోకి చేయాలనుకుంటామో దాన్ని లక్ష్య భాష అనీ అంటున్నాం. అనువాదం చేయాలనుకున్న అనువాదకునికి మూల భాష, లక్ష్య భాషలు రెండింటిలో మంచి ప్రవేశం వుండాలి. ఆయా భాషల గ్రామర్ సింటాక్స్ తెలిసి వుండాలి. అనువాదకుడు ద్విభాషా పరిజ్ఞానం కలిగి వుండాలి.
భాషలే కాకుండా అనువాదకుడికి ఆ రెండు సంస్కృతుల విషయ పరిజ్ఞానం కూడా వుండి తీరాలి. అప్పుడే మూల భాషతో పాటు ఆ భాషా ప్రాంతపు వాతావరణం కూడా లక్ష్య భాషలోకి సమర్థవంతగా అనువదించబడుతుంది. ఈ అనువాదాన్ని ముఖ్యంగా రెండు రకాలుగా చెబుతారు. ఒకటి యథాతథానువాదం, రెండవది స్వేచ్ఛానువాదం. యథాతథానువాదంలో మూలంలో వున్నది ఉన్నట్టుగా అనువదించడం కాగా, స్వేచ్ఛానువాదంలో మూలంలోని మౌలిక అంశాలు చెడకుండా అనువాదకుడు కొంత సృజనాత్మక స్వేచ్చ తీసుకోవడం. ఇక్కడ యథాతథానునువాదానికి నిఘంటువుల అవసరం వుంటుంది, స్వేచ్ఛానువాదానికి సృజనాత్మక మనసు కూడా అవసరమవుతుంది. శాస్త్ర సాంకేతిక అంశాల అనువాదానికి యథాతథానువాదమే అనువైనది. సాహిత్య సృజనాత్మక అంశాలకు స్వేచ్ఛానువాదం అభిలషనీయమైనది. ఇక్కడ అనువాదంలో విశ్వసనీయత, పారదర్శకత అన్న అంశాలు కూడా ప్రదానమైనవే.
ప్రపంచీకరణ నేపథ్యంలో
ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతికత పెరిగిన తర్వాత అనువాద రంగంలో యంత్రాల ప్రమేయం కూడా పెరిగింది. ఫలితంగా మెషిన్ ట్రాన్స్‌లేషన్ కూడా వచ్చింది. 1990 తర్వాత పెల్లుబికిన ప్రపంచీకరణ నేపథ్యంలో అనువాద ప్రక్రియ విస్తృతంగా జరుగుతున్నది, దానికి ప్రాముఖ్యతా పెరిగింది. అంతా అన్నీ ఇంగ్లిష్‌మయం అయిపోయిన స్థితిలో దాదాపు అన్ని రంగాలలో అనువాద అవసరం పెరిగింది. ఇవ్వాళ ముఖ్యంగా అయిదు రంగాలలో అనువాదం జరుగుతున్నది. అవి సాహిత్యానువాదం, సాంకేతికానువాదం, కార్యనిర్వాహకానువాదం, ఆర్థికానువాదం, చట్టాల అనువాదం, వీటికి తోడు వెబ్ సైట్ ల అనువాదం, మెడికల్, జీవశాస్త్ర, పేటెంట్, క్రీడా రంగాలలలో కూడా అనువాదాల ప్రాముఖ్యత చాలా పెరిగిందనే చెప్పాలి.
వీటిలో మార్పు రావాలి
ఇదంతా ఇట్లా వుంచి, సాహిత్యానువాద విషయమే తీసుకుందాం. అసలు అనువాదమనేదే లేకుంటే సంస్కృతం, లాటిన్ అరబిక్ లాంటి భాషలలో వున్న క్లాసికల్ సాహిత్యం మనకు అందేదే కాదు. కేవలం ప్రాచీన సాహిత్యమే కాదు, ఆధునిక కాలంలో కూడా వివిధ భాషలలో వస్తున్న అద్భుత సాహిత్యం అనువాదాల ద్వారానే అందరికీ అందుబాటులోకి వస్తున్నది. మన తెలుగు భాషా సాహిత్యాల విషయానికి వస్తే అధిక శాతం నేరుగా మూల భాషల నుంచి కాకుండా మధ్యలో ఇంగ్లిషును మాధ్యమంగా చేసుకున్న అనువాదాలే ఎక్కువ. అయినప్పటికీ మన 'ఇరుగు పొరుగు' భాషలతో పాటు వివిధ దేశాల సాహిత్యం కూడా మనకు అందుబాటులోకి వస్తున్నది. చాలా మంది కవులు రచయితలు విమర్శకులు అనువాదాలు చేస్తున్నారు. కానీ, తెలుగులో పూర్తి స్థాయి అనువాదకుల కొరత ఇంకా వుంది. అంతే కాదు వివిధ భాషల నుంచి తెలుగులోకి సాహిత్యం వస్తున్నది కానీ, మన సాహిత్యం ఇంగ్లిషుతో సహా ఇతర భాషలకు వెళ్తున్నది చాలా తక్కువే.
ఫలితంగా తెలుగులో వస్తున్న గొప్ప సాహిత్యం ప్రపంచానికి అంతగా అందడం లేదన్నది వాస్తవం. ఈ స్థితిలో మార్పు రావాల్సిన అవసరం వుంది. వివిధ భాషల నుంచి సాహిత్యాన్ని తెలుగులోకి తేవడంతో పాటు మన సాహిత్యాన్ని వివిధ భాషలకు తీసుకెళ్లే కృషి జరగాలి. అందుకోసం అధికారంలో వున్న తెలుగు తెలంగాణా సాహిత్యఅకాడెమీలు, విశ్వవిద్యాలయాలూ చొరవ చూపాలి. వాటిని మించి స్వచ్ఛంద సంస్థల కృషీ అవసరమే. వ్యక్తులుగా చేస్తున్న కృషీ తక్కువేమీ కాదు. సాహిత్యానువాదాలు ఏమేరకు జరిగినా.. ఆహ్వానించ దగ్గవే.. అభినందించాల్సిందే. (207 మంది కవులు వివిధ భాషలలో రాసిన 281 కవితలను 158 మంది రచయితలు తెలుగులోకి అనువదించారు. 'దేశదేశాల కవిత్వం' పేరిట వెలువడుతున్న ఈ కవితాసంపుటిని నేటి సాయంత్రం తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఆవిష్కరించనున్నారు)
వారాల ఆనంద్
94405 01281
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672.