- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
24 ఫ్రేమ్స్: వెండితెర దేశభక్తుడు మనోజ్ కుమార్ గురించి తెలుసా
హై ప్రీత్ జహాన్‌కీ రీత్ సదా
మై గీత్ వహాన్‌కీ గాతా హూన్
భారత్‌కా రహనేవాలా హూన్
భారత్‌కీ బాత్ సునాతా హూన్
అంటూ అనేక పాటలకు నటించి మంచి పేరు గడించారాయన. ఆయన హీరోగా నటించిన అనేక సినిమాలలో ఆయన పాత్ర పేరు 'భరత్". ఆయన నటించిన అనేక సినిమాలు దేశభక్తిని ప్రభోదించినవే. అందుకే మనోజ్‌కుమార్‌ను వెండితెర దేశభక్తుడు అంటారు. ఆయన గత తరం నాయకుడు. స్వాతంత్ర్యానంతరం జరిగిన దేశ విభజనకు బలైన లక్షలాది మందిలో తానూ ఒకడిని అని భావించే మనోజ్ కుమార్ భగత్‌సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా 1965 లో 'షహీద్' సినిమా రూపొందించారు. అది గొప్ప విజయాన్ని సాధించింది. అప్పటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రీకి ఆ సినిమా బాగా నచ్చింది.
1965లో జరిగిన భారత్-పాకిస్తాన్ యుద్ధం తర్వాత శాస్త్రి గారు మనోజ్‌కుమార్‌ను పిలిచి అభినందించారు. అంతేకాకుండా దేశానికి తానెంతో స్ఫూర్తిదాయకంగా ఇచ్చిన 'జై జవాన్-జై కిసాన్' నినాదం ఆధారంగా ఒక మంచి సినిమా రూపొందించమని అడిగారు. ప్రధాని సూచనల మేరకు స్పందించిన మనోజ్‌కుమార్ 'ఉప్‌కార్' సినిమా తీసారు. అందులో స్వయంగా రైతుగానూ, సైనికుడిగానూ నటించాడు. 'ఉప్‌కార్' విజయవంతమైన సినిమాగా నిలిచింది. జాతీయస్థాయిలో ద్వితీయ ఉత్తమ చిత్రం అవార్డుతోపాటు నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలనూ అందుకుంది. 'ఉప్‌కార్' సినిమా అనగానే..
'మేరె దేశ్‌కీ ధర్తీ సోనా ఉగ్లే ఉగ్లే హీరే మోథీ
యే బాగ్ హై గౌతం నానక్‌కీ, ఖిల్తే హై అమన్‌కే ఫూల్ యహాన్
గాంధీ, సుభాష్, టాగోర్, తిలక్ ఐసే హైన్ ఫూల్ చమన్‌కే యహాన్'
రంగ్ లాల్ హై లాల్‌బహదూర్ సే'
పాట గుర్తొస్తుంది. గుల్షన్ బావరా రాసిన ఆపాటకు కళ్యాణ్‌జీ-ఆనంద్‌జీ సంగీతం సమకూర్చారు. మహేంద్రకపూర్ చాలా గొప్పగా పాడారు. ఇప్పటికీ జాతీయ ఉత్సవాలలలో గౌరవంగా వినిపిస్తుంది. ఇక ముందూ వినిపిస్తూనే ఉంటుంది. అలా దేశభక్తి సినిమాల హీరోగా వినుతికెక్కిన మనోజ్‌కుమార్ తన కెరీర్‌ను 1957 ప్రారంభించారు. 30 యేళ్లకు పైగా నటనా జీవితంలో కొనసాగారు. 1937లో ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న అబోతాబాద్‌లో జన్మించారు. అసలు పేరు హరికృష్ణ గోస్వామి. దేశ విభజన తరువాత వారి కుటుంబం ఢిల్లీకి వచ్చింది. చిన్నప్పటి నుంచి సినిమాలు చూడడంలో ఎంతో ఆసక్తి ఉన్న ఆయన ఢిల్లీ హిందూ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసాడు. దగ్గరి బంధువు లేఖ్‌రాజ్ భక్రి ద్వారా హిందీ సినిమాలలో ప్రవేశించారు.
లేఖ్‌రాజ్ అప్పటికే షమీకపూర్‌తో 'తంగేవాలి' లాంటి సినిమాలు తీసారు. బాంబేలో పేరున్న నిర్మాత. ఆయన సూచనల మేరకు బాంబే చేరినప్పటికీ మనోజ్‌కుమార్‌కు చిత్ర పరిశ్రమ వెంటనే స్వాగతం చెప్పలేదు. ఆరు నెలలపాటు పాత్రల కోసం తిరుగుతూనే కథలు, స్క్రిప్టులు రాసుకోవడం మొదలు పెట్టారు. హోమీ సేత్నా సినిమా 'గంగూతేలి' తో సినిమా ప్రవేశం జరిగింది. లేఖ్‌రాజ్ నిర్మించిన ఫాషన్, చాంద్ లాంటి సినిమాలలో చిన్న చిన్న పాత్రలు వేశారు. 1961లో హెచ్ఎస్ రవెల్ రూపొందించిన 'కాంచ్‌కీ గుడియా'తో హీరోగా తెర మీదికి వచ్చాడు. అదే సమయంలో 'రేశ్మీ రుమాల్' లాంటి సినిమా అవకాశాలూ వచ్చాయి. అనంతర కాలంలో మనోజ్‌కుమార్‌కు 'హర్యాలీ ఔర్ రాస్తా' 'హిమాలీకే గోద్ మే' 'వోహ్ కౌన్ థీ' లాంటి సినిమాలతో స్టార్ ఇమేజ్ వచ్చింది. అప్పుడే మనోజ్ 'షహీద్' సినిమా స్క్రిప్ట్ రాసుకున్నారు. నిర్మాత కేవల్ కాశ్యప్, రాంశర్మ దర్శకత్వంలో తీసాడు. 1960 తర్వాత గుమ్‌నామ్, ఫత్తర్ కే సనం, పెహచాన్, సన్యాసీ, బేమాన్, దస్ నంబరీ లాంటి సినిమాలతో స్టార్ స్టేటస్ సాధించాడు. స్క్రిప్ట్ రచనలో ప్రావీణ్యం ఉన్న మనోజ్ అనేక సినిమాలకు ఘోస్ట్ దర్శకుడిగా కూడా పని చేసాడు.
దేశభక్త కళాకారుడు
1967లో మనోజ్‌కుమార్ రూపొందించిన 'ఉప్‌కార్' ' సినిమాను ఆయన '16 వేల అడుగుల జాతీయ జెండా' గా అభివర్ణించారు. ధర్మేంద్రతో కలిసి అనేక సినిమాలలో నటించారు. ఆయన నటించిన పూరబ్ ఔర్ పశ్చిం, షోర్, రోటీ కప్‌డా ఔర్ మకాన్, క్రాంతి లాంటి సినిమాలు మంచి పేరు ప్రతిష్టలను తెచ్చి పెట్టాయి. మంగల్ పాండే నుంచి మొదలు గాంధీ వరకు జీవిత చరిత్రలను కలిపి 'భారత్ కే షహీద్' పేర సీరియల్ తీసేందుకు ఆయన చేసిన ప్రయత్నం వివిధ కారణాల వలన సాధ్యం కాలేదు. 1999లో దేశభక్తి కథాంశంతో 'జై హింద్' పేర తాను తీయదలుచుకున్న సినిమా నిర్మాణం సుదీర్ఘంగా సాగి విఫలం అయ్యింది.
మనోజ్‌కుమార్ తన అనేక సినిమాలలో భూమిపుత్రుడుగానూ, పాశ్చాత్య విలువల వ్యతిరేకిగానూ, దేశభక్తిని బోధించే కళాకారుడిగానూ వివిధ పాత్రలను పోషించాడు. ఆయన కృషికి గుర్తింపుగా ఫిలిం ఫేర్ జీవన సాఫల్య (లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ వ్మెంట్) పురస్కారాన్నీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని, పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు. పలు సినిమాలకు ఉత్తమ రచయిత లాంటి అనేక అవార్డులూ వచ్చాయి. అట్లా మనోజ్‌కుమార్ తన స్క్రీన్ పాత్రల ద్వారా దేశభక్తిని ప్రభోదించారు. భరత్ పాత్రకు ప్రతినిధిగా విజయం సాధించారు. దేశం 75 సంవత్సారాల ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా మనోజ్‌కుమార్ కృషిని పునర్ మూల్యాంకనం చేయాల్సిన ఆవసరం ఉంది.
వారాల ఆనంద్
94405 01281