- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజమౌళి, శంకర్‌లలో బెస్ట్ ఎవరు?
ఇదివరకటి రోజుల్లో దక్షిణాది దర్శకులకు దేశవ్యాప్తంగా స్టార్ డమ్ అనేది ఉండకపోయేది. దానికి కారణం గ్లోబల్ మార్కెట్ అందుబాటులో లేకపోవడమే. అయితే 19, 20వ దశకంలో దక్షిణాదిలో పేరెన్నికగల దర్శకులను పరిశీలిస్తే మొదట శంకర్, తరువాత మణిరత్నం పేర్లనే ప్రముఖంగా చెప్పుకోవాల్సి వచ్చేది. వారు తీసిన సినిమాలు సామాజిక బాధ్యతతో కథ, కథనాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండేవి, అదే సమయంలో సమాజానికి ఓ సందేశం సైతం ఇచ్చేవిగా ఉండేవి. దర్శకుడు శంకర్ తీసే సినిమాలైతే సమాజాన్ని ఆలోచింపజేసే విప్లవాత్మకతకు తోడు అధునాతన సాంకేతికతను జోడించి అత్యద్భుతం అనిపించేలా ఆయన సినిమాలుండేవి. ఇప్పటికీ శంకర్ సినిమాలకు రాష్ట్రాలకు సంబంధం లేకుండా ఆయా భాషల్లోని స్టార్ హీరోలకు సమానంగా వీరాభిమానులు ఉన్నారు.
ఇక ప్రస్తుతం దక్షిణ భారతదేశం గర్వించే దర్శకుల పేర్లను చెప్పాల్సివస్తే మొదట రాజమౌళి పేరునే ప్రముఖంగా చెప్పుకుంటున్నారు. ఇందుకు అపజయం ఎరుగని దర్శకునిగా, గ్రాఫిక్స్‌ను మేళవించి విజువల్ గ్రాండియర్‌గా సినిమాను ఆయన ప్రజెంట్ చేసే తీరు, ఆయన సినిమాల్లో ఎమోషన్స్, పగ ప్రతీకారాలను, డ్రామాను పండించే తీరు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ రాజమౌళిని ఇండియన్ దర్శకునిగానే కాకుండా ప్రస్తుతం గ్లోబల్ దర్శకునిగా ఎదిగేలా చేసాయి.
కానీ, రాజమౌళి ఎంచుకునే కథలకు, తీసే సినిమాలకు దర్శకుడు శంకర్ ఎంచుకునే కథలకు, తీసే సినిమాలను పోల్చి చూస్తే ఇద్దరిలో ఎంతో తేడా కనిపిస్తుంది. ఒక సినిమాను సమాజానికి పనికొచ్చే విధంగా ఎంత బాగా తీయవచ్చు ఒక సినిమా దర్శకునికి సామాజిక బాధ్యత ఉంటే సమాజానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది అనే విషయాలను ఆలోచిస్తే రాజమౌళి తీసే సినిమాలకు, శంకర్ సినిమాలకు ఉన్న తేడా, ఆ ఇద్దరు దర్శకులకు ఉన్న తేడా, ఆ ఇద్దరు దర్శకుల్లో ఎవరు మేటి అనే విషయాలు ఇట్టే అర్థమయిపోతాయి.
రాజమౌళి సినిమాలు ఎంత ఖరీదైన గ్రాఫిక్స్‌తో తెరకెక్కించినా.. అందులో మూల కథ పగ ప్రతీకారాలు చుట్టే తిరుగుతుందనేది కాదనలేని వాస్తవం. ఇందుకు ఉదాహరణలుగా స్టూడెంట్ నెంబర్ వన్ మినహా సింహాద్రి నుండి బాహుబలి, ఆర్ఆర్ఆర్ వరకు అన్ని సినిమాలను పరిశీలించినా దాదాపు అన్ని సినిమాలు పగ ప్రతీకారాల చుట్టే కథలు తిరుగుతుంటాయి. ఇలాంటి సినిమాల మూలంగా సమాజానికి ఒరిగే లాభమేమి లేదనేది కూడా వాస్తవమే. కానీ, శంకర్ సినిమాల విషయానికొస్తే ప్రతి సినిమాను జనరంజకంగా గ్రాఫిక్స్ మేళవించి చూపడమే కాకుండా ప్రతి సినిమాలో ఏదో ఒక సమాజానికి ఉపయోగపడే అంశం ఆయన సినిమాలలో తప్పకుండా ఉంటుంది. జెంటిల్ మెన్, ఒకే ఒక్కడు, భారతీయుడు, రోబో, శివాజీ లాంటి సినిమాలను సమాజం పట్ల ఎంతో బాధ్యత ఉన్న వ్యక్తి తీసిన సినిమాలుగా అభివర్ణించవచ్చు. శంకర్ సినిమాలు సమకాలీన రాజకీయాలను సైతం ప్రభావితం చేసిన దాఖలాలు ఉన్నాయి. సమాజంలో యువతను చైతన్యం చేసిన దాఖలాలూ ఉన్నాయి.
ఇక స్టార్ కాస్టింగ్ విషయానికొస్తే.. రాజమౌళి కేవలం యువ హీరోలను మాత్రమే తన సినిమాల్లో హీరోలుగా చూపుతూ సీనియర్ నటులైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ల నటనను ఇండియన్ సెల్లులాయిడ్‌పై ఆవిష్కరించే బాధ్యతను తీసుకోలేదు. కానీ, శంకర్ తన తమిళ సీనియర్ నటులు, సూపర్ స్టార్లైన రజనీకాంత్, కమలహాసన్, అర్జున్ లాంటి వారి నటనను మరో మెట్టు ఎక్కించి వారి నటనలో గొప్పతనాన్ని తన దర్శకత్వ ప్రతిభతో దేశం నలుమూలలా తెలిసేలా చేసాడు.
మరో విషయాన్ని గమనిస్తే.. రాజమౌళి ఎంతో స్వార్థంగా ఆయన సినిమాలకు ఆయన కుటుంబ సభ్యులనే ఉపయోగించుకొని ఆయన దర్శకత్వంలో ఇతర టెక్నీషియన్లకు అవకాశాలు కల్పించకుండా చూసుకుంటాడు అని విమర్శలున్నాయి. అంటే నిర్మాత వెచ్చించే బడ్జెట్‍లో సగానికి పైగా రాజమౌళి కుటుంబానికి చెందాల్సిందే.. కుటుంబ సభ్యులే సినిమాలోని వివిధ రంగాల్లో పనిచేస్తే తనకు సౌకర్యవంతంగా ఉంటుందని రాజమౌళి అభిప్రాయం కావచ్చు. కానీ దర్శకుడు శంకర్ అలా కాదు. తన దర్శకత్వంలో చేయాలనిపించే వారిని ప్రోత్సహిస్తూ, బంధుప్రీతి చూపించకుండా అత్యుత్తమ స్టార్ క్యాస్ట్‌ను తన సినిమాలకు పని చేసేలా చేస్తూ బడ్జెట్‌లో 24 క్రాఫ్ట్‌లకు చెందిన పలు రకాల టెక్నీషియన్లకు లైఫ్ ఇస్తుంటారు.
భారత దేశం గర్వించదగ్గ దర్శకులైన ఇద్దరు దర్శకులలో అత్యుత్తమ దర్శకుడు ఎవరు అనే విషయాన్ని విశ్లేషిస్తే మన తెలుగు సినిమాను దేశం ఎల్లలు దాటించి మనకు ఆస్కార్ తెచ్చిపెట్టాడనే విషయాన్ని మర్చిపోకుండా రాజమౌళిని బెస్ట్‌గా ఓటేసుకున్నా.. దర్శకుడు శంకర్‌తో రాజమౌళిని పోల్చే సాహసం చేయలేమని అందరూ ఒప్పుకోక తప్పదు.
ఇవి కూడా చదవండి: రంగమార్తాండ ఎక్కడ విఫలమయ్యాడు?
శ్రీనివాస్ గుండోజు
99851 88429