- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Donald Trump: విజయ గజమెక్కి శ్వేతసౌధంలోకి...
అమెరికా ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ వీడింది. అమెరికా ప్రజలు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా స్పష్టమైన తీర్పు చెప్పారు. 538 ఎలక్టోరల్ ఓట్లు కలిగిన అమెరికాలో అధ్యక్షుడి పీఠం అధిరోహించాలంటే 270 ఓట్లు సాధించాలి. రిపబ్లికన్ పార్టీ మెజార్టీ మార్క్ దాటింది. దీంతో అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక లాంఛనమే కానుంది.
కొంత విరామంతో ఒక అభ్యర్థి అమెరికా అధ్యక్ష స్థానంపై తిరిగి కూర్చోవడం 131 ఏళ్ల తర్వాత ఇదే. అంతేకాదు.. 2016 నాటి ఫలితాలకు భిన్నంగా ఈసారి పాపులర్ ఓటు కూడా ట్రంప్‌నకే లభించింది. ఆయనకు దాదాపు 51 శాతానికి పైగా ఓట్లు లభించగా.. హారిస్ 47 శాతం వద్దే ఆగిపోయారు.
'ఆమె'కు దూరంగా అమెరికా
ఎన్నో దేశాలు మహిళలను ఉన్నత స్థానంపై కూర్చోబెడుతుంటే... ప్రపంచంలో అత్యంత పురాతన ప్రజాస్వామ్యంగా ప్రచారం చేసుకునే అమెరికా మాత్రం ఇప్పటిదాకా ఆ అవకాశం ఇవ్వలేదు. ఈ అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ విజయం అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో అత్యంత ఆశ్చర్యకరమైన సంఘటనలలో ఒకటి. డొనాల్డ్ ట్రంప్ ఎలక్టోరల్ కాలేజీ ఓటును గెలుచుకున్నారు. అనేక కీలక రాష్ట్రాల్లో సాంప్రదాయ రిపబ్లికన్ ఓటర్లను సమీకరించడంలో అతను విజయం సాధిం చాడు. రక్షణవాద, వలస వ్యతిరేక వైఖరి ద్వారా కార్మిక మధ్యతరగతి ఓటర్లను, ఆకర్షించడంలో కూడా విజయం సాధించాడు. అధ్యక్షునికి ఇది అద్భుతమైన పునరాగమనం. 78 ఏళ్ల వయసులో ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అతి పెద్ద వ్యక్తి.
కాల్పులు.. ప్రచారంలో మలుపులు
అమెరికా అధ్యక్ష ఎన్నిక ప్రతి దశలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అధ్యక్ష అభ్యర్థిపై హత్యాయత్నం జరగ్గా..మరోసారి ప్రచారం మధ్యలో ఏకంగా ప్రధాన పార్టీ అభ్యర్థినే మార్చేసింది. ప్రచారం ఆసాంతం నువ్వా నేనా అన్నట్లు సాగింది. 2024 అధ్యక్ష ఎన్నికల ఫలితం ఎక్కువగా స్వింగ్ రాష్ట్రాలపైనే ఆధారపడింది. కీలకమైన స్వింగ్ రాష్ట్రాలు అనూహ్యంగా ఈ సారి ట్రంప్‌కి మద్దతు తెలిపాయి. ఎన్నికల్లో విజయం సాధించి, అధ్యక్ష పదవిని తిరిగి పొందిన ట్రంప్ అంతర్జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపగలరు. అమెరికా విదేశాంగ విధానంలో పెను మార్పులు చేయటానికి అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడిగా తన మొదటి పదవీకాలం నుండి, డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలను గట్టిగా వ్యతిరేకిస్తూ "మేక్ ఇన్ అమెరికా" విధానాలను సమర్థించేవారు. ఈ ఎన్నికల్లో విదేశీయులు అమెరికన్ల నుండి ఉద్యోగాలు తీసుకుంటున్నారనే ఆంశాన్ని ప్రచార అస్త్రంగా వినియోగించడం వల్ల యువతపై అది ప్రభావం చూపింది. యువ ఓటర్లు ట్రంప్‌కు మద్దతు పలికారు.
ఫలించిన ప్రభుత్వ వ్యతిరేకత
పెరుగుతున్న ద్రవ్యోల్బణంకి తోడుగా రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ సుదీర్ఘ పోరాటానికి అమెరికా, దాని పాశ్చాత్య మిత్రదేశాలు నిధులు అందించడం కొనసాగిస్తున్నందున విమర్శలు పెరిగాయి. ఇంతలో, ఇజ్రాయెల్ గాజాలో కాల్పుల విరమణ కోసం అమెరికా పిలుపులను ధిక్కరించింది, లెబనాన్, ఇరాన్‌తో సహా మధ్య ప్రాచ్యం అంతటా తన సైనిక చర్యలను పెంచింది. ఈ చర్యలను అమెరికన్ ఓటర్లు ఆమోదించలేదు. అందుకే ట్రంప్‌కు పట్టం కట్టారు. డొనాల్డ్ ట్రంప్ విజయపథంలో దూసుకుపోవడానికి ఒక పెద్ద కారణం ఉందంటే అది స్వదేశంలో వ్యాపించిన బలమైన అధికారపక్ష వ్యతిరేక భావన. ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమెరికా ఓటరుకు నచ్చినట్లుంది. ఎన్నికలకు ముం దు, దేశంలో ఆర్థిక పరిస్థితులు అధ్వా నంగా ఉన్నాయని 62 శాతం మంది ప్రజ లు విశ్వసించారు. అందుకే ఈసారి ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టగల వ్యక్తికి పట్టం కట్టాలని నిర్ణయించుకున్నట్లు, అందుకే ట్రంప్ వైపు మొగ్గు చూపినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
మైటీ ట్రంప్... వీక్ హారిస్
ట్రంప్‌కు అనుకూలంగా మారిన మరో అంశం ఇమ్మిగ్రేషన్ లేదా అక్రమ వలసలు అమెరికన్ ప్రజలకు ఎలా ముప్పు కలిగిస్తాయి అనే అంశంపై ప్రచారం మొత్తంగా, వలసలపై తన కఠినమైన వైఖరిని నొక్కి చెప్పాడు. అదనంగా, ట్రంప్ అపరిమిత శైలి, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థపై వాగ్దానాలతో పాటు, బలమైన దృక్కోణాలు కలిగిన దృఢమైన వ్యక్తిగా ఉండటం, అమెరికాకు మొదటి స్థానం ఇవ్వడంపై, కొనసాగుతున్న యుద్ధాలను అంతం చేయడంపై ఆయన చేసిన వ్యాఖ్యలు అన్నీ కలిసి తన గెలుపునకు దోహదపడ్డాయి. దేశ గ్రామీణ ప్రాంతాల్లోనూ డొనాల్డ్ ట్రంప్ భారీ విజయం సాధించడంలో ఆశ్చర్యం లేదు. తన ఎన్నికల ప్రచార నినాదమైన ‘విల్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ విజయ మంత్రమైంది. విజయ గజమెక్కి శ్వేతసౌధంలోకి ట్రంప్ మరో మారు అడుగు పెట్టడాన్ని స్వాగతించక తప్పదు. అగ్ర రాజ్య ఆధ్యక్షుడిగా విశ్వ రాజకీయ యవనికపై ట్రంప్ తిరిగి కీలక భూమిక పోషించాలి.
- వాడవల్లి శ్రీధర్
99898 55445