- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీడీపీఓ నియామకాలలో వివక్ష
పని ప్రదేశంలో మహిళలు లైంగిక వేధింపులకు గురయ్యే అవకాశం ఉందన్న ప్రభుత్వ వాదన నిజమైతే, వంద శాతం మహిళలు ఉండే డ్వాక్రా వ్యవహారాలు చూసుకునే పేదరిక నిర్మూలన సంస్థలో అత్యధికంగా పురుషులే ఉద్యోగులుగా ఎలా ఉన్నారు? మిగతా శాఖలలోనూ మహిళా ఉద్యోగులతోపాటు పురుష ఉద్యోగులూ ఉన్నారు కదా! అంతెందుకు, మహిళా శిశు సంక్షేమ శాఖలోనే జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగులలో మహిళలతో పాటు పురుషులు ఉండగా లేని లైంగిక వేధింపులు సీడీపీఓ ఉద్యోగాలలో పురుషులకు అవకాశం ఇవ్వడం ద్వారానే ఉంటాయనడం సరైంది కాదు.
మహిళా శిశు సంక్షేమ శాఖలో కీలకంగా ఉండే సీడీపీఓ ఉద్యోగాల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వం లింగ వివక్ష చూపిస్తున్నది. నిజానికి సీడీపీఓ ఉద్యోగాలకు మహిళలతో పాటు పురుషులు కూడా అర్హులే అని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలలో ఉంది. దీనిని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కూడా ధ్రువీకరించింది. అయినా, 2018లో టీఎస్‌పీఎస్‌సీ ద్వారా భర్తీ చేసిన 68 సీడీపీఓ ఉద్యోగాలకు పురుషులను పరిగణనలోకి తీసుకోలేదు. మహిళా అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పించారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో పురుషులు ఉంటే మహిళలు లైంగిక వేధింపులకు గురయ్యే అవకాశం ఉందని, అందుకే సీడీపీఓ ఉద్యోగాలలో మహిళలకే అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేశామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరి, పదోన్నతుల ద్వారా పురుషులకు సీడీపీఓలుగా, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌గా, కేబినెట్ మంత్రిగా అవకాశం ఇస్తున్నపుడు లేని నిబంధనలు టీఎస్‌పీఎస్‌సీ ద్వారా భర్తీ చేసిన ప్రత్యక్ష నియామకాలలో మాత్రమే ఎందుకు ముందుకు వస్తాయో అర్థం కాని పరిస్థితి.
అక్కడ అందరూ ఉన్నారుగా?
పని ప్రదేశంలో మహిళలు లైంగిక వేధింపులకు గురయ్యే అవకాశం ఉందన్న ప్రభుత్వ వాదన నిజమైతే, వంద శాతం మహిళలు ఉండే డ్వాక్రా వ్యవహారాలు చూసుకునే పేదరిక నిర్మూలన సంస్థలో అత్యధికంగా పురుషులే ఉద్యోగులుగా ఎలా ఉన్నారు? మిగతా శాఖలలోనూ మహిళా ఉద్యోగులతోపాటు పురుష ఉద్యోగులూ ఉన్నారు కదా! అంతెందుకు, మహిళా శిశు సంక్షేమ శాఖలోనే జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగులలో మహిళలతో పాటు పురుషులు ఉండగా లేని లైంగిక వేధింపులు సీడీపీఓ ఉద్యోగాలలో పురుషులకు అవకాశం ఇవ్వడం ద్వారానే ఉంటాయనడం సరైంది కాదు. ఇటీవల సింగరేణి కాలరీస్ జూనియర్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు మహిళలు మాత్రమే అర్హులని ఆ సంస్థ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ నోటిఫికేషన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ,21 ను ఉల్లంఘిస్తోందని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. ఉద్యోగాల భర్తీలో లింగ వివక్ష చూపరాదని, నోటిఫికేషన్ రద్దు చేసి పురుషులకు కూడా అవకాశం కల్పిస్తూ మరల నోటిఫికేషన్ జారీ చేయాలని స్పష్టంగా తీర్పునిచ్చింది.
ఆ ఆలోచనలే మనకెందుకు?
ఉమ్మడి రాష్ట్ర పాలకుల ఆలోచనా విధానాలను వ్యతిరేకించిన తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలనుకున్నారు. కానీ, ఉద్యోగ నియామకాలలో గత పాలకులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలనే నేటి పాలకులు కూడా సాకుగా చూపుతున్నారు. సమాజశాస్త్రంతో పాటు సంఘ సంక్షేమ శాస్త్రం చదివినవారికి ప్రభుత్వంలో ఉండే ఏకైక ఉద్యోగం సీడీపీఓ నియామకాలలో లింగ వివక్ష చూపుతున్నారు. దీంతో ఈ కోర్సు చేసిన పురుషులు శాశ్వత నిరుద్యోగులుగా మారుతున్నారు. కావున త్వరలోనే విడుదల కాబోతున్న నియామకాలలో లింగ వివక్ష చూపకుండా ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ల విధానాలను అనుసరించి మహిళలతో పాటు పురుష అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించాలని కోరుతున్నాం.
గత నోటిఫికేషన్ కంటే ముందు నుంచే ప్రస్తుత ఐటీ పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావుగారితో పాటు నాడు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, ఈ శాఖకు ప్రత్యేక కార్యదర్శి ఎం.జగదీశ్వర్‌గారిని కలిసి విన్నవించగా సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం వివక్ష లేకుండా రాబోయే ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేదా న్యాయ పోరాటానికి దిగుతామని తెలంగాణ విశ్వవిద్యాలయల సమాజ శాస్త్ర, సంఘ సంక్షేమ శాస్త్ర ఐక్య విద్యార్థి జేఏసీ నుంచి తెలియజేస్తున్నాం.
మానిక్ డోంగ్రే
శాతావాహన యూనివర్సిటీ
సోషియాలజీ జాక్ లీడర్
99515 87876