- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
అసెంబ్లీ నిర్వహణలో కాంగ్రెస్ సక్సెస్!
దశాబ్దకాలం పరిపాలించిన కేసీఆర్ పాలనలో ప్రతిపక్ష పార్టీలకు మాట్లాడే అవకాశం చాలా తక్కువగా ఉండటమే కాకుండా ప్రతిపక్ష పార్టీ సభ్యులు అత్య ధికంగా హేళనకు గురయ్యేవారు. కానీ ప్రస్తుత సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే ప్రతిపక్ష పార్టీలకు అత్యధికంగా మాట్లాడే సమయం ఇవ్వాల నీ, వారు ఎంత అలజడి సృష్టించాలని చూసినా శాసనసభ నుండి వారిని బయటికి పంపవద్దనీ, నిజానిజాలు ప్రజలకు అసెంబ్లీ వేదిక ద్వారా తెలియజేయాల్సిన అవసరం బాధ్యత గల అధికార పక్షానికి ఉంటుందనీ స్పీకర్‌కి విన్నవిస్తూ సభను నడిపించారు.
గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సమయంలో శాసనసభ సమావేశాలు చాలాసార్లు బీఆర్ఎస్ పార్టీ అంతర్గత సమావేశాల లాగా ఉండేవని ఎంతోమంది మేధావులు బహిరంగంగా ప్రకటించారు. కేసీఆర్, వారి కుటుంబాలకు చెందిన మంత్రుల శాఖలు తప్ప మిగతా అన్ని శాఖల గురించి కూడా కేసీఆర్ లేదా కేటీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో, బయట ప్రకటనలు గుప్పించడం ప్రజలు మరవలేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో ప్రతి ఒక్క మంత్రి బాధ్యతగా వ్యవహరిస్తూ తమ శాఖలను స్వేచ్ఛగా, స్వతంత్రంగా నిర్వహించారు. శాసనసభ వ్యవహారాలు, ఐటీ శాఖ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు ఓ వైపు శాసనసభ నిర్వహణలో తలమునకలై ఉంటూనే... మరో వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో సమన్వయం చేస్తూ ప్రతిపక్షాల ప్రశ్నలకు సున్నితంగా ఘాటైన సమాధానం చెబుతూ చాక చక్యంగా వ్యవహరించిన తీరు ఎంతో మంది యువ రాజకీయ నాయకులకు ఆదర్శనీయం.
సమన్వయంతో చర్చల్లో ఆధిపత్యం
ముఖ్యంగా శాసనసభ నిర్వహణలో అధికార ప్రతిపక్ష పార్టీలకు మధ్య సమన్వయం చేస్తూ గత పది సంవత్సరాల ఆచారాలకు భిన్నంగా చాలా అంశాలపై అర్ధరాత్రి వరకు విస్తృత చర్చలు జరిపేటట్టు చర్యలు తీసుకోవడంలో శాసనసభ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అత్యద్భుతంగా పనిచేసింది. తెలంగాణ చైతన్యం గల నేల. ప్రతి రాజకీయ నాయకుని ప్రవర్తనను విధి నిర్వహణను తెలంగాణ సమాజం చాలా నిక్కచ్చిగా పరిశీలించి అవసరమైన సమయంలో స్వేచ్ఛగా తమ నిర్ణయాన్ని వెలిబుచ్చే ఆచారం ఇక్కడి మట్టికి ఉంది. అధికారం కోల్పోయిన అక్కసుతో ప్రతిపక్ష పార్టీ, అధికారంలోకి వచ్చిన ఆనందంలో అధికార పార్టీ తమ పరిధిని దాటి వ్యవహరిస్తే ప్రజలు బుద్ధి చెప్పిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ బడ్జెట్ సమావేశాలు గత సమావేశాలకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ చర్చల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని తెలంగాణ ప్రజలు స్పష్టంగా భావిస్తున్నారు.
మాచనపల్లి శ్రీధర్
90527 89666